Saturday, 25 August 2012

బ్లాగ్ పేరుతో వచ్చిన తంటా


చాలా బ్లాగులు చదివిన అనుభవంతో ఈరొజు ఒక శుభముహుర్తం చూసుకుని బ్లాగు చేద్దామంటే, బ్లాగూ పేరుతో పెద్ద తంటా వచ్చింది..
ఎలా అని ఆలోచిస్తూ నేను చేసిన ప్రయత్నాలు మచ్చుకు కొన్ని...

MENTOS తిన్నాను( ఎందుకంటే ప్రకటనలో చూపించినట్టు నా బుద్ధిని వెలిగించుకోవడానికి..:))
అబ్బే..లాభం లేదండే..పనిచేయలేదు..
ఈసారి నేను ఎలా అయినా నామకరణం చేయాల్సిందే అని..
ఒక kfc chicken bucket లాగించేసాను..అయినా అది finger licking కాని.. brain storming కాదని నాలుక కర్చుకుని .. నెమ్మదిగా ఆలోచిస్తుండగా పిల్లల పేర్లు లాగ బ్లాగు పేర్లు అన్న పుస్తకం ఉంటే ఎంత బాగుండేదో  అనుకుంటూ (ఇంకా అలాంటి పుస్తకం రాయలన్న అలొచన నాకు తప్ప మరెవరికి రానందుకు  గర్వపడి...:D)
మళ్లీ గట్టి ప్రయత్నం చేస్తే
ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ...
నేను నా గురించి వ్రాస్తున్నాను కాబట్టి ..
"Na_Swagatam" అని..
"Na_katalu " అని...
" Nenu_Na_Experiences" అని..
"Nenu_Experiences " అని...
" kathalu" అని..
"swagatam" అని...
"my_technicaltips" అని ... (నాకు తెలిసినవి చెబుదామని)

గూగులమ్మ నువ్వు చెప్పిన పేర్లన్ని నా పిల్లలికి..(అదేనండీ నా(బ్లాగర్) లో నా బ్లాగు కన్నా ముందే బారసాల  జరుపుకున్న బ్లాగులకి) ఉన్నాయి..నువ్వు వేరే పేరు చూసుకోమంది..
Experiencesని తెలుగులో ఏమంటారో అని ఆలోచిస్తుండగా...
"అనుభవాలు" అని తట్టిందండి...:)...
ఒక ఐడియా నా బ్లాగు పేరుని మార్చేసింది ...
 ప్రయత్నించి మహత్తరమైన ఐడియా  తో నా బ్లాగు నామకరణం చేయడం జరిగింది...

నా బ్లాగు నామకరణానికి విచ్చేసిన అందరికి నా ధన్యవాదాలు