Thursday, 15 November 2012

బరువైన ఙ్ఞాపకం

               నేను హైదరాబాదులో ఒక సంస్థలో ప్రాజెక్టు చేసుకుంటున్న రోజులు. మా అక్క తన post graduation  కోసం బాగా కష్టపడి చదువుతోంది. ఇంక తన కష్టానికి పరీక్ష పెట్టే రోజు దగ్గరైంది. మా అన్నయ్య పరీక్ష రోజున ఏదో ముఖ్యమైన పని ఉండి వేరే ఊరు వెళ్ళవలిసి వచ్చింది. తను మాతో పాటే ఉండుంటే ఇంత బరువైన ఙ్ఞాపకం మాకు మిగిలి ఉండేది కాదు.
               మా అక్కకు పరీక్షలంటే చాలా భయం. తనకు అంతకు ముందు రోజు అస్సలు నిద్ర పట్టదు. ప్రతి సారీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ విషయంలో మాత్రం తను ఏం చేయలేకపోతుంది. పరీక్ష రోజు  ఉదయాన్నే లేచి పూజ చేసి ఇద్దరికీ ఫలాహారం చేసి 10 గంటలకి పరీక్ష మొదలవుతుందంటే ఇంటి నుంచి 7 గంటలకే బయల్దేరేలాగా ప్లాన్ చేసుకున్నాం. మేము బయల్దేరే లోపల మా పనిమనిషి వచ్చింది. తన పని అయ్యేంత వరకు ఆగేంత సమయం మాకు లేదు. మేము తనకి పని చేసి ఇంటి తాళాలు ఓనర్ వాళ్ళ ఇంట్లో ఇవ్వమని చెప్తే, వాళ్ళు పెళ్ళికి వెళుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నం 2 పైనే అవుతుంది. మరి మీరు ఎన్నింటికి వస్తారని అడిగింది. మేము వచ్చేసరికి  కూడా అదే టైం అవుతుంది అని చెప్తే, తను మీరు వచ్చే సమయానికి వాళ్ళు రాకపోతే అనవసరంగా మీరు బయట ఉండాల్సి వస్తుంది అని లేని పోనీ అనుమానం రేపింది . ఇంకేం చేయాలో తెలియక సరేలే  ఆంటీ, మీరు పని అయిన తర్వాత తాళాలు కిటికీ తలుపులో పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాము.
                 మేము 8.45 కంతా పరీక్షా హాలు దగ్గరకి వెళ్ళిపోయాము. మా అక్క 9.15కి లోపలికి  వెళ్ళిపోయింది. నేను బయట ఖాళీగా కూర్చుని ఏం చేయాలో తెలియక అలా రోడ్డు మీదకి వెళ్లి ఈనాడు పేపర్ తీసుకుని వచ్చి దాన్ని నములుతూ ఎప్పుడెప్పుడు ఒంటి గంట అవుతుందా అని అనుకుంటున్నాను. అలా అనుకున్నా అయ్యో! అక్క లోపల exam వ్రాస్తోంది కదా!! తొందరగా గడవకూడదు.. తను అన్ని నిదానంగా అలోచించి జవాబులు వ్రాసేంత వరకు టైం అవ్వకుడదని వెంటనే అనుకున్నాను. ఏంటో చాదస్తం కదా!!! మొత్తానికి తను వచ్చేసింది 1 గంటకి బయటికి. exam ఏంటో? ఎలా వ్రాసానో ? అర్థం అవ్వట్లేదు అని. నేను ఇంక వదిలేయ్! వచ్చే result ఎలాగు వస్తుంది. ఈలోపు మనం టెన్షన్ పడినంత మాత్రాన ఏం జరగదు అని నాకు తోచిన మాటలు చెప్పి బయటికి నడిచాము. మా అక్క స్నేహితులు వస్తే వాళ్ళని పలకరించి ఇంక ఇంటికి వెళ్లి మళ్లీ భోజనానికి ఏం వండుతాములే..ఇప్పటికే బాగా అలసిపోయామనుకుని బయటే చికెన్ బిరియానీ, ఒక 1 లీటర్ పెప్సీ బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్లి తిని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని బయలుదేరాము ఇంటికి.
