నేను పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మా కోర్సు రెండు సంవత్సరాలైతే అందులో ఒక సంవత్సరం కాలేజిలోనే ఉండి చదివేదైతే ఇంకొక సంవత్సరం మేము నేర్చుకున్న విద్యని ఏదైనా ఒక సంస్థలో ట్రైనీ ఇంజనీరుగా ప్రదర్శించి ఒక ప్రాజెక్టు చేయాలి.
మా మొదటి సంవత్సరం పరీక్షలు కాక ముందే ఈ హడావుడి మొదలైంది. కొంతమందికి మొదట్లోనే అవకాశాలు పలకరించి వాళ్లు నిశ్చింతగా పరీక్షలు వ్రాసుకున్నారు. నాలాంటి కొంతమంది మాత్రం అటు ఆ పరీక్షలకు చదవలేక, మధ్యలో ఈ ఇంటర్వ్యూలను ఎదుర్కోలేక కొంచెం ఇబ్బందిపడ్డాము. అలా మా కష్టాలు చూడలేక మా హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ గారు ఒక సంస్థలో తనకు తెలిసిన వాళ్లు ఉంటే మా అందరిని ఇంటర్యూలకు పంపే ఏర్పాట్లు చేసారు..నాకు ఆయన ఈ మాట చెప్పగానే మా పాలిట దేవుడిలా కనిపించారు. ఎలాగోలాగా ఆ ఇంటర్య్వూలో నెగ్గి నేను కుడా ఒక ప్రాజెక్టుదాన్ని అయ్యాను :). ఏంటో కాని మనకు దక్కనంత వరకు ఒక విషయంపై మనం పడే తపన అంతా ఇంతా కాదు. మానవ సహజం కదా!!!ఇందులో ఒక విషాదకరమైన విషయం ఏమంటే మా కాలేజీ నుంచి 6 మంది అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే అమ్మాయి. అయినా మనకు communtication skills తెలిసినపుడు అదంత పెద్ద సమస్య కాదనుకున్నాను :P. కానీ మొదటిరోజే నన్ను పిలవకుండా భోజనానికి వాళ్లు మాత్రమే వెళ్లిపోయారు..(మనలో మన మాట.. తెలుగు అబ్బాయిలకు అమ్మాయిల దగ్గర తగ్గి మాట్లాడానికి అహం అని నా అభిప్రాయం.. హుష్..ఈ మాట మళ్లీ మాట్లాడుకుందాం).. ఎంతైనా మనం ఇద్దరం ఉండీ, అవతల వాళ్లు ఒక్కళ్ళే అని తెలిసినపుడు ఇంకొంచెం బెట్టుగా ఉంటామనుకోండి..మానవ సహజం..:) ఇంక తప్పదనుకుని మీరు రోజు నన్ను కూడా పిలవండి అని ఒక మాట వాళ్లతో చెప్పాను.
ఒక అబ్బాయి,నేను ఒకే టీము. ఈ X కొంచెం మొదట్లో బానే మంచిగా ప్రవర్తించేవాడు. తర్వాత్తర్వాత భరించలేని విధంగా తన వ్యక్తిత్త్వంతో నా కళ్లు తెరిపించాడు. ఈ X గారిని నేను ఏమి అడిగినా నాకు తెలియదు అనే సమాధానం ఇచ్చేవాడు. నేను మొదట్లో అయ్యో పాపం!! అని నాకు తెలిసిన ఇంఫర్మేషన్ అంతా చెప్పి త్యాగశీలిలాగా గొప్పగా feel అయ్యేదాన్ని. కానీ ఆ అబ్బాయి ఉద్దేశ్యం తనకి తెలిసిన విషయం కరెక్ట్ అవునా? కాదా? అని నాతో నిర్దారించుకోవడం . అదేం ఆనందమో నాకు ఇప్పటికి అర్థం కాదు.ఒక్కసారి మా మెనేజరు తనని పిలిచి ఏదో మాట్లాడాడు. విషయం ఏంటీ అని అడిగితే హా..లైట్ అని నాకు మెనేజరు ఏం చెప్పాడో చెప్పకుండా నీళ్లు నమిలేసాడు. అదంత లైట్ అయినప్పుడు అంత సీరియస్గా వినడం ఎందుకో? మళ్ళి నాకు చెప్పకుండా దాచిపెట్టడమెందుకో??అప్పుడర్థమైంది తన అసలు రూపం. ఏదైనా కాని నా నుంచి సమాచారం లాగడమే తప్ప తను ఒక్క విషయం కూడా చెప్పేవాడు కాదు.. కొంచెం లేట్గా అయినా నాకు జ్ఞానోదయం అయ్యి నేను తనలానే సమాధానం ఇచ్చి తప్పించుకునేదాన్ని.
