Wednesday 3 October 2012

నేను చూసిన సినిమా

ముందుగా మా ఆఫీసు సెలవు పట్టిక చూసుకోకపోవడం వల్ల అనుకోకుండా ఊరికి వెళ్లకుండా హైదరాబాదులో ఉండాల్సివచ్చింది.ఎలాగూ మనం ఎంత ఆనందించాలన్న ఉన్న ఒకే సౌకర్యం సినిమానే కాబట్టి. సినిమాకి తప్పక వెళ్లాల్సొచింది.
     మొన్ననే శేఖర్ కమ్ముల మీద నమ్మకంతో చూసిన "life is beautiful" సినిమాకి అమృతాంజన్లు ఒక డజను ఖర్చు అయినా..మళ్లీ ఎందుకో సినిమాలు చూడకూడదు అనుకుంటూనే సినిమా టిక్కెట్లు బుక్ చేశాను. ఇంతకి నేను చూసిన సినిమా ఏంటంటే రెబల్.. ఏంటి అలా బ్రౌజర్ మూసేస్తున్నారు..మిమ్మల్నే..కొంచెం చదవండీ నా గోడు..మీకు టిక్కెట్ల ఖర్చులేకుండానే కథ చెప్పేస్తాను..అదే మరి నా మంచితనం :) :)..
     సినిమాకి బయల్దేరే ముందు నుంచి వర్షం పడుతూనే ఉంది. సినిమాకి వెళ్దామా?వద్దా? అనుకుంటూ ఉండగానే వర్షం ఆగింది. హమ్మయ్య..ఇక బయల్దేరోచ్చు అని బయల్దేరి సగం దూరం వెళ్లే సరికి మళ్లీ మొదలైంది.. ఇక వర్షంలో వెళ్లలేక స్నేహితులమంతా వర్షం ఆగేలోపు ఒక చిన్న చర్చ పెట్టాము..
    ఈ సినిమాలో కామెడీ ఉంటుందా? ఇంతకి కథ మొత్తం మాస్ తరహాలో ఉంటుందేమో? డ్యాన్స్ లేకుండా లారెన్స్ సినిమా ఉంటుందా? అని నేను అడగ్గానే నా మీద మాటలతో యుద్దానికి దిగారు.. అయినా నువ్వేంటి..ప్రభాస్ నీకు కామెడి యాక్టర్ లాగా కనిపిస్తున్నాడా? ప్రభాస్ సీరియస్ గా ఫైట్లు చేస్తాడే తప్ప..కామెడి చేయడు అని మా ఫ్రెండ్ జోస్యం చెప్పింది.. లారెన్స్ నీకు డాన్స్ లేకుండా సినిమా తీయడమా? అది దాదాపు అసంభవం అని మా ఫ్రెండ్ అరిచిన అరుపుకి పాపం వర్షం కూడా ఆగిపోయింది.:)
      సినిమా థియేటర్లోకి వెళ్లేసరికి ఇంకా సినిమా మొదలవలేదు. హమ్మయ్య అని కూర్చున్న తర్వాత ఆట మొదలైన 15 నిమిషాలకి అసలు సినిమాని జీర్ణించుకోలేని సందర్భంలొ ఎవరివో కాలి మేజోళ్లు ఉతకనట్టున్నారు..అబ్బబ్బ..ఆ సువాసనను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. దరిద్రం మనల్ని ఈరోజు వదలదని సినిమా చూడటం మొదలుపెట్టాను. ఈ సినిమాలో తమన్నాని చూసి కొంచెం పోల్చుకోలేకపోయాను..బాగా సన్నబడింది..లారెన్స్ గారు కొంచెం వైవిధ్యాన్ని ప్రదర్శించాలని హీరో గారి కోసం పెట్టే "introduction song" తనకి పెట్టి తన చేత స్టెప్పులు వేయించారు. బ్రహ్మానందం, కోవై సరళ గారి హాస్యం ఎవరికైనా హాస్యం అనిపిస్తే గట్టిగా నవ్వుకోండి. తర్వాత వాళ్లు ఉండరు సినిమాలో.హీరో గారి పరిచయం  హైదారబాదులొ మొదలైనా అతను వెతికే రౌడీ దగ్గరి PA గారి కూతురు bangkokలో ఉందని తెలిసి హీరో అక్కడికి వచ్చి తనకి కావల్సిన విషయం తెలుసుకుంటాడు. ఇక్కడితో విరామం. హమ్మయ్య... ఈ దుర్గంధం నుంచి బయటకెళ్లి ఏమైనా తెచ్చుకుందామని వెళ్లి వాటిని తినలేమని గ్రహించి తిరిగి వచ్చే సరికి ఇంకొక కొత్త కథనాయిక కనిపించింది. నాకు ఇంకొక కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అక్కడ మన హీరో గారి  తల్లిదండ్రులు,ప్రియురాలు చనిపోతారు. సినిమా చివరికి హీరో గారు పగ తీర్చుకుని విజయం సాధిస్తారు. నాకు ఈ సినిమాలో ఒక డైలాగు నచ్చింది.
     హీరో అలీతో నాకు పాటలు రావు.. కాని నా దగ్గర అన్ని సంగీత దర్శుకుల CDలు అన్ని ఉన్నాయి అని అంటాడు. సంగీత దర్శకత్వం వహించిన లారెన్స్ తన మీద వేసుకున్న సెటెయిర్ అని నేను అనుకున్నాను.
     ఇందులో రెండు ఫైట్లు మాత్రం అలరిస్తాయి. ప్రభాస్ ఫాన్స్ ఎన్ని సార్లైనా ఈ సినిమా చూడగలరు..కానివారు కొంచెం అలొచించి వెళ్లండి..  
PS: ఈ టపాలోని మాటలు కేవలం నా అభిప్రాయం మాత్రమే.                                   
    

2 comments:

  1. మీకు బోలెడంత పుణ్యం చిన్నీ. నిన్న రాత్రే అనుకున్నాను. "ఎన్నో ఏళ్ళు కష్టపడి తీసారు కదా.. బాగుంటుందేమో? పైగా ఇక్కడ ఏ తెలుగు సినిమాలు ఆడి చావడం లేదు. శుక్రవారం ఆఫీసు అయ్యాక వెళ్ళాలి" అని. నా లక్ బాగుండి మీ పోస్ట్ చదివాను. లేకపోతే ఈ చెత్త సినిమాకి నేను కూడా బలైపోయేదాన్ని. థాంక్స్. ఇప్పుడిక "తాండవం" (విక్రం, జగపతి బాబు, అనుష్క కలిసి నటించారే.. తెలుగులో టైటిల్ తెలియడం లేదు). ఎలా ఉందొ కనుక్కోవాలి.

    ReplyDelete
  2. ప్రియ గారు,
    మీరు మరీనూ!!ఇంత చిన్న సహాయానికే ఇన్ని పొగడ్తలా!!?మిమ్మల్ని ఇలాగే ముందు ముందు సినిమా ఆపద నుంచి ఇలా ముందే చెప్పి తల బొప్పి కట్టకుండా రక్షిస్తాను..:D
    ధన్యవాదాలు.

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.