అసలు నువ్వు అంటే నాకెంత ఇష్టమో తెలుసా..? తన పైన ఉన్న ఇష్టాన్ని మీ అందరికి చెపుదామనే ఈ టపా..
తన గురించి అందరు మాట్లాడుకుంటుంటే వినడమే తప్ప తనని దగ్గరగా చూసింది లేదు.. నాకు తెలిసినంత వరకు తనకు టెక్నికల్ విషయాలు బాగా తెలుసు..ఎందుకంటే అప్పుడప్పుడు తన సహాయం తీసుకున్నా కానీ అప్పటికప్పుడు తన సహాయానికి ఒక చిన్న థాంక్స్ చెప్పి నా పని నేను చూసుకుని మళ్లీ తనను అసలు చూసేదాన్నే కాదు. పరిచయం లేని కొత్తలో ఇంకొకరి ద్వారా తన నుంచి సహాయం అందేది.:)
తను కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడుతాడేమో అని తనకి అస్సలు తెలుగు తెలియదేమో అని అనుకున్నాను.. కానీ తనకు తెలుగు కూడా తెలుసని నాకు తెలిసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపడి తనతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించాను, కానీ మనసులో చిన్న బెరుకు.. మొదట పొడి పొడి మాటలతో మా పరిచయం మొదలైంది. తనంటే నాకు చాలా ఇష్టం అని నాకు తెలుసు.. కానీ తనతో ఎలా చెప్పాలో తెలియని ఒక చిన్న గందరగోళం మనసులో.. కానీ తనేమో తనకి ఈ విషయమే పట్టనట్టు నాతో మాములుగానే ఉండేవాడు. కొద్దిరోజులు బానే ఉంది.. పరిచయంలో ఎలాంటి కలతలు లేవు..ప్రయాణం సాఫీగా సాగుతోందీ..
కానీ నా మనసులో మాట చెప్పకుండా తన నుంచి తప్పించుకు తిరగలేక ఒకరోజు నేను చెప్పేసాను.. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం..ఇప్పట్నుంచి నా జీవితంలో నువ్వు కూడా ఒక భాగమేనని.. చెప్పిన వెంటనే నా ప్రతిపాదనని ఒప్పుకోకపొయినా మరీ అంతగా నన్ను ఇబ్బంది పెట్టలేదు.. ఒక చిన్న ముద్దుపేరు పెట్టమని అడిగాడు..ఆ మాత్రానికే నేను తెగ సంబరపడి బాగా ముద్దుపేర్లు ఏముంటాయా అని చించి ఒక 10,20 పేర్లు చెపితే ఒకపేరు బావుందని అన్నాడు..హమ్మయ్యా!!సంతోషం అనుకుని ఇంక తన ప్రేమ గెలుచుకున్నందుకు ఏనుగు ఎక్కినంత సంబరపడ్డాను.
అది మొదలు.. నాకు తెలిసిన ప్రతి విషయం తనతో చెప్పుకోవడం ఒక అలవాటు అయ్యింది.. మొదట్లో తనను రోజుకొకసారి కూడా చూడాలనిపించేది కాదు.. రాను, రానూ తనని రోజుకోక వంద సార్లు తలుచుకుంటున్నాను.. ఆఫీసులో ఎవరూ చూడకుండా తనని దొంగచాటుగా చూసేదాన్ని. తన నుంచి కూడా అలాంటి అభిమానమే కనిపించింది నాకు. ఒక్కొక్కసారి తనతో మాటల్లో మునిగితే అసలు సమయమే తెలిసేది కాదు.. అంతగా నాకు కబుర్లు చెప్తాడు..అందుకే ఎక్కువగా పని ఉన్నప్పుడు నేను తన దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా తప్పించుకు తిరుగుతాను:) మీరలా దుర్మార్గులారా అని నన్ను తిట్టేసుకోకూడదు.. తప్పదు మరి, ఇలాంటి విరహం అనుభవించాల్సిందే.. మీరే ఒప్పుకుంటారు నా మాటే సరైనదని నా మాటలు పూర్తిగా విన్న తర్వాత..:) ఇంకా తన వల్ల చాలా సార్లు ఆఫీసులో ఉండిపోవాల్సి వచ్చేది ఒక్కొక్కసారి తను చెప్పే ఊసులు వినడానికి.. తను కూడా నా మాటలన్నీ శ్రద్ధగా వినేవాడు.
తన గురించి ఒక కవిత (తవిక) మీ కోసం
నా ఏడుపుకి తను ఒక ఓదార్పు,
నా సంతోషానికి తను ఒక చిరునవ్వు,
నా భయానికి తను ఒక ధైర్యం,
నా విజయానికి తను ఒక కారణం,
నా అపజయంలో తను ఒక భరోసా..
నేనే తను.. తనే నేను...
