Wednesday 12 June 2013

జియా మరణం

                 ఈ వార్త వినగానే నేను ఒకలాంటి బాధకు లోనయ్యాను. రంగురంగుల, జిలుగు వెలుగుల మధ్య ఉన్న సినిమా ఫీల్డ్ అంటేనే చాలా మందికి సదభిప్రాయం ఉండదు. సినిమా అంటే 24 కళలు కలిస్తినే ఉద్భవించేదే అయినా తెర పైన కనిపించే నటి,నటులనే ఎక్కువమంది ఆరాధిస్తారు.అందుకనే వీళ్లు ఏది చేసినా మీడియా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుంది. 
               జియా మరణం గురించి తెలిసిన వెంటనే అందరు కూడా తన కెరీర్ పరంగా తనకి అవకాశలు లేవని దాని వల్ల కొంత నిరాశ,నిస్పృహలకు లోనయ్యి ఇలా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉంటుందనుకున్నారు.అప్పటికి తన మరణం పైన ఒక తెలుగు పేపర్ ప్రేమే ప్రాణం తీసిందా అనే అనుమానాన్ని వెలిబుచ్చింది. చివరికి ఆ అమ్మాయి ప్రేమవల్లే చనిపోయిందని తెలిసి చాలా బాధేసింది. అందరికి గుర్తుండే ఉంటుంది దివ్యభారతి కూడా ఇలాగే రాలిపోయిందని.అది కేవలం యాధృచ్చికంగానే జరిగినట్టు చిత్రించారు నాకు గుర్తున్నంత వరకు. 
                జియా మరణించిన వారం తర్వాత వాళ్లింట్లో తను చనిపోవడానికి కారణాన్ని విపులంగా వివరిస్తూ తన బాధనంత అక్షరాలుగా వ్రాసిన ఒక ఉత్తరం బయటపడింది.. నిన్న అది చదివిన వెంటనే కళ్ల నుండి తెలియకుండానే కన్నీళ్లు ఒలికిపోయాయి. శాస్త్రీయపరంగా అబ్బాయిల కన్నఅమ్మాయీలు కొంచెం ఎక్కువ సున్నితంగా ఉంటారు. అందులోనూ అబ్బాయిల కన్న తొందరగా నిరాశకు లోనయ్యే విధంగా మెదడులో నిర్మాణం జరిగిఉంటుంది. పుట్టుకతోనే దేవుడు కూడా అమ్మాయిలు ఎక్కువ బాధపడాలనే  ఇలా చేశాడేమో అనిపిస్తుంది.  
               ఆ అమ్మాయి ఉత్తరంలోంచి కొన్ని వాక్యాలు:
        నన్ను నేను కోల్పోయేంతగా నిన్ను ప్రేమించాను, కాని నువ్వు నా ప్రేమను నీ మోసం రూపంలో చూపించావు. నీ ప్రపంచం కేవలం అమ్మాయిలు, పార్టీలు చేసుకోవడము. నా ప్రపంచం మాత్రం నువ్వు, నీతో ఉన్న నా జీవితం. నేను ఇంకొక శ్వాస తీసుకోవడానికి నాకు ఏ కారణం కనిపించడం లేదు.నీ కోసం కన్నీరు కార్చిన  ప్రతిసారి నువ్వు దాన్ని చూసి నవ్వావు. నేను ఈ ప్రదేశాన్ని నా చెరిగిపోయిన నా కలలతో, విరిగిపోయిన మనసుతో వదిలి వెళ్తున్నాను. పడుకోవాలనుంది కానీ ఇక ఎప్పటికి ఆ నిద్రలోంచి మెళుకవ రానంతగా ....
                  

