Sunday 25 November 2012

నాకీ జ్వరం వద్దు

                   గత సోమవారం రాత్రి నా స్నేహితురాలు పిలిచింది. తనతో మాట్లాడతూ బాగా అలసిపోయి ఉన్నందువల్ల లైట్ తీయకుండానే నిద్రపోయాను. రాత్రంతా సరిగా నిద్రపోలేదు. ఏదో తెలియని కల నన్ను మెలుకువలోకి తెస్తూ, దాన్నుంచి బయటపడి మళ్లీ నిద్రలోకి జారుకుంటూ ఉన్నాను. చాలా సార్లు మెలుకువ రావడం వల్ల నాకు తెలియకుండానే నేను ఎక్కువసేపు నిద్రపోయానేమోనని ఒక ఆందోళన మనసులో. ఇంత గందరగోళం మధ్య ఉదయం 7 గంటలకు లేచి ఓపిక చేసుకుని లైట్ కట్టేసి కాసేపు నిద్రపోయాను. ఇంత కలత నిద్ర పోయేసరికి నాకు జ్వరం వచ్చేసింది :((.
                ఈ మధ్య మా ఆఫీసు వాళ్ళు రవాణా విషయంలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. మేము క్యాబ్ ముందుగానే రిజర్వు చేసుకుని కూడా ఆరోజు దాంట్లో వెళ్ళకపోతే నేరుగా మా మేనేజర్ గారికి ఒక మెయిల్ పంపుతారు. దానికి తగిన వివరణ ఇవ్వాలి తర్వాత. ఇదంతా ఒక కష్టతరమైన పని అని నేను దాదాపు మా ఆఫీసు రవాణాని ఉపయోగించుకోను. గోటితో పోయేదానికి కొరివి దాక తెచ్చుకోవడం ఎందుకు.?? నా దరిద్రం నా వెంటపడి నేను ఆరోజే క్యాబ్ రిజర్వు చేసుకున్నాను. నేనే దాని గురించి ఎక్కువ బుర్ర పాడు చేసుకుని ఒంట్లో ఓపిక లేకపోయినా వెళ్దామని బయలుదేరాను. అసలే  నాకు ఇలాంటి విషయాల్లో చాలా భయం. క్యాబ్ వచ్చే ఒక 20 నిముషాల ముందే నుంచే స్టాపులో ఉంటాను. ఆరోజు కూడా యథావిదిగా అలాగే వెళ్లాను. నిలబడటానికి ఒంట్లో ఓపిక లేదు. ఇంక ఒక రెస్టారెంట్ మెట్ల పైన కూర్చొని సరిగ్గా క్యాబ్ వచ్చే 5 నిముషాల ముందు లేచి స్టాప్ దగ్గర నిలబడ్డాను. ఈలోపు ఒక ఆటోవాడు వెనక్కి తన ఆటోని నా కాలి మీదగా నెట్టాడు. నిజంగా నాకు ఈ జ్వరం వద్దు!! ఆఫీస్ అంత కంటే వద్దని అనిపించింది. ఆ నొప్పికి కంట్లో నుంచి కన్నీళ్లు. 
             ఆఫీస్లో మందులు అడిగి తీసుకుని పైకి వెళ్లి పుచ్చకాయ ఒక ప్లేట్ తీసుకుని తిందామని ముందు పెట్టుకుంటే తినబుద్ది కావట్లేదు. చుట్టూ ఉన్నవాళ్ళను అందరిని చూస్తున్నా "ఒక్కళ్ళు కూడా నేను ఎందుకు తినట్లేదు, తిను " అని చెప్పట్లేదు. చెప్పలేనంత దుఃఖం. నేను ఇలా జ్వరంతో ఉంటే ఇంట్లో ఎంతగా ముద్దు చేసి చూసుకునేవాళ్ళు అని వస్తున్నకన్నీళ్లను బలవంతంగ ఆపుకుని తిని మందులు వేసుకున్నాను. సీట్ దగ్గరకు వెళ్లి మేనేజర్ని అనుమతి అడిగి