ఒకరోజు మా మేనేజర్ మా ఇద్దరినీ పిలిచి చాలా casual గా మీరు weekends ఏం చేస్తుంటారు అని అడిగాడు. విషయం తెలియని గుడ్డిగొర్రెలాగా bore కొట్టి ఎలా timepass చేయాలో తెలియక జుట్టు పీక్కుంటాను అని నేను చెప్పేసరికి మా మేనేజర్ ఒక్క అరుపు " woow!! It is really interesting :P" అని అరిచి నువ్వు అయితే ఈ వీకెండ్ ఆఫీస్ వచ్చి పనితో timepass చేయి అని నా తల మీద తాపిగా ఒక బండరాయి వేసాడు. తర్వాత ఆ X గాడిని అడిగితే వాడు అతి తెలివితో "నేను వస్తాను కానీ నాకు ఇక్కడ తినడానికి కాంటీన్ తెరిచి ఉండదు" అని నీళ్ళు నమిలాడు. మా మేనేజర్ దేన్నైనా కాష్ చేసుకునే రకం. అదే నీ సమస్య అయితే నువ్వు చిన్నీ వాళ్ళింటికి వెళ్ళు. లంచ్ చేసి పెడుతుంది. మా మేనేజర్ అంత మొహమాట పెట్టిన తర్వాత సరే అని నేను కూడా దానికి ఒప్పుకోక తప్పుతుందా!!!:(
అలా రోజులు గడిచిపోతున్నాయి. నాకు ఒక అలవాటుండేది. రోజు మా అన్నయ్యతో పాటు కలిసి ఇంటికి వెళ్ళడం. సాయంత్రం 6:30 అయ్యిందంటే నేను తనని నసపెట్టేదాన్ని ఫోన్ చేసి ఇంటికెల్దాం అని. నాకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అన్నయ్యని కూడా పేరు పెట్టి పిలవడం..ఇంకొక మంచి విషయం మా అమ్మ,అక్క,నాన్నలతో ఇంచుమించు ఒక అరగంట మాట్లాడేదాన్ని. ఏంటో అన్ని మంచి లక్షణాలే చెప్తున్నాను కదా !"I am very good girl..అన్ని మంచి లక్ష ణాలు ఉన్నయంట నాలో..విన్నావా మిష్టర్ !!!!(Little Soldier's Song)" ఊహించుకోగలరని మనవి.మేము కాంపస్ ప్లేస్ మెంట్ కి మా కాలేజి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు నేను మా అన్నయ్యతో టికెట్ బుక్ చేయించేదాన్ని. ఇన్నిసార్లు ఒక అబ్బాయితో ఫోనులో మాట్లాడుతుండే సరికి ఇంక చూసుకోండి వీడి general knowledge తో మా అన్నని నా బాయ్ ఫ్రెండ్ అనుకుని కాలేజీ లో అందరి చెవులు కోరికేసాడు.నేను ఆ రక్తం చూసి ఏమైంది అని బాధితుల్నిఅడిగితే సదరు X గాడు నా గురించి ఇలా
చెప్పాడని తెలిసి నవ్వుకున్నాము.ఆ చెవి కొరికిన బాధితులకి మా అన్నయ్య పేరు తెలియబట్టి నేను బతికిపోయాను.నా దాకా విషయం వచ్చిన తర్వాత ఆ X కు దూరంగా ఉన్నాను. లంచ్ కట్ చేసాను.
చెప్పాడని తెలిసి నవ్వుకున్నాము.ఆ చెవి కొరికిన బాధితులకి మా అన్నయ్య పేరు తెలియబట్టి నేను బతికిపోయాను.నా దాకా విషయం వచ్చిన తర్వాత ఆ X కు దూరంగా ఉన్నాను. లంచ్ కట్ చేసాను.
