Monday 15 October 2012

అమ్మాయి మనసు..


      ఏంటో ఈరోజు నేను ఆఫీసులో ఉన్నానన్న మాటే కానీ.. ఈరోజంతా కూడలిలో ఉన్న బ్లాగులన్ని చదివి..వాటన్నిటికి స్పందించి బయటపడేసరికి సూర్యుని చుట్టూ భూమి ఒక అర ప్రదక్షిణ తిరిగి సూర్యాస్త సమయం అయ్యింది.ఏం చేస్తాం చెప్పండీ.. రేపు తొందరగా వచ్చి పని ముగించుకోవాలి.. ఈ పిల్ల టపా శీర్షిక ఒకటి పెట్టి ఇంకేదో వాగుతోందీ అనుకుంటున్నారా.. చెప్తానండీ.. ఇంక డొంకతిరుగుడు లేకుండా నేరుగా విషయంలోకి వచ్చేస్తాను.
       అమ్మాయిలకి ఎక్కువగా కష్టపడే తత్త్వం ఉంటుంది..ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి నేను ఎంత కష్టపడి మా టీంలీడ్ కళ్లుగప్పి ఈ టపా ఆఫీసులో కూర్చునే వ్రాస్తున్నానో.. నా సంగతి పక్కన పెట్టి అసలు విషయం అలోచిస్తే నిజంగా పని నచ్చితే దాన్ని పూర్తి చేయకుండా వదలరు.. ఏంటీ ఏమంటున్నారు..అలాంటి నచ్చినపని అమ్మయిలకు ఎప్పుడు దొరుకుతుందా అనా..!!సెభాష్..చాలా కాలానికి ఒక మంచి ప్రశ్న మీ నోటి నుండి..వాన రావడం,ప్రాణం పోవడం ఎవరూ చెప్పలేరు...అలాంటి పనులు అమ్మయిలకు చాలా అరుదుగా కనిపిస్తాయి..కనిపించినపుడు మాత్రం వాళ్లు అవకాశం చేజారకుండా పట్టుకుని చేసేస్తారు.. నిఝ్జంగా నిజం.. నేను చేసే పని మీదా ఒట్టు.. :P :D
          మీరేదో మనసులో అనుకుంటున్నారూ ...వద్దూ...ముందే  చెప్తున్న మీకూ....!!!బద్దక జీవులు అనా!!!!!..మీరు నిజంగా ఈ విషయం ఒక అమ్మాయి చేతైనా అనిపించి చూడండి..మీరు అలా వాళ్లని ఒప్పించారో మీరు నిజంగా గొప్ప వ్యక్తి..వ్యక్తి అన్న పదం కాదు కానీ శక్తి మీరు...హ హ హ..బయటికి అనేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.. అమ్మయిలలో ఉండే ఇంకొక గొప్ప లక్షణం తమ గురుంచి ఒక చిన్న విమర్శ కూడా తట్టుకోలేరు..చాలా సున్నింతంగా ఉంటాము మేము.. మా దగ్గర ఉన్న అస్త్రాన్ని ప్రయోగిస్తే ఎంతటి వారైనా మాకు సపోర్టు చేస్తారు... ఇది అంత అషామాషీ అస్త్రం కాదు.. ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించడానికి ....మా దగ్గరున్న కన్నీటి అస్త్రమే మాకు శ్రీరామరక్ష...దీన్ని చూసిన చాలా మందికి రౌండ్లు రౌండ్లుగా ఫ్లాష్ బాక్ సీన్లు గుర్తొస్తున్నాయనుకుంటాను...మీరు మరీ అంత ఎమోషనల్ అయిపొకూడదు... కొంచెం మనసులో దైర్యం నింపుకోండి...మీరిలా డీలా పడిపొతే నా మిగతా పోస్టు ఎవరు చదువుతారూ...పెళ్లి ఆగిపోయి ఏడుస్తుంటే పెళ్లి భోజనం ఎక్కడ? అని అడిగిందంటా అనుకుంటున్నారా..సామెత నేను సొంతంగా వ్రాశాను..ఎవరూ దయచేసి దొంగలించకూడదని ప్రార్థన...హిహిహీ..అంతా మీ అభిమానం.. అదేనండి...విషయం మీరు పట్టేశారు..
            అమ్మాయిలు కొంచెం స్వార్థపరులమండి, అందుకే మేము చెప్పేది ఎదుటి వాళ్లు పూర్తిగా వినాలని అనుకుంటాము..అలా విననపుడు మా అస్త్రాన్ని ప్రయోగించి వినేలా చేస్తాము..మీరు లాజిక్ పట్టేశారనుకుంటా..నేను అస్త్రాన్ని ప్రయోగించకుండా బుద్ధిగా వింటున్నారు..ఈసారి అస్త్రం సంధించకుండా వుండాలంటే,ఇలా పూర్తిగా వినండి అమ్మాయిలు  చెప్పేది... విన్నట్టు నటిస్తాము అంటారా..మీ వేలితో మీ కన్నే  పొడుచుకుంటాము అంటె నేను మాత్రం ఏం చేయగలను.. మధ్యలో నేను ఇప్పుడు ఏం చెప్పానో తిరిగి చెప్పు లాంటి సిలబస్లో లేని ప్రశ్నలు ఎదురవుతాయి...అందుకే నా ప్రియ శిష్యులారా..జాగ్రత్తగా వినండి..తడుముకోకుండా జవాబులు చెప్పి నా శిష్యులనిపించుకోండి..ఏమిటిది గురువరిణి!మా యందు మీ ప్రేమా,ఆపేక్షా ఇంతయేనా!!!!అని విలపించకండి,ఉపాయం ఉన్నది..మీరు వినినా..వినకపోయినా.. అవును...నువ్వు చెప్పింది నిజమే సుమా.. నేనసలు అలా అలోచించనే లేదూ అని పొగిడి..పొగిడినా అనుమానం రాకుండా చూసుకోండి... అస్తు...విజయోస్తు...
శుభం కార్డు వేయట్లేదు నాయనా....మిగతా భాగం తర్వాత వివరిస్తాను.... 
     ఇప్పుడు మీరు నిఝ్జంగ ఈ టపా చదివుంటే మీకొక అనుమానం వచ్చుండాలి, ఎందుకు ఈ పోస్టులో ఇన్ని చుక్కలున్నాయి అని...... వచ్చిందా? అమ్మాయి మనసు తెలుసుకోవడం కంటే ఆ ఆకాశంలోని చుక్కలు లెక్కపెట్టడం సులభం అని నేను అంతర్లీనంగ ఇవ్వదలచుకున్న సందేశము. లేదూ మేము ప్రయత్నిస్తాము అంటె..మీకు విజయోస్తు..

