Friday, 23 November 2012

హేమంత ఋతువు


ఈ నిశి రాతిరి వేళలో
అమ్మ వెచ్చని ఆత్మీయస్పర్శపు ఆలింగనంలో,
నాన్న ప్రేమానురాగాల తీయని కౌగిలింతతో మురిసిపోతూ..
అలసిపోయి,ఆదమరచి నిదురించిన  నా కనుపాప
ఇలాంటి హేమదృతువు మళ్లి మళ్ళి నా కోసమే రావాలని..
మురిసిన నా మురిపెం కలలా కరిగిపోయి,
ఈ క్షణం వాటిని ఆనాటి స్మృతులని చూపిస్తూ..
ఆ గతస్మృతుల ఒడిలోకి జారువాలకుండ,
నిస్సహాయంగ విడిచిన నా నిట్టూర్పుల వేడినే
హేమదృతు రక్షణగా మిగిల్చిన కాలమా!!
నా కంటి కనుపాప నిదురపోకుండా జార్చిన అశ్రువు సాక్షిగా
నీ ఉనికి నేనెరుగని చోటుకి...
హేమమా!! మరళి పో!!!

14 comments:

  1. Enti chinni garu..style maarcharu :)

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారు, వైవిధ్యాన్ని ప్రదర్శిద్దామని..:)

    ReplyDelete
  3. dhaatri gaaru, Welcome to my blog and thanks:)

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. అలసిపోయి,ఆదమరచి నిదురించిన నా కనుపాప
    ఇలాంటి హేమదృతువు మళ్లి మళ్ళి నా కోసమే రావాలని.........ఇదొక్కటి చుస్తే ఎవరికైనా అనిపిస్తుంది కవులకి ప్రాక్టికల్ లైఫ్ తో పని లేదని ,నేను అలానే అనుకున్నాను,ముందు చూసి .....నీ ఉనికి నేనెరుగని చోటుకి...
    హేమమా!! మరళి పో!!!.....ఇది నా నోరు మూయించింది ,

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు హర్ష గారు.

      Delete
  6. కవిత, చిత్రం రెండూ బాగున్నాయి చిన్నిగారు.

    ReplyDelete
    Replies
    1. కిశోర్ గారు,ధన్యవాదాలు.

      Delete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.