                    అసలే ఎండాకాలం. మంచి మిట్ట మద్యాహ్నం .ఇంటికి వచ్చేసరికి 2.30 అయ్యింది. కిటికీ తలుపులో తాళంచెవి  వుంది కదా అని చేయి పెడితే అక్కడ తాళంచెవి కనిపించలేదు. కింద ఓనర్స్ కూడా వచ్చేసినట్టున్నారు వాళ్లతో ఏమైనా ఉన్నాయేమో అని అడిగితే అక్కడ కూడా లేవు. పోనీ ఆంటీ కింద షాప్ లో ఏమైనా ఇచ్చారేమో అని అడిగితే ఉహూ ..అక్కడ కూడా ఇవ్వలేదంట . అప్పటికే అంత ఎండలో వచ్చేసరికి మాకు గొంతు తడారిపోయింది. ఇంక ఏం చేయాలో తెలియకపోతే ఓనర్ అంకుల్ వాళ్ళ డ్రైవర్ని  పని మనిషి వాళ్ళింటికి పంపించి ఆమెని పిలిపించాడు. వేడి వేడిగా బిరియాని తిందామంటే ఈ నస ఏంటిరా దేవుడా!! అని చాలా చిరాకొచ్చింది. మా పని మనిషి నేను కిటికిలోనే పెట్టాను. అది గాలికి కింద పడిందేమో.. చూసారా! అని అడిగింది. మా అక్కకు, నాకు ఆ ఆలోచనే రాలేదు. ఎందుకంటే నా మెదడును బిరియానీ, మా అక్క మెదడుని వ్రాసిన exam paper ఆక్రమించేశాయి. మొత్తానికి తాళం చెవి లోపలే పడిపోయింది. మా అదృష్టం దానికి keychain కూడా  లేదు ఏదైనా కర్ర సహాయంతో తీద్దాం అంటే.. అంతే మన టైం బాలేనప్పుడు అన్ని ఇలా కలిసొస్తాయి. మా ఇంటి పక్క పోర్షన్లోకి కొత్తగా అద్దెకి ఆరోజే వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న బాబు పెప్సీని చూసి వాళ్ళ అమ్మతో అది కావాలని ఒకటే గొడవ :D . అక్కడ మా పరిస్థితి అసలు వర్ణించలేము. మా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. వాటిని శాంతపరచాలంటే ఇంటి తలుపులు తీయాలి :(. మా పనిమనిషి నా వల్లే కదా మీరు ఇక్కడ అనవసరంగా నిలబడ్డారు అని చాలా భాదపడుతోంది. ఆ తాళం చెవిని తీయడానికి చాలా కష్టపడుతోంది. తాళం చెవికి ఉన్న రింగులో సన్నని ఇనుపతీగని వంచి దాని సహాయంతో బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. పక్క బిల్డింగ్ వాళ్ళు మా అవస్థలు చూడలేక ఒక తాళం చెవి ఇచ్చి దాంతో ప్రయత్నించమన్నారు. అబ్బే! హెయిర్ పిన్నులతో, పక్కింటి వాళ్ళ   తాళం చెవితో వచ్చే విధంగా తయారు చేస్తున్నారా ఈ మధ్య తాళాలు.. అసలే మనం technologically advanced.. :D..
            చివరికి మా పని మనిషి నా వల్ల కాదని చేతులు ఎత్తేసింది. నేను తాళం పగలకొట్టేస్తాను అని ఒక పెద్ద బండ రాయితో పగలకొడుతూ, మీరు నా జీతం డబ్బుల్లో ఒక వంద తగ్గించేయండి ఈ నెలకు. ఆ వందతో కొత్త తాళం కొనుక్కోండి అని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. ఆంటీ!! మీరు మొదటే ఈ పని  చేసుంటే మేము ఈ పాటికి తినేసుండే వాళ్ళం అనుకున్నాము. ఇంతలో నాకు ఒక మెరుపు లాంటి ఐడియా తట్టింది. తాళం చెవి దేనికైనా అతుక్కున్టుందా   అని.. వెంటనే ఓనర్ వాళ్ళ అమ్మాయిని పిలిచి ఒక చిన్న అయస్కాంతం ముక్క ఉంటే ఇవ్వమని అడిగాము. ఆ అమ్మాయి నా దగ్గర లేదని చెప్పేసింది. అయినా మీ అమ్మని ఒకసారి అడుగు..ఉంటె తీసుకు రా అని చెప్పాను. ఆ అమ్మాయి ఒక చిన్న అయస్కాంతం ముక్క తెచ్చింది. దాన్ని మా పని మనిషి ఇంతకు ముందు తెచ్చిన ఇనుప తీగకి పెట్టి, దాని సహాయంతో తాళంచెవిని బయటకి తీసాము. నేను flowలొ వ్రాస్తూ మీకు టైం చెప్పడం మర్చిపోయాను. మేము గృహప్రవేశం చేసే సరికి సమయం సాయంత్రం 4.30. అక్షరాలా రెండు గంటలు ఎండలో, ఆకలితో మాడిపోయాం. వెంటనే చల్లారిపోయిన బిరియాని, వేడిక్కిన పెప్సితో మా భోజనం కానిచ్చేసాము. :D .. చాలా ఆకలితో ఉండటం వల్లనుకుంటా అవి చాలా రుఛిగా అనిపించాయి.  ఆ తరువాత కిటికిలో తాళం పెట్టే విధానం మార్చాము. ఒక కిటికీ తెరిచి మూసి ఉన్న రెండో కిటికీ తలుపు వెనకాల పెడతాము. ఒకవేళ గాలికి తెరిచి ఉన్న కిటికీ కొట్టుకున్నా రెండో కిటికీకి బోల్ట్ పెట్టి ఉంటుంది కాబట్టి తాళం చెవి పడుతుందన్న భయం ఉండదు. What an idea  madam ji :D :D 

