Monday, 29 October 2012

బాటసారి బంధాలు

                        ఈరోజు పొద్దు పొడిచిన దగ్గరనుంచి నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులు,జీవన విధానం ఆలోచిస్తూ.. ఆ ఆలోచనలకి ఒక రూపం ఇవ్వాలని ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను.
        ఒక బాటసారి ఒక అడవిలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. అతని ఆలోచనలు, గమ్యం ఏది తనకు స్పష్టంగా లేవు.. అయినా ప్రయాణం ఆపకుండా తోచిన బాటలో పయనిస్తున్నాడు. అలా ఆ బాటలో ఇంకొక బాటసారి కనిపించేసరికి తెలియని ఒక ధైర్యం. నేను ఒంటరి కాదు అని కుదిరిన నమ్మకం. అలా ఆ ఇద్దరు బాటసారులు మాటలు కలిపి, "నీకు తోడుగా నేను ఉన్నానని "ధైర్యం చెప్పుకుని ఆ అడవిలో ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా సాగిపోతున్నారు.. అలాగే ఆ అడవిలోనే ఉండిపోతే కథ సుఖాంతమయ్యేది..
                              
         అలా ఇద్దరు తమ గమ్యంలేని ప్రయాణాన్ని గురించి కలత చెంది మిత్రమా! మనమొక గమ్యం నిర్దేశించుకుందాం, ఆ గమ్యం వైపు నడుద్దాం..ఆ గమ్యాన్ని చేరుకోవడంలో నీకు తోడుగా నేను ఉంటాను అని ఇద్దరు ఒకరికి ఒకరు చెప్పుకున్నారు..
         గమ్యం ఒక్కటే అనుకున్నారు.. ఆ గమ్యాన్ని చేరవలసిన దారులని ఇద్దరు భిన్నంగా ఎంచుకున్నారు.. ఒకరు కష్టమైనా ముళ్ల బాటలో పయనించి ఖచ్చితంగా గమ్యం వైపుపోయే దారిలో  వెళ్దామనుకున్నారు, మరొకరేమో ముళ్లులేని బాట గమ్యాన్ని చేరుతుందని తెలియకపోయినా ఏదో  ఒక దారి కనపడకపోదు అని అనుకున్నారు.. ఇంత వరకు చెప్పుకున్న మాటలని మరిచారు.. మిత్రమా! నువ్వు చెప్పిందే నిజం అని ఇద్దరు ఒకరికొకరు ఓదార్పు చెప్పుకోలేకపోయారు..గమ్యం లేనంత వరకు రాని పొరపచ్ఛాలు గమ్యం చేరుకోవాలి అని అనుకున్న సమయాన వచాయి..
           ఆ ఇద్దరు బాటసారులు.. మిత్రమా! ఎవరి దారిలో వాళ్లు పయనిద్దాము.. మన గమ్యం ఒకటే కదా.. అక్కడ కలుసుకుందాం అని.. ఎవరికి వారే యమునా తీరుగా విడిపోయారు...ఇద్దరు ఒక్కటైంది ఒంటరితనం మూలంగా ,కాని ఆ ఒంటరితనాన్ని మళ్లీ అహ్వానించి ఒంటరి బాటసారులయ్యారు .. ఆ అడవిలో ఏ కౄరమృగం దాడి చేసి గాయపరుస్తుందో తెలియదు..ఆ దారులు గమ్యo దగ్గరకు చేరుస్తాయేమో కాని  వాళ్లను వేరుచేశాయని మరిచిపోయారు.
ఒక చిన్న మనవి:
      ఇలా ఒంటరి బాటసారి పయనాలు మనకు వద్దు, ఒకరు మన దారిలోకి రానపుడు..స్నేహం కావాలన్నపుడు మనం  వారి దారిలో పయనించడంలో తప్పు లేదు..అలోచించండి!!!! చివరికి అందరి అంతిమ గమ్యం ఒక్కటే..మరణం..అది చేరుకునే మధ్యలో ఎందుకింత తపన..           

14 comments:

 1. I am sorry. Nuvvu anna "ఒకరు మన దారిలోకి రానపుడు..స్నేహం కావాలన్నపుడు మనం వారి దారిలో పయనించడంలో తప్పు లేదు..అలోచించండి!!!!" maatanu nenu angeekarinchalenu. Avathali vyakthi saraina maargamlo velithe sare. Kaani thappaina maargaanni yenchukonte sneham kosamani ade daarilo manam vellaalanukovadam moorkathvam. Kashtamo, nashtamo, ontarithanamo, yedainaa kaanivvu.. saraina maargamlone prayaanimchaalannadi naa abhipraayam.