ఇంకొకసారి X ని పిలిచి మాటల మధ్యలో మెనేజరు నా గురించి అడిగితే తను అస్సలు పని చేయదు, నాకసలే సహాయం చేయదు అని చెప్పాడంట. ఈ విషయం నా దాకా వచ్చి నేను ఇలా చెప్పాను, నువ్వు మేనేజర్ ఏమైనా తిడితే లైట్ తీసుకో అని చెప్పాడు. వెంటనే నేను షాక్కి గురయ్యాను. అప్పటి దాకా తెలియని లైట్ అనే పదానికి వాడి పద్ధతిలో సమాధానం ఇచ్చాడు వెంటనే తేరుకుని అసలెందుకు అలా చెప్పారు ? అని అడిగాను. కావాలని చెప్పలేదు. తెలీకుండా నోరు జారాను అని చెప్పాడు. ఆ క్షణం వాడి ఆలోచన మా మేనేజర్ ముందు నన్ను చెడుగా చిత్రించడం. ఈ విషయానికి కావాల్సినoత CLASS ఆరోజే తీసుకుని ఇలాంటి మనుషుల కన్నా మృగాలు నయం అనుకుని మాట్లాడటం మానేసాను.
కట్ చేస్తే మేము కాలేజిలో ఇండస్ట్రీలో ఉండి ఏమేమి చేసామో ఒక రిపోర్టు ఇవ్వాలి చివరగా.మాకు రెండవ సంవత్సారనికి ఇదే ఎగ్జాం.నేను దాన్ని ప్రింట్ తీసుకోవడానికి వెళితే ఇంటెర్నెట్ షాపులో వీడు ఉన్నాదు..ఎన్ని పేజిలు అని అడిగాడు? నేను 75 పేజీలు చేసాను అని చెప్పి నా పని చూసుకుని వచ్చేసాను. నేను వచ్చేసిన వెంటనే "దీని మొహం.. ఎప్పుడు చూడూ..ఫోన్లలోనే ఉంటుంది.. రిపోర్ట్ ఏం చేసిందో అని" అని మళ్లీ కామెంట్ చేసాడంట.. నా ఫ్రెండ్ అక్కడుంది అని తెలిసి కూడా..నేను దాని గురించి మాట్లాడటనికి వాడు నా కంటపడలేదు. ఇక్కడ నా దరిద్రం ఎంతలా నన్ను చుట్టుకుంది అంటే నేను, X ఒకే organizationకి సెలెక్టు అయ్యాము.కాని దేవుడు నన్ను ఒక కంట కనిపెట్టి వేరు వేరు టీంలలో వేసి ఈ నస నుంచి నన్ను తప్పించాడు.అయినా నేను నా మనసులో అన్ని అలాగే పెట్టుకున్నాను. ఒకసారి ఆఫీసు చాట్లో నన్ను గెలికాడు. నేను ఫోనులో ఎంత సేపు మాట్లాడుతున్నానన్న దాని పైన థీసిస్ ఏమైనా ఇస్తున్నావా? ఏ విధంగా నీకు సహాయపడగలను అని Customer Care Executive type లో అడిగేసరికి కిందికి రా, నేను మాట్లాడాలి ఓ టెన్షన్ పడిపోయాడు. నేను సున్నితంగా నాయనా! నేను ఫోనులో మాట్లాడితే నీకు సమస్య అయితే వచ్చి నాతో చెప్పు, అంతే కాని అందరి చెవులు కొరికి వాళ్ల చెవులకి హాని చేయకు అని సున్నితంగా మొత్తే సరికి నోరుమూసుకున్నాడూ. వీడి దరిద్రమైన etiquette కి ఇంకొక ఉదాహరణ నేను మీరు అని మర్యాదగ పిలిచినప్పుడు కూడా సెన్స్ లేకుండా నువ్వు అనే సంభోదించేవాడు. ఇంకా షాక్ అయ్యాను అని నేనంటే మీరు కూడా నన్ను తిట్టేస్తారు. ఇంక తప్పుతుందా!! నేను కూడా నువ్వు అనే అన్నాను. అయినా వీడు మనిషి కాదని కంఫర్మ్ చేశాడు. మరేంటో అని ప్రశ్న నన్ను వేయకండి. మీ ఊహకే వదిలేస్తున్నాను.
