Wednesday 5 December 2012

సి(చి)ల్లీ సంఘటన

                              సుజిత, సంకేత్ ఇద్దరూ భార్యభర్తలు. మధ్యతరగతి జీవితాలను అనుభవించి హైకులు,  ప్రమోషన్లతో  తమ కోర్కెల చిట్టాను నెరవేర్చుకునే రోజు ఎప్పుడొస్తుందా అని ఒక సగటు రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూసినట్టు వీళ్లు కూడా అంతే ధైన్యంగా బతుకులు రెండు డెస్క్టాపులు, రెండు లాప్టాప్లతో వెళ్లదీస్తున్నారు. ఇంత కన్నా ఎక్కువగా సాఫ్ట్వేర్ జీవితాల్లో మీరు ఆశించకూడదు. నేను చెప్పకూడదు. :D :D 
                          పెళ్ళైనకొత్తలో ఒక పాట పాడు అని అడిగినందుకు సంకేత్ కు సుజిత సిగ్గుపడుతూ తల ఒంచుకుని "మరీ...మరీ.." అని నసుగుతున్న సుజిత వైపు eye మూలగా చూస్తూ "ఏం!పర్లేదు రా..నువ్వు ఏదైనా పాడు.."  "సంకీ..I dont have battery in my ipod.." సంకేత్ వైపు నుంచి ఏ సమాధానం లేకపోవడంతో తలెత్తి "రేపట్నుంచి నీ కోసం charge చేసి పెడతాను. నీకు ఏ పాటలు ఇష్టమో చెబితే అవి డౌన్లోడ్ చేస్తాను" అని ఇచ్చిన సమాధానం బుర్ర తిరిగిపోయేటట్టు చేసింది. అదేమీ బయటపడనీయకుండా "అబ్బే..అదేం లేదు..సరదాగా అడిగాను" అని ఒక వెర్రి నవ్వు నవ్వాడు. మనసులో దేవుడా.. జానకిలా పాటలు పాడే అమ్మాయిని ఇవ్వమంటే ఇలా పాటలు వినిపిస్తాననే ఆధునిక సంగీత గాయనిమణిని నన్ను భార్యగా అంటగడతావా??
                      ఇలా రోజులు సాగుతున్నాయి.. వాళ్లకి కూడా ఏదో తెలియని అసంతృప్తి.. జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఏ కోశానా అనిపించట్లేదు. అయినా అలాగే సా..గిస్తున్నారు తమ జీవన పోరాటాన్ని.. వాళ్ల జీవితంలో నుంచి ఒక చిన్న సంఘటన...
                       ఒకరోజు సుజిత ఆఫీసులో ఉండగా సుజిత చిన్న తమ్ముడు అక్కకు ఫోన్ చేసి ఒక చిన్న సహాయం చేయవా అని అడిగాడు. దానికి సుజిత "చెప్పు రా.. ఏం కావాలి" అని అడిగింది. అక్క మా కాలేజిలో ఒక ఇండస్ట్రీ కోసం resume తయారు చేసుకోమన్నారు. అది నువ్వు చేసిపెట్టవా?? హ్మ్మ్.. అలాగే లేరా!! నేను ఇంటికి వెళ్ళిన వెంటనే చేసి నీకు పంపిస్తాను. అక్కా.. సాయంత్రం 4 గంటల లోపల ఇవ్వమని చెప్పారు. అవునా!!!సరే చేసి పంపిస్తానులే!!
                    "రేయ్.. చిన్నా!! నాకు ఇక్కడి నుంచి మెయిల్స్ వెళ్ళవు కదరా.."కొంచెం ఇబ్బందేరా.. నీకు మెయిల్  చేర్చడం.."
                    అక్కా !! పోనీ బావను అడగమంటావా.. అబ్బ.. భలే గుర్తుచేసావు రా.. నేనే ఆయనకు చెప్తాలే..నేను నీకు పంపిన తర్వాత ఫోన్ చేస్తాను..
                    సుజిత బాగా అలోచించి తన స్నేహితురాలికి మెయిల్ సౌకర్యం ఉందని తెలిసి తనకి విషయం చెప్పి సహాయం చేయమంది.