25 comments:

  1. హ్హహ్హహ్హ అంత ఆకలితో ఉన్నప్పుడు ఏది తిన్నా పరమాన్నంలానే ఉంటుంది :)
    ఇంతకి పరీక్ష ఫలితం ఏమిటి?

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారు,పరీక్షలో అనుకున్న ఫలితాలు రాలేదండీ..:( ఏదో ఒకటి కొందామనుకున్నా ఆ సీట్ల విలువ లక్షల్లోనే..ఇప్పుడంత డబ్బు మాట కదండీ..

    ReplyDelete
    Replies
    1. నిజమే చిన్ని గారు.
      దీపావళి ఎలా జరుపుకున్నారు?

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. నేను కూడా బాగానే చేసుకున్నానండి.
      ఏ photos? albums గురించా లేదా posts లో ఉన్న phots?

      Delete
    4. NAME: Sphoorti Children's Home
      ADDRESS: 618, BN Reddy Nagar Colony,
      Cherlapally Ind Area,
      Hyderabad, India - 500051

      and

      Thara
      St Patrick's High School Campus
      Secunderabad
      Andhra Pradesh
      South India
      500 003

      Delete
  3. bagundi sweet memory :)

    ReplyDelete
  4. Pani lo pani me address kuda chepeste naku oka pani ayipodi..:p

    ReplyDelete
  5. సందీప్ గారు, అవి అమ్మానాన్నలు పట్టించుకోకపోతే చేరదీసిన దేవాలయాల చిరునామాలు అడిగాను. మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. మీ వ్యాఖ్యను చూసి నేను ఆ వ్యాఖ్యను తొలగించాను. అప్పుడప్పుడు మీ లాగా చురకలు వేసే వాళ్లు ఉండాలి. ధన్యవాదాలు. :D :D

