నాకు తనకి పరిచయం ఈ బ్లాగ్ ద్వారానే ఒక చిన్న కామెంట్ తో "నేను రెబెల్ సినిమా చూద్దామనుకున్నాను, మీ పోస్ట్ తో చూడకుండా నన్ను రక్షించారు" అని. అప్పటిదాకా అంత తియ్యని కామెంట్ నా బ్లాగ్లో కనిపించలేదు. వెంటనే తను చూడాలనుకుంటున్న సినిమా గురించి తన ప్రొఫైల్ నుంచి మెయిల్ ఐడి తీసుకుని ఒక మెయిల్ పెట్టాను. వెంటనే అటు వైపు నుంచి ఒక శుభోదయాన వేడి వేడి కాఫీ మెయిల్ వచ్చింది.
వెంటనే మెయిల్ నుంచి చాట్ లోక మారింది. వెంటనే ఫోను నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాము. ఆ తర్వాత మాటల ప్రవాహం జరిగింది మా మధ్యన. తర్వాత వెంటనే మనం కలవాలి అని అనుకున్నాము కాని ..అది ఇంత తొందరగా జరుగుతుందని మేమసలు ఊహించలేదు.
పోయిన బుధవారం ఉదయం తన నుంచి ఫోను "చిన్ని ! లేయ్..నేను వచ్చె వారం నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను." నేను వెంటనే "సరే. నేను కాసేపు తర్వాత ఫోను చేస్తాను. ఎందుకంటే నేను వచ్చే వారం మా ఊరు వెళ్తున్నాను. నేను మా అమ్మతో మాట్లాడి ఏ విషయము చెప్తాను." నేను రాకు అని చెప్పలేను..ఎందుకంటే నాకు కూడా తనని ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఆశగా ఉంది. అమ్మను ఎలాగోలాగా తను వస్తోందని చెప్పి, నేను ఊరు రావడం ఒక 2 రోజులు ఆలస్యం అవుతుందని చెప్పి ఒప్పించాను.సరే ఒక వైపు నుంచి ఉన్న టెన్షను తగ్గిపోయింది. ఇంక సెలవల సంగతి మేనేజరు గారికి చెప్పి 2 రోజులు సెలవలకి అప్ప్లై చేసాను. సరే..ఒక వైపు తను వస్తుందో, రాలేదో చివరికి ఏదైనా కారణాల వల్ల అని అలోచిస్తూ తను వచ్చే వారం వస్తుందని ఎదురు చూస్తున్నాను.
ఈలోపు తన దగ్గర నుంచి ఫోను "భరత్ ఈ వారమే హైదరబాదు వస్తున్నాడూ, అందుకని నేను కూడా ఈ వారమే వస్తాను. నువ్వు పండగకి ఇంటికి వెళ్లొచు కదా!!". ఒక విధమైన సంతోషం తనని తొందరగా చూసేయొచ్చు అని!! శుక్రవారం తను బయల్దేరాలంటే గురువారం తత్కాల్లో టిక్కెట్ చేయిస్తాను భరత్ తో అని చెప్పింది. నేను శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాదుకి ఉన్న ట్రెయిన్స్ అన్ని చూసి ఒక ట్రెయిన్ తనకి అనుకూలంగా ఉందని చెప్పాను.నాతో మాట్లాడేటప్పుడే తన మొబైల్ ఛార్జింగ్ తక్కువుందని చెప్పింది. నేను చెప్పిన ట్రైన్ వివరాలు భరత్ కు చెప్పే లోపలే తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆ విషయం తెలియక తను వస్తే ఏమేమి చేయాలో అలోచిస్తూ..మధ్య మధ్యలో తన మొబైల్ కి కాల్ చేస్తున్నాను. చివరికి సాయంత్రం తన దగ్గరి నుంచి ఫోను, "లేదు! కుదరట్లేదు. నేను భరత్ కి చెప్పే లోపల నా మొబైలు లో ఛార్జింగ్ అయిపోయి మన ఆశల్ని అడియాశలు చేసింది.టిక్కెట్ దొరకలేదు అని విషయం చెప్పింది." దానికి నేను "పర్లేదులే..వచ్చే వారం కలుద్దాము" అని ఓదార్చేసాను.
ఎందుకో మళ్లీ మాటల్లో నువ్వు వస్తావని అనుకున్నాను..కాని నువ్వు రావట్లేదు అని భాదపడేసరికి..చిన్ని! నాకు టిక్కెట్ చేసెయ్యి అని చెప్పింది. తనకి బస్ ప్రయాణం అలవాటులేకపోయినా నా కోసం 15 గంటలు ఓంటరిగా ప్రయాణం చేసి నన్ను చూసి మురిసిపోయింది.
తను పంపిన వేడి కాఫీ మీ అందరితో పంచుకుంటున్నాను..