                    అదేంటంటే..సుజీ నేను నీ జిమెయిల్కి అయితే పంపగలను. మళ్లీ భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా అది నీ పర్సనల్ మెయిల్ ఐడియే కాబట్టి నేను అంత ఇబ్బంది పడక్కర్లేదు అని. సుజిత సరేలే అని తన స్నేహితురాలు చెప్పింది కూడా కరెక్టే కదా అని తన మెయిల్ ఐడీకే పంపమంది. 
              సంకేత్ కు ఫోన్ చేస్తే మొదటిసారి తన కాల్ కు సమాధానం ఇవ్వలేదు. మళ్లీ ప్రయత్నించింది. సంకేత్ ఫోన్ ఎత్తి ఏంటి విషయం అని అడగ్గా ఇలా ఒక మెయిల్ పంపాలి అని చెప్పే లోపల.. ఎవరి దాన్నుంచి అని విసుగ్గా అడిగాడు. సుజిత నా దాన్నుండే.. అని ఇంకా ఏదొ వివరించే లోపల సరే..సరే.. నాకు నీ మెయిల్ ఐడీ పాస్వర్డ్ నా మొబైల్కు మెసేజ్ పెట్టు అన్ని వివరంగా అని సుజిత మాటల్ని మధ్యలోనే తుంచి అవతలి వైపు కాల్ పెట్టేశాడు.
                  సుజిత అన్ని వివరంగా సంకేత్కు మెసేజ్ చేసి అప్పటి దాకా పడిన టెన్షన్ నుంచి బయటపడదామని భోజనానికి వెళ్లింది. భోజనం చేసి వచ్చి మళ్లీ ఆఫీసు పనిలో పడింది. సాయంత్రం 4కి మీటింగ్ రిక్వెస్ట్ చూసి సమయం నాలుగు అయ్యిందని  ఒకసారి సంకేత్ ని విషయం కనుక్కుందామని మళ్లీ తనకి ఫోన్ కలిపింది. తనేమో ఫోన్ తీయట్లేదు. సరేలే అతను తన పనులతో తీరిక లేకుండా ఉన్నాడేమో అని ఇంకొక గంట వేచి చూసి ఫోన్ చేస్తే తన నుంచి ఏం సమాధానం లేదు. అరే!! ఈ మనిషికి నేనంటే ఎంత నిర్లక్ష్యం అని మనసులో అనుకుంది.రెండు సార్లు ప్రయత్నించి తన మీద ఆధారపడినందుకు తనని తనే నిందించుకుంటూ .. చీ..వెధవ జీవితం అనుకుంటూ ఈ తలనొప్పి తగ్గాలంటే ఒక కాఫీ తాగాలని కాంటీన్ వైపు అడుగులు వేసింది. స్నేహితులంతా కలిసి పిచ్చాపాటీ కబుర్లు చెప్పడంతో మళ్లీ కొంచెం మనసు తేలికపడి హాయిగా అనిపించింది.
                   కాంటీన్ నుంచి వస్తూ ఒకసారి మళ్లీ తన భర్తకు ఫోన్ కలిపింది. ఆశ్చర్యంగా ఈసారి ఫోన్ ఎత్తాడు.
ఆతురతగా పంపించారా ? నేను వివరంగా మెసేజ్ చేసాను కదా అని అడిగింది.
                   సంకేత్ కూల్ గా నాకు మెసేజ్ రాలేదు. నువ్వు ఇందాక నీ పాస్వర్డ్ ఫోనులో చెప్పలేదు కదా అని
చావు కబురు చల్లగా చెప్పాడు. ఈ మాటకు సుజితకు కోపం తలకెక్కి బుర్ర నుంచి నోటికి అది వ్యాపించింది. కానీ అది నోటి మాటల ద్వారా బయటపడకుండా జాగ్రత్తపడింది.
                   నేను నీకు 2.30 కే మెసేజ్ పెట్టాను అని సుజిత అంది.
                   అది నాకు రాలేదు మరి అన్నాడు నిర్లక్ష్య ధోరణిలో.
                   నేను మళ్లీ పంపిస్తాను అని తనకి మెసేజ్ పెట్టి తను లిఫ్ట్ లో పైకి వెళ్లి మళ్లీ సంకేత్ కి ఫోన్ కలిపి
విషయం కనుక్కుంది.
                   ఇప్పుడు వచ్చిందిలే. జిమెయిల్ తెరిచాను.  పంపిస్తున్నాను.
                   నేను నీకు 4 సార్లు ఫోన్ చేసాను మధ్యలో పంపించావేమో కనుక్కుందామని అని సుజిత చెప్పింది.