12 comments:

  1. ”మధ్యలో నేను ఇప్పుడు ఏం చెప్పానో తిరిగి చెప్పు లాంటి సిలబస్లో లేని ప్రశ్నలు ఎదురవుతాయి"

    ఎన్ని సార్లు నాకు ఇలా సిలబస్లో లేని ప్రశ్నలు తగిలాయో చెప్పలేను... ప్రతిసారీ నీళ్ళు నమలడమే నాపని...

    ReplyDelete
  2. నేను అసలు ఎవరికీ కామెంటు పెట్టను...
    అంటే వీడికో పెద్ద పోగరు అని త్వరపడి సర్టిఫికెట్ ఇచ్చేయక్ండీ...
    ఎందుకు పెట్టనంటే.. నాకు మహ బద్దకమండీ... అందుకే చదివి ఆనందించడమే...
    నిజాయితీగా చెప్పాలంటే మీరు చాలా బాగా రాస్తున్నారు....చాలా బాగున్నాయి ఇప్పటి వరకు వ్రాసిన టపాలు..

    ReplyDelete
  3. నిజాయితీగా బాగా వ్రాసారని అన్నారు.. ఏదొ మీ అభిమానం:P:) ధన్యవాదాలు.

    ReplyDelete
  4. Yenti chinni nuvvu..? Ilaa mana rahasyaalanni cheppesthe yela? Andariki thelipodu..?!!!

    ReplyDelete
  5. Next postlo anni questions vEsi answers cheppakunDaa vadilesthaanu..:P

    ReplyDelete
  6. Baagundhi chinni :).......e topic ki end em undadhu.......mana telugu serials laa lekkalenanni episodes untay....ayna complete avvadhu "అమ్మాయి మనసు..":)

    ReplyDelete
  7. అంజలి గారు, మీరిలా వ్యాఖ్యలోనే అమ్మయి మనసు గురించి చెప్పారు. ఇంకొక పోస్టు ఇప్పట్లో పెట్టను. కొనసాగింపు కూడా అనుమానమే.. ఎందుకంటే నాకస్సలు బద్ధకం లేదు..:D

    ReplyDelete
    Replies
    1. అయ్యో ....ఇన్నాళ్ళకి ఆశగా వచ్చాను నా "అట్లకాడ" ని నీ బ్లాగు లో వెతుకుతూ ....కొనసాగింపు లేదంటూ disappoint చేసావ్ చిన్ని :(

      Delete
    2. అంజలి గారు,
      మీ వ్యాఖ్య చూసి ఇప్పటికిప్పుడు ఒక పోస్టు వేయాలనిపిస్తుంది.. "అట్లకాడ" గురించి తప్పకుండా అమ్మయి మనసుకి లింక్ చేసి వ్రాస్తాను..మీరు మరీ ఇంత మొహమాటపెట్టేస్తున్నారు కాబట్టి.. చాలా సంతోషపరిచారు మీ వ్యాఖ్యతో ..Thanks :):)

      Delete
  8. మీ అస్త్రాలే మీకు పెద్ద అసెస్ట్.... వాటిని ఎన్నాల్లు ప్రయోగిస్తారో మేము చుస్తాం.....జుస్ట్ కిడింగ్...బగుంది మీ పోస్ట్

    ReplyDelete
  9. డేవిడ్ గారు, అంతేనండి మాలాగా మీరు అస్త్రాన్ని ప్రయోగించలేరని మీరిలా బాధపడుతున్నారు..:P ధన్యవాదాలు. నా బ్లాగుకు స్వాగతం :)

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.