ఈ కాఫీనే మమ్మల్ని కలిపింది. తను నాకు చెప్పిన మాటలకి చాలా ఆనందం, ఆశ్చర్యం. తన పరిచయం నాకొక గొప్ప అనుభవం.తను మరెవరో కాదు.. "MY DEAR LOVING FRIEND PRIYA". తను నాతో ఉన్న ప్రతి క్షణం నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, బతిమిలాడుతూ, నవ్వుతూ నా పైన ప్రేమను కురిపిస్తూ చాలా సంతోషంగా గడిచిపొయింది..తను ఈ రెండు రోజులు నా పనులతో అలసిపోకుండా తను కూడా నాతో పాటు పరుగులు పెట్టి..ఇంకా చాలా మాటల్లో చెప్పలేని అనుభూతుల్ని మిగిల్చి మళ్లీ కలుద్దాము అని...
ప్రియా.. ఇది మన గుర్తుగా..మనం ఎంత బిజీగా ఉన్నా ఈ పోస్టు చూసిన వెంటనే ఒకరికి ఒకరం అన్న ధైర్యం వచ్చేయాలి. . THANKS FOR EVERYTHING. నా జ్ఞాపకంగ ఇది నీకు.
very nice :) blog friends real life lo kooda friends ayyarannamaata :)
ReplyDeleteఅవును అంజలి గారు.. చాలా సంతోషంగా ఉంది తనని కలవడం.:D:) Thanks.
DeleteThank you so much Chinni :)
ReplyDeleteNene post raaddhaamanukunnaanu.. nenaa aalochanalo undagaane nuvvu post chesesaav!! Neeke kaadu.. neetho unna samayam naakoo apuroopame, theepi jnyapakame :) :)
ప్రియా.. ఇది నేను చెప్పింది. నువ్వు చెప్పు నీ మాటల్లొ.. నేను నువ్వు ఇక్కడికి వచావని చెప్పాను..నువ్వు వచ్చిన తర్వాత ఎలా ఉన్నావో చెప్పు.:)
Deletehahhahaa.. sure.. ee weekend lopu kacchitham gaa post chesthaanu :)
Deleteమంచి స్నేహితులు దొరకటం ఎంతో అదృష్టం! emailలో కలిసిన మనుషులు నిజజీవితంలో బావుండచ్చు బావుండకపోవచ్చు. మీరిద్దరు కలవటం, కలిసి పొందిన ఆనందం వినటానికి చాలా సంతోషంగా ఉంది!
ReplyDeleteబిందు గారు, మేము ఈ స్నేహాన్ని కలకాలం నిలుపుకుంటాం. ధన్యవాదాలు:)
Delete:)
DeleteMee friendship kalakaalam ilane undalani korukuntu...
ReplyDelete-Srinivas
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు మీ ఆశీస్సులకు.
ReplyDeleteLovely friendship Chinni gaaru. Keep it up for ever.
ReplyDeleteJaya gaaru, Thanks for your wishes.
ReplyDeleteచాల బాగా రాసారు మీ అనుభవాలు ,ఇన్నాళ్ళు ఇంత మంచి బ్లాగ్ మిస్ అయ్యాను ! ఇప్పుడు రెగ్యులర్ గ ఫాలో అవుతాను !!
ReplyDeleteహర్ష గారు,నా బ్లాగుకు స్వాగతం మీకు.చాలా సంతోషంగా ఉంది మీ ప్రోత్సాహానికి.చాలా థాంక్స్. :)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteOka manchineel filter coffee lanai post n mee friendship liane undali ani korukuntunnanu.
ReplyDeleteThanks malati gaaru for your wishes.
ReplyDeleteHi Chinni Gaaru, Namaste..!
ReplyDeleteMee Sneham Oosulu Chadivi Chaala Aanadamesindi..!
Nenu O Roju Saradaaga "Gunde Savvadi" ani title to inka naala evaraina title pettara ani vetuku tunte.. Priya gaari Blog kanipinchindi..
Taanu Nijanga Challani Maatala Moota, aame parichayam aina 3 rojullone nenu idi cheppagalanu. Mee Sneham gurinchi chadivi chaala aanandapaddanu.
Inta manchi ammayi naaku Chelli avvadam.. Nijanga Naakaa Devudu Ichchina Varam. Meeku O Manchi Snehituraalu, Naaku O Manchi Chellelu dorikinanduku chaala chaala aanandanga undi. Nannu meeru ikkada choodochchu.. http://kaavyaanjali.blogspot.in/.
Mee Sneham Kalakaalam Ilaage Konasaagaalani Naa Ista daivamaina Venkataachalapatini Manasaara Vedukuntu, Aa Durga Bhavani Aashishulu eppudu meepai koluvudeeri undaalani manasaara kaankshistu..
Mee Sreyobhilaashi,
Sridhar Bukya