నా ఇంటర్మీడియట్ కబుర్లు ఇంతకు ముందు ఒక టపాలో పెట్టాను. చదవనివాళ్లు ఇక్కడ నొక్కి ఆనందించండి. వహ్వ.. నీ టపాలోనే నీ పాత టపాకు లింకు పెట్టి నీ బ్లాగ్ క్లిక్లు పెంచుదామనా??!! మీరలా అనుకోరని నాకు తెలుసుగా :P .. ఒకసారి అది కూడా చదివి దీన్ని దానికి కొనసాగింపుగా చదువుకోండి. అమ్మో!! దుర్మార్గురాలా!!! నీ కుట్ర మాకు తెలుసు.. అని మనసులో మీరసలు అనుకోవట్లేదు. అది నాకు తెలుసండి. అయినా గాయం సినిమా చూడకుండా గాయం-2 ఎలా చూస్తారు?? లాజిక్ పట్టేశారు. వెనక నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి..అసలు రెండూ చూడమంటారా!!!!.. మీకు అయితే భూత్ సినిమాని వేసి కుర్చీలో మిమ్మల్ని కదలకుండా కట్టేసి చూపించాల్సిందే.. మరి ఆర్జివి నా?మజాకా?
ఇంక అసలు విషయానికి వస్తే ఒక దుర్ముహుర్తమో,సుముహుర్తమో తెలియని సమయాన మా కాలేజీలోఅడుగుపెట్టాను.మొదటిరోజు మొదటి పంచ్ మా సుభాషిణి మేడం చేతిలో పడింది నాకు . ఒక చోట డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ మా అన్నయ్య వేసినందుకు "చదివేది మీరా?మీ చెల్లా?" :D అది అయిపోయిన తర్వాత మా నాన్నగారు, వార్డెన్ ల మధ్య అప్పగింతల కార్యక్రమం యథావిధిగా నా కన్నీళ్ళతో ముగిసింది. మా వార్డెన్ అంటే ఆషామాషి వార్డెన్ కాదు. అందరిని హడలుగొట్టించే టైపు అన్నమాట. ఆమె పేరు రాజకుమారి. పేరుకు తగ్గట్టు పెళ్లి చేసుకోకుండా కుమారిగా ఉండిపోయింది. నల్లగా, 6 ఫీట్ ఉంటుంది, అరవం ఆమె(tamilian) . హాస్టల్లో నిజంగానే ఒక రాజకుమరిలా ఉన్న సదుపాయాలన్నీ ఉపయోగించుకునేది. ఈమె ముందు ఎవరూ కూర్చోకూడదు. వంగి వంగి దండాలెట్టాలి. అమ్మో!! ఇలాంటి వార్డెన్లు ఉన్నంత వరకు తమ పిల్లల్ని హాస్టల్లో చేర్పించిన కన్నవాళ్ళు సంతోషంగా నిద్రపోవచ్చు. ఈమెని వార్డెన్ అని మాత్రం అని ఎవరూ అనకూడదు. గౌరవంగా madam అని పిలవాలి.కాని ఈమెకి మేము పెట్టుకున్న ముద్దు పేరు డాగీ(doggie). ఎందుకంటే ఉదయాన్నే మేము కాలేజీకి వెళ్ళే ముందు, వచ్చే ముందు మా గేటు దగ్గర కుర్చీ వేసుకుని నిజమైన గ్రామ సింహంలా కాపలా కాసి ఆమెకు పెట్టిన పేరు సార్థకత చేసుకునేది.ఎవరైనా ఆలస్యంగా రావాలి, వాళ్ళను ఆ వాకిట్లోనే కంటనీరు పెట్టించేసి తెగ భయపేట్టేది. మా హాస్టల్లో ఉన్నన్ని నియమాలు(rules) ఇంకెక్కడా ఉండవు. ఈ కాలంలో కూడా మొబైల్ వాడటానికి అక్కడ అనుమతి ఉండదు. ఎవరూ కూడా డెస్క్టాపులు, లాప్టాప్లు ఉపయోగించడానికి వీల్లేదు. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే మా కళాశాల ఆవరణం మొత్తం wi-fi సౌలభ్యం ఉంటుంది. హాస్టల్ పిల్లలకు మాత్రం సదుపాయం ఉండి ఉపయోగించలేని నిస్సహాయత :((.