నేను ట్రైనింగ్ కోసమని United States of America వెళ్లాను. తను అక్కడ నాతో పాటు ఉన్నాడో లేదో నాకు తెలియదు. అసలు తను ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. నేను ఒక రోజు సాయంత్రం ట్రైనింగ్ పూర్తి చేసుకుని రోడ్డు మీద నడుస్తుంటే వీడు కనిపించాడు. దేశం కాని దేశం వచ్చాము అని ఏమీ మాట్లాడకుండా వెళ్లిపొబోయాను. ఈలోపు ఒకసారి తనని చూస్తే ఎవరితోనో సీరియస్గా నా వైపు చేతులు చూపించి మాట్లాడుతున్నాడు. నాకు ఏదో అనుమానంగా అనిపించింది. తిరిగి వెనక్కి చూసుకుంటే ఒక 5 మంది రౌడీలు నా వెంటపడీ తరుముతున్నారు. ఇంక నాకేమి చేయాలో తెలియక వొళ్లంతా చెమటలు పట్టేసాయి. నేను కూడా శాయశక్తుల పరిగెత్తుతూ చివరికి ఒకరి పెరట్లోకి నా బ్యాగు పడేసి నేను వేగంగా గోడ దూకేసి చెట్ల వెనకల దాక్కున్నాను . నా అదృష్టం ఏంటంటే నేను దూరింది ఒక సిఖ్కుల ఇంట్లో. వాళ్లు నన్ను పిలిచి ఇంట్లో కూర్చోపెట్టుకున్నారు. ఈ లోపల ఎవరో తలుపు తట్టారు ఆ అంకుల్ తలుపు తీసి సమాధానం చెప్పేలోపల కాల్చిపారేసారు. అమ్మో! వాళింట్లో తలదాచుకోవాడనికి చోటు ఇచ్చినందుకు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా ఇద్దరు చిన్న పిల్లల్లున్నారు ఆ ఇంట్లో.. దేవుడా! ఎవరికి ఏం హాని చేయకు అని మొక్కుకుని బిక్కు బిక్కుమంటూ చూశాను.. హమ్మయ్య! నా ప్రాణాలు పోలేదు. నేను ఇంకా బతికే ఉన్నాను. ఇదంతా కలా..!!!! చదివిన మీకే ఇంత టెన్షన్ గా ఉంటే నా పరిస్థితి గురించి కొంచెం అలోచించండీ. ఏంటో నా జీవితంలో నా మీద ఇంత కక్ష పెట్టుక్కున్న వ్యక్తిని చూడలేదు.
p.s: తన etiquette ని దృష్టిలో ఉంచుకుని ఏకవచనంలో వ్రాసాను. ఇలా ఎందుకు వ్రాశానంటే తన మీద ఉన్న ద్వేషమంతా ఇలా నా మనసులో నుంచి బయటపెట్టెసి ప్రశాంతంగా ఉందామని.
చిన్ని గారు, సినిమాలలో రచయితగా ప్రయత్నించవచ్చుకదండి :)
ReplyDeleteశ్రీనివాస్ గారు,తెలుగు ప్రజలు హాయిగా బతకడం ఇష్టం లేదా మీకు :P!! Thanks for your comment.
ReplyDeleteహ్హహ్హహ్హ...నిజంగానే చెప్తున్నానండి. చాలా బాగా narrate చేస్తున్నారు.
Deleteఅయితే మంచి కథతో మీ ముందుకు వస్తాను తొందరలో.. మీరు డబ్బులు రెడీగా పెట్టుకోండీ.. ఎందుకంటే producer మీరే:D :D :D
Deleteనాకే tender పెట్టేశారా :)
Delete:D :D
Deletehmm baga rasaru..:)
ReplyDeleteThanks sandeep gaaru:)
ReplyDeleteఇదంతా నిజామా లేక కల అని తెల్సుకోవడానికి కొంచెం సమయం పట్టింది. కనీసం మీరు ఎం చెయ్యాలో తోచక మీ జుట్టు పీకున్నారు వీకెండ్స్ లో . నేను అయితే ఏకంగ ఆఫీస్ సమయంలోనే జుట్టు పట్టుకోవాల్సి వచ్చింది అస్సలు మీరు రాసింది real స్టొరీ లేక కల్పితమైన కథ అని. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి , మీరు సూపర్ రాసారు అండి . తోటి రీడర్స్ చెప్తునట్టు మీరు మీ కథలను సినిమాలకి పరిచయం చెయ్యండి :) :) . Good one.
ReplyDeleteవజ్రం గారు,
Deleteఏంటో మీరు కూడా ఇలా మొహమాటపెట్టేస్తున్నారు :D :D. ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు.