నిన్న రాత్రి పది గంటలకు అక్క ఫోన్ చేసింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పరీక్షాఫలితాలు వచ్చాయి. కొంచెం చూడు అని.. నేను సైట్ తెరిచి చూసాను ఏం పెట్టారో చూద్దాము అని.. 316 మంది హాల్ టికెట్ల నంబర్లు పెట్టారు. మాకు హాల్ టికెట్ నంబర్ తెలీదు. తనేమో ఎటూ తేల్చని నీట్ పరీక్ష వ్రాయడానికి బెంగళూరు వెళ్లింది. తన హాల్ టికెట్ ఏమో నేను నా ఆఫీస్ డెస్క్టాపు మీద సేవ్ చేసాను. ఇంక చేసేదేమీలేక రాత్రి అలాగే నిద్రపోయాను. ఉదయాన్నే లేవగానే తను ఫోన్ చేసింది. ఆఫీసుకు వెళ్ళావా అని.. నేను అప్పుడే కళ్లు నలుపుకుంటూ ఇప్పుడే లేచాను అని బద్ధకంగా చెప్పాను.
ఫలితాలు వచ్చాయి కదా అని గుర్తు చేసింది. నాకు కూడా గుర్తుంది కానీ ప్రభుత్వఉద్యోగం అంటే ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగి నిజంగా మెరిట్ చూపించిన వాళ్లకే ఇస్తారనే నమ్మకం నాకు లేకపోవడంతో నేను వెంటనే తొందరపడి చూడాలని అనుకోలేదు.ఈ వైద్యశాఖలో చాలా అవకతవకలు, మోసాలు జరుగుతాయని నాకు తెలుసు. దాని వల్ల ఎంతమంది విద్యార్థులు తమ జీవితాలను నష్టపోతున్నారో కూడా తెలుసు. ఎందుకంటే అక్క కూడా వాటి వల్ల నష్టపోయింది కాబట్టి. వాటి గురించి ఒక టపా వేద్దామనుకున్నాను కానీ మనం ఎంత గొంతు చించుకున్నా అవి పాలకుల చెవులకి ఎప్పటికీ వినిపించవు. హ్మ్మ్ ఇలా ఇన్ని ఆలోచనలు బుర్రలోకి వచ్చి ఇప్పుడు చూడటం అవసరమా అని అనిపించింది.
ఇంతలోపు ఇంకొకసారి తన నుంచి ఫోన్ "పోనీ, అమ్మని అడుగుదాము..తను చెప్తుంది కదా హాల్ టికెట్ నంబరు అని..". నేను వద్దు..ఇప్పుడు అంత హడావుడి ఏం చేయకు. నేనే ఆఫీస్ వెళ్లి చూస్తాను.ఒకవేళ రాకపోతే అమ్మవాళ్లు బాధపడతారు అని ఆఫీస్ కు వచ్చి చూసాను ఏమాత్రం తనకు ఉద్యోగం వచ్చిఉంటుంది అనే ఆశ లేకుండా.. హుర్రే!!! తనకి ఉద్యోగo వచ్చింది.. తనకి వెంటనే ఫోన్ చేసి చెప్పాను. ఇంక ఎక్కడో మెరిట్ మీదే ప్రభుత్వఉద్యోగాలు ఇస్తున్నారు అని ఆనందపడిపోతున్నాను.
నిజంగా నా జీవితంలో ఇదొక సంతోషకరమైనవార్త. తనలో తాను బాధపడుతున్న అక్కకు ఒక పెద్ద ఊరట. తను పడ్డ శ్రమకు దొరికిన ఫలితం.ఈ ఆనంద హేల మీ అందరితో పంచుకోవాలని ఇలా వచ్చాను.. మా తరుపున మీకు కమ్మని పాయసం ఇదిగో...
I am soooo glad... :) Akka ku congrats cheppaanani cheppu Chinni :) :)
ReplyDeleteతప్పకుండా చెప్తాను ప్రియా..:):)
ReplyDeleteమీ అక్కకు మా తరపున కంగ్రాట్స్.
ReplyDeleteఇంతకీ ఆ పాయసం మీరే చేశారా? :)
శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు.. గూగుల్ ఇమేజ్ అండీ.:)
Deleteఆనందంలో మీరే చేశారేమో అనుకున్నా :)
ReplyDelete:):)చేసుకోవాలని ఉన్నా నేను హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి..ఇప్పుడు అది కుదరదు:)
Deleteఅయితే మేమే better అన్నమాట..అప్పుడప్పుడు చేసుకుంటుంటాం :D
Deleteఅంతేనండి మీరే better:):D
Deleteగ్రేట్., కంగ్రాట్స్ :-)
ReplyDeleteధన్యవాదాలు హర్ష గారు.:)
Deletecongrats to ur sis
ReplyDeleteThanks sandeep gaaru:)
ReplyDeletecongrats to your sister chinni.
ReplyDeleteThanks a lot David gaaru.
Deletecongacts to ur sister
ReplyDeleteThanks a lot anu gaaru:)
DeleteCongrats mee sister ki ..payasaam naaku...
ReplyDeleteCongrats to your sister..:) :)
Thanks a lot vajra gaaru.
DeleteCongrats to your sister
ReplyDeleteThanks Sri Latha gaaru:)
Deleteశుభాకాంక్షలు,
ReplyDeleteఇదేదో అక్షయ పాత్ర లాగ ఉందే , ఎంత తిన్న పాయసం నిండుగానే ఉంటుంది.
మీ అభినందనలకు ధన్యవాదాలు.. :)
ReplyDeleteఅవునా... అక్షయపాత్రంటారా...:):):D
చిన్నిగారు..
ReplyDeleteఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన మీ అక్కకు శుభాకాంక్షలు. మొత్తానికి ఎలాంటి టెన్షన్ లేకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడొస్తాయిలే అని పెద్దగా పట్టించుకోని మీకు తీపి కబురు కదా.. అంతేనండీ ఆ పైవాడు ఎప్పుడూ మనం ఎదురుచూసినట్లుగా ఏమీ చేయడు.ఆయన అనుకున్నట్లుగానే అన్నీ చేసేస్తుంటాడు..
అందుకు ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉండాల్సిందే.. Congrats Once again to Your Sister... :)
శోభ గారు,
Deleteధన్యవాదాలు మీ అభినందనలకు. అవునండీ, ఆ దేవుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము ఇంతటి సంతోషాన్ని మా సొంతం చేసినందుకు.
Hai chinni, Congrats to ur sister :) and thanks for ur payasam treat ;)
ReplyDeleteHai anjali gaaru,
Deleteథాంక్స్ మీ విషెస్ కి:).. పాయసం రుచి చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ;):)