    ReplyDelete
  6. ardamindi na comments " ఒక కిటికీ తెరిచి మూసి ఉన్న రెండో కిటికీ తలుపు వెనకాల పెడతాము. ఒకవేళ గాలికి తెరిచి ఉన్న కిటికీ కొట్టుకున్నా రెండో కిటికీకి బోల్ట్ పెట్టి ఉంటుంది కాబట్టి తాళం చెవి పడుతుందన్న భయం ఉండదు"..key kosem...:)

    ReplyDelete
    Replies
    1. I am really Sorry:(. ఏమనుకోకండి. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినా సందీప్ గారు, ఒక్క laptop మినహా ఏ విలువైన వస్తువులు మా ఇంట్లో ఉండవు. :D :D. You are always welcome:P address చెప్పకుండా వచ్చేయమన్నానని కంగారు పడకండి.. మీరు ధైర్యంగా వచ్చేయండీ.. వెధవ address ఏముంది? వస్తే అదే తెలుస్తుంది, హ్హహ్హ.. I am sorry.

      Delete
    2. sorry demundi kani,
      a oka lap chalandi vedava jeevitam oka month prashantham ga gadapochu..:p :)

      just kiddin..:)

      Delete
  7. చల్లారిపోయిన బిర్యానీ, వేడెక్కిన పెప్సీ.... మంచి కాంబినేషన్ తో భోజనం చేసారండీ...
    అప్పుడు నానారకముల భాద అనుభవించి... తర్వాత తలుచుకుంటే నవ్వు వచ్చే ఇలాంటి సన్నివేశాలు బాగుంటాయండీ....

    ReplyDelete
  8. రాఘవ్ గారు, అంతే కదండీ. ధన్యవాదాలు మీ బద్ధకాన్ని లెక్క చేయకుండా comment వ్రాసినందుకు. Just Kidding. Thanks :)

    ReplyDelete
  9. చిన్ని గారు బాగుంది మీ "చిన్ని" కథ....పర్వాలేదండి ఆకలితో కూడ మీ బుర్ర బాగనే పని చేసింది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు డేవిడ్ గారు మీ Complimentకు.:)

      Delete
  10. అవురవుమంటూ మొత్తానికి చల్లారిన బిర్యానీ ,వేడెక్కిన పెప్సీని లాగించేసారు అన్నమాట. ఇలాంటి చిన్ని చిన్ని కథలే మనకు చిరు జ్ఞాపకాలు అవుతవి. This story took me back to my child hood days where I faced similar incident. Good work...

    ReplyDelete
  11. ఇదొక మంచి ఙ్ఞాపకం మాకు. చక్కని గుణపాఠం కూడా. ధన్యవాదాలు వజ్రం గారు మీ వ్యాఖ్యకు.

    ReplyDelete
  12. మీ బాధ పగ వారికి కుడా రాకూడదు చిన్ని గారు :)
    ఇదేమైన బరువైన జ్ఞాపకమా ?? ఇలాంటివి జరగకపోతే లైఫ్ లో మజా ఉండదు :)
    నాకు తప్ప ఎవ్వరికైనా జరగచ్చు లెండి !!