మాకు ఒక 5 పాడుబడ్డ ప్రాచీనకాలం నాటి కంప్యూటర్లు ఉండేవి,అవి హాస్టల్ యాజమాన్యం పెట్టినవి. వాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. కేవలం మేము programmes చేసుకోవడానికి కావాల్సిన software మాత్రం install చేయబడి ఉంటాయి. అది కూడా ఉచితంగా వాడుకోవడానికి లేదు. గంటకి 10 రూపాయలు. ఇంకా మా హాస్టల్లో వారానికొకసారి విధిగా బయటికి పంపే ఆచారాలు లేవు. మరి ఇంక ఆ పని జరగకపోతే చచ్చిపోతాము అనే పరిస్థితి ఉంటే అప్పుడు ఒక గంట బయటకు వెళ్లి రావడానికి అనుమతించేది. మళ్లీ బయటకు వెళ్ళే ముందు వెళ్తాము అని, వెళ్లి వచ్చిన తర్వాత వచ్చేశామని చెప్పాలి. చెప్పలేదో.. అంతే సంగతులు.
ఇంకొక విచిత్రమైన నియమం ఏమంటే మేము ఏదైనా పెళ్లి అని అనుమతి తీసుకుంటే అప్పుడు మేము వెళ్తున్న పెళ్లి కార్డుతో పాటు ఒక లెటర్ వ్రాసి మా ఫైలులో పెట్టాలి. :) :). ఇంకా చెప్పాలంటే మాకొక టీవీ మాత్రం ఉండేది. దానికొక DTH కనెక్షన్. మా వార్డెన్ చూసేటప్పుడు ఎవరూ ధైర్యం చేసి చూసేవాళ్ళు కాదు. రోజు రాత్రి 10 వరకే చూడాలి. రాత్రి 10 తర్వాత ఎవరైనా చూసారో తోలు వలిచేది. 10 తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళుండాలి. అలా కాదని ఎవరైనా ఇంకొకరి రూంలో ఉంటే "పక్కన నిద్రపోయిన జనాలని చూపించి, వాళ్లకి మీరు ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత ఇబ్బంది " అని వాళ్ళు మేలుకోనేంత వరకు క్లాసు పీకేది. పది తర్వాత పక్క వాళ్ళ గదుల్లో ఉంటేనే ఓర్చుకోలేనిది ఇంకా 12 గంటలకి ఎవరి పుట్టినరోజులైనా చేయాలంటే ఇంకెన్ని తిప్పలో మాకు.
మాకు రెండు ల్యాండ్ ఫోన్లు, ఒక రెండు రూపాయిబిళ్లల ఫోన్లు ఉండేవి. ఒక ల్యాండ్ ఫోన్కి, ఆమె గదిలో ఉన్న ఫోన్ కి కనెక్షన్ ఉండేది. అందుకని చాలా వరకు మేమంతా దాంట్లో చేసుకోకుండా దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళం. కుక్క బారిన పడితే కనీసం కొరికి వదిలేస్తుంది. దీనికి దొరికామో నానా బీభత్సం చేస్తుంది. మళ్లీ ఈమెకు కాలేజీ లో కొంతమంది గూడాచారులు ఉండేవాళ్లు. ఒక హాస్టల్ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినట్టు తెలిస్తే చాలు, తన స్టైల్లో మాటలతో కరిచి %^%^&&#@ జీవితం మీద విరక్తి కలిగించేది. ఒకలాంటి అరవపు తెలుగు మాటలతో పిచ్చెక్కించేది. ఈమె అందరితో మాట్లాడదు. డబ్బు,దర్పం ప్రదర్శించే జనాలనే ఈ doggie పలకరించేది. ఇది అందరిని సమానంగా కరిచే doggie కాదు. ఒక అమ్మాయి హోదాని బట్టి ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువ,తక్కువ సమానంగా చూసేది.ఈమెకు,నాకు జీవిత కాలానికి సరిపడా శత్రుత్వం ఉంది. దాన్ని ఇంకొక టపాలో వివరిస్తాను.