                    ఈ ఉత్తరం చదివిన వెంటనే చాలా బాధగా అనిపించింది. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించడం అంటే తనన్ అవసరానికి వాడుకుని వదిలేయడము కాదు కదా!! కానీ కొంతమందికి విచిత్రంగా అనిపించొచ్చు ప్రేమలో విఫలమైతే ప్రాణం తీసుకోవాలా అని, మరి ప్రేమించిన వ్యక్తినే ప్రాణం కన్న మిన్నగా ఆరాధిస్తున్నపుడు,జీవితం అంత విలువైనదిగా అనిపించదు. తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు జీవితం శూన్యంగా అనిపిస్తుంది. అలా అని ఆ శూన్యం నుంచి బయటపడకుండా దాంట్లోనే కూరుకుపోయి చావును ఆహ్వానించకూడదు. అమ్మాయిలు ఎంత సెలెబ్రిటీలు అయినా వాళ్ల మనసు మాత్రం ఒక సాధారణ అమ్మాయి మనసులానే ఉంటుంది. జియా వ్రాసిన వాక్యాలు చదివిన వెంటనే నాకావిషయం అర్థమైంది. ఆ అమ్మాయి చావడానికి చూపిన తెగువ జీవించడానికి చూపించుంటే ఆ అబ్బాయికి ఒక పాఠం నేర్పినట్టయ్యేది. తన ఆత్మకు శాంతి చేకురాలని..తను ఎక్కడున్న మనఃశ్శాంతి పొందాలని
                               

5 comments:

  1. If we can stop people who want to commit suicide for 10 minutes, then that thought will vanish from their minds. I feel VERY BAD about her, at such an young age......still no maturity about life. She will be soon disappearing from people's memories, but that guy will lead a happy WHOLE life.....How sad.....Girls please think.........LOVE IS NOT LIFE...ITS ONLY A PART OF LIFE. Think from your parents' side!........Sirisha.

    ReplyDelete
  2. Let's take individuals as induvidulas and individual cases as individual cases without deducing sectarian or gender conclusions therefrom. I think it was late Zia's personal problem, but not every other female's problem.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. జియా ఖాన్ మరణం నాకు మరో సారి టాల్ స్టాయ్ "అన్నా కరేనినా" ను గుర్తుకు తెచ్చింది. ఇద్దరి జీవితాలకు ఒక పోలిక ఉంది. జియా ఖాన్ కూడా అన్నా కరేనినా" లాగే తనకన్నా నాలుగు సంవత్సరాల చిన్నవాన్ని ప్రేమించింది. అప్పటికే వివాహిత అయిన అన్నా కరేనినా, తన కంటే చిన్నవాడైన వ్రాన్ స్కీతో యాదృచ్ఛిక క్షణాలలో తన ప్రమేయం లేకుండానే ప్రేమలో పడిపోతుంది. కానీ స్త్రీని ఇనుప తెరల మాటున బంధించి ఉంచిన ఆ సమాజంలో… అటు వివాహ బంధనాలు తెంచుకోలేక, ఇటు గాఢమైన ప్రేమకు బద్ధురాలు కాలేక ఆత్మహత్యకు పాల్పడుతుంది అన్నా కరేనినా.జియా ఖాన్ కూడా సూరజ్ కంటే నాలుగేళ్ళు పెద్దదే. కానీ వ్రాన్ స్కీ నుండి కరేనినా ప్రేమను పొందినట్లు అంత గాఢమైన ప్రేమను జియా ఖాన్ పొందలేకపోయింది. ఒక అర్పకుడిని ప్రేమించిన పాపానికి తన ప్రేమను బలి చేయాల్సి వచ్చింది. త్వరపడి తన విలువైన ప్రేమ హృదయాన్ని ఒక ప్రేమ రాహిత్యునికోసం అనవసరంగా బలి ఇచ్చింది. ఎందుకంటే ఒక ముర్కుడుని ప్రేమించి ప్రేమను పొదలేకపోయింది. "ప్రేమను ఇవ్వడమే ప్రేమ కాదు. మనము ఇచ్చే ప్రేమ అవతలి వారు ఎలా తీసుకున్నారో కూడా తెలుసుకోవడం ప్రేమ లో భాగం"...ఎదయితేనేం వెలుగు జిలుగు రంగుల ప్రపంచంలో ఇవ్వడమే తెలిసిన ప్రేమకు నిజమైన ప్రేమను పొందలేక తనువు చాలించింది.... జియా మరణించవచ్చు కాని తన ప్రేమ మాత్రం "అజరామరం"..... "వీ మిస్ యూ జియా"

    ReplyDelete
  5. gud blog keep it up,,,dont stop this blog ok from www.neejnapakalu.blogspot.com
    june lo post chesaru malli epati varaku no posts..y? comon..............

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.