    ReplyDelete
    Replies
    1. హర్ష గారు,
      >>నాకు తప్ప ఎవ్వరికైనా జరగచ్చు లెండి !! అయితే మీకు లైఫ్లో మజా వద్దన్నమాట:P
      మీకు అలాంటి మజా తొందర్లోనే కలగాలని ఆశిస్తూ :D :D

      Delete
  13. ఆదివారం ఒక్కడినే బోర్ అనిపించి ఎన్నెన్నో బ్లాగులు తిరగేసా , ప్లస్ పేస్ బుక్ కూడా వదలలేదు మార్నింగ్ నుంచి ఆదివారం అయిపోవచ్చింది, ఇలా చివరకు మీ బ్లాగుకు చేరితే ఈ కధనం బాగుంది అనిపించింది, వెంటనే కామెంట్ చెయ్యాలని అనుకున్న ఈలోపు మా ఇంట్లో జరిగిన సంగతి జ్ఞాపకం వచ్చింది,

    ఇంట్లో రెండున్నర యేండ్ల చిన్నారు ఎప్పుడూ ఒక్కటే అల్లరి, హైదరాబాదు సంగతి తెలిసిందేకదా, అంత ఇరుకిరుకు ఒక ఇండివిడ్యువల్ హౌస్ లో గ్రౌండ్ పోర్షన్ లో రెంట్, దానికి ఉన్నది ఒకే సింహ ద్వారం,.
    నేను అప్పుడు బ్లాగు పోస్టింగ్స్ లో మునిగి తేలుతున్నా ఒక సెలవు రోజున, మా అమ్మ ఎదో పనిలో ఉన్నారు, ఇంతలో ఈ చిన్నారి గుమ్మం దాటి బయటు వచ్చి తలుపు వేసేసి గొళ్ళెం పెట్టింది.

    ఓహ్ మై గాడ్.

    అదృష్టం అంత పీక్ కి వేల్లినట్లుంది ఆరోజు హౌస్ ఓనర్స్ వాళ్ళు శ్రీశైలం వెళ్ళారు, పక్క పోర్షన్ లో వాళ్ళు వాళ్ళ సొంత వూరు వెళ్ళారు, ఆప్పక్క ఇళ్ళ వాళ్ళు ఐరి\ఉగు పొరుగు అంతా శ్రీశైల0 batch లోనే ఉన్నారని అమ్మ చెప్పింది.
    మాకు ఒకటే టెన్షన్ డోర్ లాక్ అయ్యిన0కు కాదు ఈ బుడతది, అలా ఎటు వెళ్ళిపోతుందో అని .....

    ఇక ఒకటే టెన్షన్ చుట్టాలకి ఫ్రెండ్స్ కి ఎంత ఫోన్ చేసి రమ్మని పిలిచినా మినిమం అర్థ గంట తక్కువకాదు.

    కిం కర్తవ్యం, దైవమా అనుకుంటు ఉండగానే 'మింటో ఫ్రెష్ ' తినకుండానే బుద్ధిని వెలిగించాడు భగవంతుడు.

    వెంటనే బాత్ రూమ్ వెంటిలీటర్ లో క్రాస్ గా అమర్చిన అద్దాలను ఒక్కొక్కటిగా తీసేస్తే, సరిగ్గా నేను వెళ్ళటానికి సరిపడా ఖాళి ఉంది

    కాని కాంపౌండ్ వాల్ కూడా దగ్గరగా ఉండటం చేత అందులోంచి వీరోచితంగా బయటకు వచ్చి చిన్నారిని వెళ్లి పట్టుకున్నాను
    అది ఒద్దే దూరం వెళ్ళలేదు గేటు దగ్గరే నుంచి దేనినో తీక్షణం గా గమనిస్తుంది.

    thank god మళ్ళీ బ్లాగింగ్ షురూ !!

    ReplyDelete
    Replies
    1. బావుందండీ మీ ఙ్ఞాపకం, ఇలాంటి ఆపద సమయాల్లోనే అందరూ ఊరెళ్తుంటారు:).. మీ ఙ్ఞాపకం ఇక్కడ పంచుకోవడం హ్యాపిగా ఉందండి. టపా కంటే మీ వ్యాఖ్య ఎక్కువ బావుంది. :):) ఇంత మంచి వ్యాఖ్యకు ధన్యవాదాలు.

      Delete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.