మాకు రెండు ల్యాండ్ ఫోన్లు, ఒక రెండు రూపాయిబిళ్లల ఫోన్లు ఉండేవి. ఒక ల్యాండ్ ఫోన్కి, ఆమె గదిలో ఉన్న ఫోన్ కి కనెక్షన్ ఉండేది. అందుకని చాలా వరకు మేమంతా దాంట్లో చేసుకోకుండా దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళం. కుక్క బారిన పడితే కనీసం కొరికి వదిలేస్తుంది. దీనికి దొరికామో నానా బీభత్సం చేస్తుంది. మళ్లీ ఈమెకు కాలేజీ లో కొంతమంది గూడాచారులు ఉండేవాళ్లు. ఒక హాస్టల్ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినట్టు తెలిస్తే చాలు, తన స్టైల్లో మాటలతో కరిచి %^%^&&#@ జీవితం మీద విరక్తి కలిగించేది. ఒకలాంటి అరవపు తెలుగు మాటలతో పిచ్చెక్కించేది. ఈమె అందరితో మాట్లాడదు. డబ్బు,దర్పం ప్రదర్శించే జనాలనే ఈ doggie పలకరించేది. ఇది అందరిని సమానంగా కరిచే doggie కాదు. ఒక అమ్మాయి హోదాని బట్టి ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువ,తక్కువ సమానంగా చూసేది.ఈమెకు,నాకు జీవిత కాలానికి సరిపడా శత్రుత్వం ఉంది. దాన్ని ఇంకొక టపాలో వివరిస్తాను.
హాస్టల్ కబుర్లు అంటే ఏమన్నా నవ్వుకునే విషయాలు చెప్తారేమో అనుకున్నా, మీరేంటి చిన్ని గారు బయపెట్టేశారు :)
ReplyDeleteఇప్పుడు నాకు నిద్ర పట్టకపోతే మీదే బాధ్యత :D
నేను సరదాగా హింస లేకుండా చెప్తుంటూనే మీరిలా భయపడితే,అక్కడ మా పరిస్థితి కొంచెం ఊహించండి!! నిద్రపోవడానికి మా DOGGIE ని ఒక్కసారి ఘాట్టిగా తలుచుకోండి..నిద్ర కూడా భయపడి వచ్చేస్తుంది.:):D
ReplyDeleteఅంత ధైర్యం చేయలేనండి, నిద్ర భయపడి రావటం కాదు దరిదాపుల్లో లేకుండా పారిపోతుంది.
ReplyDeleteBe thankful to her because with her strict supervision you developed better and have your life intact. If there were no hostel rules, guess what majority of lives of these hostelers - that too women - would have become!
ReplyDeleteOfcourse we should thankful for her great supervision, but her supervision limited to only poor people who dont have money,status. That is the sad part.I was the victim of that partiality.
DeleteWaiting for the next post, darling!
ReplyDelete:):)
Delete"పక్కన నిద్రపోయిన జనాలని చూపించి, వాళ్లకి మీరు ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత ఇబ్బంది " అని వాళ్ళు మేలుకోనేంత వరకు క్లాసు పీకేది ha ha hillarious
ReplyDeleteThanks anu gaaru:)
Delete:) nice
ReplyDeleteమంజు గారు, ధన్యవాదాలు:)
Deleteఎప్పటిలాగే బాగుంది చిన్ని మీ పోస్ట్...
ReplyDeleteమీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు డేవిడ్ గారు.
ReplyDeletevammo e hostel o chepandi,free ga publicity chesedam join kavodu ani...:)
ReplyDeleteసందీప్ గారు, ఎంత ప్రచారం చేసినా అమ్మాయిలకు అక్కడ అంతకు మించిన ఛాయిస్ లేదు.:P
ReplyDeleteha ha...bagundhi :D
ReplyDeleteThanks anjali gaaru:)
ReplyDeleteBaagundi mee kathaa kastam.saili chaalaa baagundi.
ReplyDeleteBaagundi mee kathaa kastam.saili chaalaa baagundi.
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమా గారు.:):)
Delete