వెళ్ళిపోదామని అనుకుంటే.. ఆయన ఒక గంట వరకు మీటింగ్లో ఉంటారని తెలిసింది. నా కంప్యూటర్ ముందు కూర్చుని ఆ ఒక్క గంట ఎప్పుడెప్పుడవుతుందా అని చూస్తున్నాను. ఆ తర్వాత ఆయన్ని నేను ఇప్పుడు వెళ్తాను అని అనుమతి అడిగితే, నీ మేనేజర్ ఇప్పుడు నేను కాదు, ఈరోజే మారారు. నువ్వు కొత్త మేనేజర్ ని అడుగు అని చెప్పారు. చాలా భాధగా అనిపించింది. అసలు ఓపికలేక,కూర్చోలేక..అలా అని నిద్రపోలేక నానా అవస్థలు పడుతుంటే ఇదొకటా? అని నా కంప్యూటర్ ని చూస్తూ ఎవరికీ కనిపించకుండా బాగా ఏడ్చేసి కొత్త మేనేజర్ స్టేటస్ చుస్తే అయానేమో offline. సరే అని లేని ఓపిక తెచ్చుకుని ఇంకొక గంట కూర్చున్న తర్వాత ఇంక నా ఒంట్లోని ఓపిక అంత అయిపోయేసరికి ఒక మెయిల్ పెట్టేసి బయలుదేరాను. ఒకపక్క జ్వరం బాధిస్తుంటే అరే!! ఎందుకు ఒకరి బాధని అసలు అర్థం చేసుకోరు అని బాధపడుతూ హాస్టల్ కి వచ్చేసాను. ఇంక వచ్చిన వెంటనే అక్క నుంచి ఫోన్, ఏమైంది? ఎలా ఉంది?అని ఒకపక్క నీరసం గొంతులో తెలుస్తుంటే, మనసులో వాళ్లతో లేనని బాధ కలిసి అసలు మాటలే రావట్లేదు. బలవంతంగా బావున్నాను అని బావురుమన్నాను. అయితే నేను ఈరోజు నీ దగ్గరికి బయలుదేరుతాను. నువ్వు బాధపడకు అని అంది. ఇంకా తను చూపించే ప్రేమకు నేను ఎక్కువ ఏడుస్తానని తన కాల్ మధ్యలోనే కట్ చేసి ఒక పది నిముషాల తర్వాత మళ్లీ నేనే తనకి ఫోన్ చేసి "ఏం వద్దు! నేను ఇప్పుడు పడుకుంటాను. సాయంత్రం మళ్లీ  చెప్తాను తగ్గకపోతే" అని చెప్పాను.  
                     మధ్యాహ్నం కూడా ఏమి తినకపోవడంవల్ల మళ్లీ పడుకుని లేచే సరికి నీరసం. మనం ఇంత నీరసంగ ఉంటే ఎవరైనా పట్టించుకుంటారా?? అంటే ఎవరి పనులతో వాళ్ళు తీరిక లేకుండా ఉన్నారు. ఒక పక్క నీరసం, ఒక పక్క బాధ, ఏడుపు నేను ఒంటరిగా జ్వరంతో ఉన్నానని. మరి ఏం తినకపోతే నీరసం వస్తుందని లేచి వెళ్లి హోటల్లో రెండు ఇడ్లీలు తీసుకుంటే ఒక్కటి తినడానికి చాలా కష్టపడ్డాను. గదికొచ్చి నిద్రపోదామనుకుని అనుకుంటుండగా అమ్మ నుంచి ఫోన్,
                  "ఎలా ఉంది ఇప్పుడు?"
                  "బానే ఉంది మా.."
                  "తిన్నావా?"
                  "మ్మ్..తిన్నాను మా"
                  "ఏం తిన్నావ్?"
                  "ఇడ్లీ "
                  " ఎన్ని తిన్నావ్?"
                  "రెండు " ( అబద్దం చెప్పాను.. అమ్మ బాధపడుతుందని)
