నేను హాస్టల్లో చేరి రెండు నెలలు కావస్తోంది. అసలు ఒక్క రోజే సెలవు తీసుకుందామనుకున్నాను నిన్నటి వరకు. నిన్న మా అమ్మ అదేంటీ? అమావాస్య రోజు బయలుదేరుతావా? అని అడిగింది.. నేను పర్వాలేదు అమ్మ.. దేవుడీకి దండం పెట్టి వస్తాలే వచ్చేటప్పుడు... ఏం కాదు అని ఒప్పించాడనికి ప్రయత్నించాను. ఇంతలో మా అక్క ఫోను తీసుకుని ఏం కాదులే! ఆరోజు నువ్వు టపాసులు పేలుస్తూ ఒక పక్క మళ్లి తైరిగి వెళ్ళాలని టెన్షన్ పడుతూ ఏం హడవుడి పడుతూ పోకు అని చెప్పేసరికి నేను రెండు రోజులు లీవ్ తీస్కుంటున్నాను.
నాకసలే HOMESICK ఎక్కువ. అందులోనూ హాస్టల్ నుంచి బయల్దేరుతున్నాను మొదటిసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎందుకో మనసులో చెప్పలేని ఆతురత, మా ఊరుకి ఫ్లైట్ ఉంటే బావుండేదని అనిపిస్తోందీ(అతడు సినిమా డైలాగు కాపి కొట్టానని అనుకోకండి.. ప్రతిసారి ఊరు వెళ్ళేప్పుడు నాకు ఇలానే అనిపిస్తుంది.). నిన్ననే మా ఆఫీస్లో దీపావళి సందడి మొదలైంది. మాకు దీపావళికి చాకొలేట్స్ ఇచ్చారు. దీపాల అలంకరణ పోటీ పెట్టారు. ఆఫీస్ అంత సందడి సందడి గా కనిపిస్తోంది. నాలోనే ఆ సందడి ఉన్నందుకనుకుంటా...ఇంకా నేను పండగకి కొన్న కొత్త బట్టలు, నేను ఇక్కడ మా అమ్మ,నాన్న,అక్కల కోసం కొన్న వస్తువులు చూపించి వాళ్లనెప్పుడెప్పుడు ఆశ్చర్యపరుద్దామా అని ఉంది.
ఇక్కడ వాతావరణం కూడా నా ఫీలింగ్స్కి తగ్గట్టు చాలా మబ్బులతో ఉంది. ఇలా ఉంటే నాకస్సలు పని చేయబుద్ధి కాదు. నిజం చెప్పాలంటే ఆఫీస్ కు వెళ్లాలని కూడా లేదు. అయినా మీకొక విషయం చెప్పనా??? మా మెనేజరుకి మాత్రం చెప్పకండి.. ఈరోజు నా బస్సు 8 గంటలకి అయితే 5 గంటలకే అని చెప్పి పర్మిషన్ తీసుకుంటున్నాను. మళ్లి 5 రోజుల వరకు ఆఫీసు ఊసే లేదు.
ఒక భాదాకరమైన విషయం ఏంటంటే నేను క్రిస్మస్ కు ఇంటికి వెళ్లలేను..ఎందుకంటే నాకు ఉన్న అన్ని లీవ్స్ అయిపోయాయు ..:( మ అక్కకి ఇదే విషయం చేప్తే అరే!బాధపడకు .. ఆ ఏసుప్రభువే చల్లగ చూసి నీకు లీవ్ ఇప్పిస్తాడు అని చెప్పింది.. ఏంటో ఉద్యోగంలో చేరిన తర్వాత పరమత భేదం లేకుండా అన్ని పండగలకి ఇంటికి వెళ్ళడం అలవాటైపోయింది . ఈ సంవత్సరం అన్ని పండగలు దాదాపు ఇంట్లోనే చేసుకున్నాను. ఆఖరుకి మన ఆంధ్ర అవతరణ కూడా..ఇంకా చివర్లో ఈ ఒక్కటీ చేసుకోకపోతే వెలితిగా ఉంటుంది కదా !!!!!!అయ్యో పాపం.. ముఖ్యమైన పండగ మిస్స్ అవుతోందని మీకు కూడా అనిపిస్తోంది కదా !! మా మెనేజరుకి ఏదో ఒకటి చెప్పి లీవ్ సంపాందించే మార్గం చెప్పండి.. "అందరికి దీపావళి శుభాకాంక్షలు."

ఏరొజు నా బస్సు 8 గంటలకి అయితే 5 గంటలకే అని చెప్పి పర్మిషన్ తీసుకుంటున్నాను..:) kevu.
ReplyDeletehappy journey andi..:)
Thanks for your wishes sandeep gaaru:)
DeleteWork from home పెట్టుకోండి :)
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలు.
శ్రీనివాస్ గారు,"work from" option నాకు లేదండి.:(
Deleteమీకు కూడా దీపావళి శుభాకాంక్షలు:)
బాధపడకండి. మన కె.సి.ఆర్ మరియు కోదండరాం ఉన్నారుగా. ఆ సమయానికి ఎలాగోలా మీకు లీవ్స్ ఇప్పిస్తారులే ఏదో ఒక గొడవ చేసి :P
Delete:D :D :D
Deleteదీపావళి శుభాకంక్షలు. ఊళ్ళో అందరిని అడిగినట్లు చెప్పండి.
ReplyDeleteకిశోర్ గారు,
Deleteదీపావళి శుభాకాంక్షలు మీకు:) తప్పకుండా చెప్తానండి.
Happy journey .
ReplyDeleteHappy DipaavaLi .
Thanks for your wishes. Happy DeepaavaLi.
ReplyDeleteHappy Journey..nenu kuda 5 days vacation..mee vuru peru enti? any photos?
ReplyDelete-- Madhu Mohan
Madhumohan gaaru,I wish you happy diwali. Happy journey.
Deletehappy journey,
ReplyDeletehappy deepavali
Harsha
Harsha gaaru,I wish you happy diwali. Thanks for your wishes.
Deleteపోస్ట్ బావుంది.ఫోటో చాలా బావుంది.మీరు బస్సు 8 గంటలకి అయితే 5 గంటలకే అని చెప్పి పర్మిషన్ తీసుకున్న తీరు ఇంకా ఇంకా బావుంది.:))
ReplyDelete@chinni మీకు దీపావళీ శుభాకాంక్షలు.
చైతన్య గారు, అలా చెప్పాల్సొచ్చిందండీ..ఇక్కడ వాతావరణ ప్రభావం వల్ల:P. మీకు కూడా దీపావళీ శుభాకాంక్షలు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteచిన్ని గారు బాగుంది మీ పోస్ట్... happy divali to you and your family members....have a nice journey.
ReplyDeleteDavid gaaru, Thanks for your wishes:)
Deleteమీకు కూడా దీపావళి శుభాకాంక్షలండీ!
ReplyDeleteబిందు గారు, మీకు దీపావళి శుభాకాంక్షలు.
Delete