  And.. post baga raasav :)

  ReplyDelete
 2. adi manchaa?cheDaa? ani cheppaTledu.. okari abhipraayanni gouravinchaDam annadi cheppaanu.. renDu daarulu gamyaanni chErchEvainapudu okari toDugaa okaru naDavaali annadi naa vuddEshyam adi muLla baataina sarE.. mee vyaakhyaku dhanyavaadaalu priya gaaru.. :)

  ReplyDelete
 3. Baagundi chinni garu mee chinni pryatnam, harshadaayakam

  ReplyDelete
  Replies
  1. dhanyavaadaalu Fathima gaaru mee vyaakhyaku:)

   Delete
 4. నేను ఒప్పుకుంటాను మీరు చెప్పింది. స్నేహంలోనూ, వివాహంలోనూ ఇలాంటివి తప్పవు. ఒక్కొక్కసారి మన మార్గం వదులుకుని స్నేహితుని మార్గం లో పయనించాలి. ప్రయాణం మనకి నచ్చినట్టు ఉండకపోవచ్చు, కానీ జీవితం ఆనందమయంగా ఉంటుంది!

  ReplyDelete
  Replies
  1. బిందు గారు,
   తోడు కావాలన్నపుడు మనం వారి దారిలో వెళ్లవచ్చు. ఒంటరి ప్రాయణం కన్న ఇదే మనకు happyగా ఉంటుంది. ధన్యవాదాలు నా బ్లాగుకు విచ్చేసినందుకు.

   Delete
 5. బాగుంది చిన్ని.....బాగా చెప్పావ్...."ఒకరు మన దారిలోకి రానపుడు..స్నేహం కావాలన్నపుడు మనం వారి దారిలో పయనించడంలో తప్పు లేదు."....దీన్నే adjustment అంటారు ..ఆ adjust అవ్వటం ఏదో హ్యాపీగా అయితే ....లైఫ్ హ్యాపీగా ఉంటుంది :)

  ReplyDelete
  Replies
  1. అంజలి గారు,
   నేను చెప్పింది దాని గురించే..adjust అవ్వడంలోనే సంతోషం వుంటుంది విడిపోవడంలో కన్న.. థాంక్స్ మీ కామెంట్ కు.

   Delete
 6. అడ్జస్ట్ అవుతు పోతుంటే మనకంటు ఇక జీవితం మిగలదేమో ఒక సారి అలోచించండి..

  ReplyDelete
 7. డేవిడ్ గారు,మనకు కావల్సిన వాళ్లను కూడా మన ego తో పోగొట్టుకోకూడదని నా అభిప్రాయం

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. చిన్ని గారు నేను అంటున్నది మనకు సంబందించిన భావాలు,అభిప్రాయాలు,అభిరుచులకు గురించి..వాటిని ఎడుటివ్యక్తి కొసం మార్చుకుంటు పోతుంటే ఇక మనకంటు జీవితం మిగలదేమో అని నా అభిప్రాయం. భార్య,భర్తల మధ్య ఎదొ ఒక విషయంలొ సర్దుకుపోతే పరవలేదంది.. కాని మొత్తం ఉనికికే సమస్య వస్తే కష్టం కదండి...చాలా మంది అమ్మయిల విషయంలో ఇదే జరుగుతుంది...పెళ్ళి అయ్యేవరకు వాళ్ళు తమకు ఇష్టం వచ్చిన రంగంలో రానిస్తారు..గొప్ప పేరు తెచ్చుకుంటారు..కాని పెళ్ళి అయిపోయాక ఇక భర్త కనుసన్నల్లోనే వారి ప్రతి కదలిక ఉంటుంది...భర్తకు నచ్చలేదని, అత్తా,మామలకు నచ్చలేదని తమకు సంబంధించిన గతాన్ని కొల్పోవాల్సి వస్తుంది...ఇది ఒక్క ఉదహారణ మాత్రమే....ఇలా అన్నింటికి సర్దుకు పోతుంటే ఇక జీవితంలో మనకంటు ఏమి మిగలదేమో అని నా అభిప్రాయం...నా అభిప్రాయమే కరెక్ట్ ఉండొచ్చు ఉండక పోవచ్చు .చాలా వరకు ఇలాగే జరుగుతుంది.

  ReplyDelete
 10. జీవితాంతం ఒకరి తోడు కావాలని కోరునుంటున్నప్పుడు అది పర్వాలేదు..మన ఉనికికే ప్రమాదంగా ఉన్నప్పుడు మనం ఎదుటివ్యక్తి కోసం మన అభిరుచుల్ని త్యాగం చేయక్కర్లేదు.మీ ఉదాహరణ చాలా బావుంది.

  ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.