                  "ఎన్ని తీసుకున్నావ్?"
                  "రెండు తీసుకున్నాను..రెండు తినేసాను మా.."(నమ్మించడానికి)
                  "allout పెట్టావా?"
                  "మ్మ్ "
                  " స్వెట్టర్ వేసుకున్నావా?"
                  "మ్మ్"
                  "మఫ్ఫ్లర్(తలకు చుట్టుకునేది) కట్టుకున్నావా?"
                  "లేదు మా, నా దగ్గర లేదుగా"
                  "ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లమంటే నువ్వు పట్టించుకోవు"
                  "మా..నా స్వెట్టర్కి క్యాప్ ఉంది."
                  "సరే.. అయినా చెవిలో దూది పెట్టుకో..చల్లగాలి దూరకుండా"
                  "నీళ్లు తెచ్చుకున్నావా? రాత్రి దాహమేస్తే కష్టమవుతుంది."
                  "తెచ్చుకున్నాను."
                  "సరే మరి.. మందు వేసుకున్నావ్ గా.."
                  "ఆ అమ్మా.. "
                  "వెంటనే తగ్గిపోతుందిలే.. నువ్వు బాగా నిద్రపో.."
                  "ఊ అమ్మా..ఉంటాను"
                  "మళ్లీ రేపు ఉదయాన్నే ఫోన్ చేస్తాను.."
            నా కంటి నుంచి ధారగా కన్నీళ్ళు.. అమ్మ నువ్వు కావాలి అని.. అలా అని తనతో చెప్పి తనని బాధపెట్టలేను. అమ్మకి దగ్గరగా నేను లేకపోయినా తన ప్రేమ ఎప్పుడూ నన్ను ఎంతటి బాధ నుంచైనా కాపాడుతుంది. తనకి నేను బానే ఉన్నానని, ఉంటానని చెప్పాను. సో అలాగే ఉండాలి అని నిద్రపోయాను. అయినా ఇంత చిన్న జ్వరానికే ఇంతలా డీలా పడిపోతే ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి వస్తే నిజంగా తట్టుకోలేవా ? అని నా బుద్ధి నా మనసుని అడిగింది.
              నా మనసు నువ్వు ఎన్నైనా చెప్పు..జ్వరం వస్తే అమ్మ,నాన్న కావాలి..( ఇంకా చెప్పాలంటే కృష్ణవంశీ సినిమాల్లో ఉన్నంతమంది నా చుట్టూ ఉన్నప్పుడు)...వాళ్ళతో ఉన్నప్పుడు ఏది వచ్చిన నేను తట్టుకుంటాను అని బుద్ధికి బాగా గడ్డి పెట్టింది. :) ఇంకొక చిలిపి ఊహ ఏంటంటే ఇప్పుడు మా అమ్మ ప్రేమను నేను ఎంతగా పొందుతున్నానో.. నాకు పిల్లలు పుట్టిన తరువాత.. "ఆమ్మా.. దాస్తావెందుకు అని.." (krack cream) ప్రకటనలోలాగా నేను చెప్పకుండానే వాళ్లే వచ్చి నాకు cream రాయాలి. ఏంటి?? అదోలా చూస్తున్నారు.. అంటే ఎప్పుడూ నేను సేవ చేయించుకోవడమేనా?? నేను చేసేదుందా!!! అనా!!! :D :D 