ఒక్కొక్కసారి నేను బస్సు కోసం స్టాపులో ఎదురు చూస్తున్నప్పుడు తనను పొరపాటున నా ఫోనులో పలకరిస్తే ఇంకా తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయేదాన్ని. అలా తనతో మాట్లాడుతూ ఒక్కొక్కసారి మూడుగంటల పైనే గడిపేసిన క్షణాలు ఉన్నాయి. తనతో రాత్రంతా కబుర్లు చెప్తూ ఆఫీసులో కునికిపాట్లు తీసిన సందర్భాలెన్నో..ఒక్కొక్కసారి దారిలో నడిచేటప్పుడు తన చెప్పిన ఒక అభినందనకరమైన ప్రశంసను ఫోనులో చూసుకుంటూ మురిసిపోయి ఏమరపాటుగా ఏ వాహనానికో అడ్డుగా పోయి చివాట్లు పెట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా తనని వదిలిపెట్టలేనంతగా తనకి నేను అలవాటు పడిపోయాను. తన వల్ల నాకు ఇంకా మంచి మంచి స్నేహితులు దొరికారు. నాకంటూ ఉన్న ప్రపంచం నుంచి నాలో మరుగునపడిపోతున్న ఒక గొప్ప లక్షణాన్ని బయటికి తీసి నాకు నన్నే కొత్తగా పరిచయం చేశాడు. తన పరిచయం, తనతో పాటు వచ్చిన కొత్తప్రపంచం నాకు కొత్తగా, హాయిగా, సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు తన వ్యసనం నుంచి బయటపడాలని అనుకుంటున్నా కూడా.. అలా తన ప్రేమని వదిలి ఉండలేకపోతున్నాను. తను నా జీవితంలో భాగంగానే నాతో పాటు జీవన ప్రయాణం చేస్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత మీకు తనని పరిచయం చేయకపోతే మీరు నన్ను తిట్టేసుకుంటారు.. నాకు తెలుసండి.. ఇంతగా నను మురిపించింది ఇంకెవరు?? ఇదే నా ప్రేమ (నా బ్లాగు )

:-) మొదటి సారి చివరి వాఖ్యం చదివాక , ఇంకొసారి చదవాల్సి వచ్చింది..బాగుందండి మీ వర్ణన..:-)
ReplyDelete:)మీకు నచ్చినందుకు ధన్యవాదాలు రఘుగారు..:)
Deleteసగం చదివేసరికి కంప్యూటర్ గురించి చెబుతున్నారనుకొన్నాను. బాగుంది మీ ప్రేమకథ :)
ReplyDeleteధన్యవాదాలు కిశోర్ గారు:)
Deleteఛిన్ని గారు, వెరైటీగా బాగా రాసారండి.
ReplyDeleteధన్యవాదాలు మీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యకు:)
Deleteha ha me love story bagundi andi
ReplyDeleteసందీప్ గారు, ధన్యవాదాలు:):D
Deleteనాకయితే చివరి వరకు అస్సలు అనుమానం రాలేదు. బాగుంది.
ReplyDeleteగ్రీన్ స్టార్ గారు,ధన్యవాదాలు మీ మెచ్చుకోలుకు:)
Deleteగ్రీన్ స్టార్ గారు అనుమానం రావడానికి రాస్తున్నది ఎవరనుకుంటున్నారు. ఇక్కడ చిన్ని...అంత ఈజీ గా మనం కనిపెట్టలేము...చిన్ని గారు మీరు రాస్తున్న విధానం చాలా బాగుంది...nice post.
ReplyDeleteడేవిడ్ గారు,
ReplyDeleteఇంత మంచి,ప్రోత్సాహకరమైన మీ వ్యాఖ్యను చూసి కెవ్వ్వ్వ్ మన్నాను..చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు:)
మధుమోహన్ గారు,
ReplyDeleteమిమ్మల్ని నిరాశపరిచినట్టున్నాను. మీ కోసం ఒక కథ అల్లి పేటెంట్స్ మీకే ఇచ్చేస్తాను, సినిమా తీయిద్దురు..:Dవ్యాఖ్యకి ధన్యవాదాలు:):)
అయ్యో.. ఈ పోస్ట్ ఇప్పుడే చూస్తున్నా! నా ప్రేమకథ అని టైటిల్ చూడగానే షాక్ అయ్యా.. చదవకుండానే ఉత్తినే కిందకు స్క్రోల్న్ చేసి చూసినపుడు కనిపించిన పిక్చర్ చూడగానే అర్ధమైపోయింది :P ముద్దు మొద్దూ.. ఇలాటి క్లూలు ఇచ్చేయకూడదు మరి :)
ReplyDeleteఇంతకూ అసలు విషయం చెప్పడం మరచిపోయా.. అందంగా రాశావ్ :)
మరీ నీలా అంత సస్పెన్స్ థ్రిల్లర్ నేను రాయలేనుగా..:) థాంక్స్ నీ మెచ్చుకోలుకు..:D
Deleteతిట్టావా పొగిడావా...?? ;)
Deleteబావున్నాయ్ ప్రేమ కబుర్లు.
ReplyDeleteధన్యవాదాలు జ్యోతిర్మయి గారు:)
DeleteCreative..Nice..:)
ReplyDeleteThanks :) Dhaatri gaaru:)
Delete"నా ఏడుపుకి తను ఒక ఓదార్పు,
ReplyDeleteనా సంతోషానికి తను ఒక చిరునవ్వు,
నా భయానికి తను ఒక ధైర్యం,
నా విజయానికి తను ఒక కారణం,
నా అపజయంలో తను ఒక భరోసా..
నేనే తను.. తనే నేను..."
చాలా బాగుంది చిన్నిగారు.. :)
ధన్యవాదాలు శోభ గారు మీ మెచ్చుకోలుకు:):)
Deletehahahahah
ReplyDeletebut i think u had a real love story !!!am i ryt??
ReplyDelete