     
               
                   

22 comments:

  1. andaru ila talachu kunte enta baguntundo!!!!

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీరాఘవ గారు, నా బ్లాగుకు స్వాగతం మీకు. చాలా సంతోషపరిచారు మీ వాత్సల్యమైన వ్యాఖ్యతో.

      Delete
  2. nijame kadaa lakshmi raghava garu
    nice post andi

    ReplyDelete
    Replies
    1. మంజు గారు, నా బ్లాగుకు స్వాగతం. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు.

      Delete
  3. hmmm hostel lo inti ki dooranga unnappudu ilanti vi mammule...i faced the same situation...enka na daridram yenti ante ma roommates kuda leru aa roju...chala bada ga lonely ga anipinchindi...

    ReplyDelete
    Replies
    1. అవునండీ, హాస్టల్లో ఉంటే ఇలాంటి అనుభవం ఒక్కసారైనా ఎదురవుతుంది.

      Delete
  4. ha ha anduke lovers ni maintain cheyali antaru intlo dooram ga unapudu..:p

    ReplyDelete
    Replies
    1. ha s...correct ga chepparu...

      Delete
    2. చాలా అనుభవంతో చెప్తున్నట్టున్నారు సందీప్ గారు.:D:D
      @ Anonymous, మీరు కూడా..

      Delete
  5. బాగుందండి.. అమ్మ ప్రేమకి ఎంతటి జ్వరమయినా పారిపోవాల్సిందే.. అందుకే అమ్మ మన దగ్గర ఉండాలి అమ్మలా మనం వాళ్ళ దగ్గిర ఉండాలి.. బాగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. రమణి గారు, నా బ్లాగుకు స్వాగతం,మీరింక బాగా రెండు వాక్యాల్లో చెప్పారండి..ధన్యవాదాలు:)

      Delete
  6. ఏంటి చిన్ని గారు, చిన్న జ్వరానికే ఇలా బాధపడిపొతున్నారు :)

    ReplyDelete
  7. శ్రీనివాస్ గారు,
    ఏమోనండీ!! ఈ విషయంలో కొంచెం ధైర్యంగా ఉండాలనుకుంటాను, కానీ ఇప్పటిదాకా అలా ఉన్నట్టు కనిపించలేదు, ఈసారి మాత్రం ఇంతలా డీలాపడిపోను.:)

    ReplyDelete
  8. "చుట్టూ ఉన్నవాళ్ళను అందరిని చూస్తున్నా "ఒక్కళ్ళు కూడా నేను ఎందుకు తినట్లేదు, తిను " అని చెప్పట్లేదు" anyaayam akramam.. abaddham... nenu adagaledhu ninnu?? Thinu, tablets avi sarigaa vesuko.. malli malli chebuthunnaa sariga thinu ani??!!!!! Ee vaakhya nu nenu kandisthunnaanu adhyakshya.

    ReplyDelete
  9. నేనూ hostel లో ఉన్నప్పుడు ఇలానే అనుకునేదాన్ని,ఎవరైనా అడగొచ్చుగా,తినిపించోచ్చుగా అని :) ఫ్రెండ్స్ ఉన్నా...అమ్మలా ఎవరు చూసుకోలేరు...nice post

    ReplyDelete
    Replies
    1. అంజలి గారు, హాస్టల్ విషయాల్లో నాకు,మీకు దాదాపు అన్నింట్లో ఒకేలాంటి అనుభవాలు ఉన్నాయి. సేం పించ్:)

      Delete
  10. very well written
    రమణి గారి కామెంట్ డిటో :)

    ReplyDelete
  11. హరేకృష్ణ గారు,మీరు "calm Ant"(మీ భాష) పెట్టడంలో కూడా ఎంత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారండి..:):)

    ReplyDelete
  12. చిన్ని గారు జ్వరంకే ఇలా ఐపోతే ఎలాగండి...... అమ్మాయిలు మరి సుకుమారంగా అయిపొయారు ...మీరు రాస్తున్న విధానం బాగుంది....అన్నట్లు ఇప్పుడు జ్వరం తగ్గిందా? (ఎందుకో మీరు రాసింది చదువుతుంతే గోదావరి సినిమాలో సీత క్యారక్టర్ గుర్తుకు వచ్చింది).

    ReplyDelete
    Replies
    1. డేవిడ్ గారు, ఈరోజే మీ గురుంచి అనుకున్నాను మీరు ఈ టపా చూసారో,లేదో అని. ఇప్పుడు తగ్గిందండి జ్వారం.మీ వ్యాఖ్యతో చాలా సంతోషపరిచారు. :):)Thanks for your compliments:)):D

      Delete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.