                   నువ్వు మెయిల్ఐడీ చెప్పావు కానీ పాస్వర్డ్ చెప్పలేదు కదా!!!
                   ఇందాకా నేను పాస్వర్డ్ చెప్తానంటే మెసేజ్ పెట్టమన్నారు కదా..ఉన్న విషయం అడిగింది.
                   పెట్టినా నాకు రాలేదు అని అన్నాడు.
                   మీకు రాకపోతే నాకు మళ్లీ కాల్ చేసి అడగాల్సింది.ఇది చాలా అవసరం అని చిన్నా చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను అని అసలు కారణం వివరించింది.
                   అయినా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను అయినా ఏం చేయగలను అని విసుక్కున్నాడు.
                   ఇందాకా నేను చెప్పబోతే విసుక్కున్నారు. మెసేజ్ పెట్టమన్నారు. అయినా నేను కాల్ చేసినా మీరు తీయలేదు కొంచెం మొండిగా అదే విషయం చెప్పింది. ఇప్పుడేమో నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటున్నారు అని ఆవేశంగా చెప్పింది.
                    హేయ్!! కూల్ అని వెర్రిగా అన్నాడు. ఆ గొంతులో కొంపలేమీ మునగలేదన్న అర్థం ధ్వనించింది.
                    అయినా నాకే మెయిల్ ఆక్సెస్ ఉంటే మిమ్మల్ని ఇంతలా వేడుకునేదాన్ని కాదు. ఒక రెండు నిముషాల పనే కదా అని మిమ్మల్ని అడిగాను. లేకపోతే నేనే ఇంటికి వెళ్లిన తర్వాత తీరికగా చేసుకునేదాన్ని. అయినా నేను ఫోన్ చేసినప్పుడు మీరు కొంచెమైనా శాంతంగా విన్నారా??
                    అంత ముఖ్యమైన పనే అయితే నువ్వే చేసుకోవాల్సింది.
                    సుజిత ఆశ్చర్యపోయింది అనుకోకుండా సంకేత్ విసిరిన మాటల తూటాకి...తన పట్ల తను చూపించిన నిర్లక్ష్యానికి..
                    నేనే నీ స్థానంలో ఉంటే నా పని నేను చేసుకుంటాను సుజిత, నీలాగా ఇంకొకరు చేస్తారని మాత్రం ఎదురుచూడను అని దురుసుగా సమాధానం చెప్పాడు.
                   ఇంకా మాటలు కొనసాగించడం ఇష్టం లేక సుజిత ఫోన్ పెట్టేసింది.
                  తన మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది. ఇంత చిన్న విషయంలో తన సహాయం  అడగడం తప్పు అని సంకేత్ అనుకుంటున్నాడా??..నేను నా పని తనని చేయమని ఇక్కడ నిశ్చింతగా నిద్రపోతున్నానా?? అయినా resume నేనే తయారుచేశాను. దాన్ని చిన్నాకు పంపించమని అడిగినందుకు ఎందుకు నన్ను ఇంతగా విసుక్కుంటున్నాడు.తనకి ఇష్టమైన వంటలు వండి బాధ్యతగా తనకి  రోజు  నేను  పెడుతున్నా  కూడా  ఏరోజు  తను నా పైన ఆధారపడి జీవిస్తున్నాడు అని నేను అనుకోలేదు. ఈ  చిన్న  విషయానికే  తన  పైన  లేని  భారాన్ని ఊహించుకుని నా పైన ఇంతగా విసుగు చూపడం ఏంటో అని చాలా బాధపడింది.ఇంక ఇలాంటి తప్పు మళ్లీ చేయకూడదని ఒక ధృడనిర్ణయం తీసుకుంది. అంటే తనని ఏ విషయంలో సహాయం అడగకూడదు. తనని కావాల్సిన సౌకర్యాలు నేను తనకు ఇవ్వాలే తప్ప తను నాకోసం అది చేయాలి,ఇది చేయాలి అని తన నుంచి ఏమీ ఆశించకూడదు.
ఈ కథ పై నా అభిప్రాయం:
                 అమ్మాయిలకు ఆర్ధికస్వాత్యంత్రం మాత్రమే వచ్చింది. అనేక విషయాల్లో వాళ్ళు మగవారిపై ఆధారపడియున్న చదువుకున్న అబలలు అని.. అలా కాకుండా ఇంకొక కోణంలో చూస్తే ఆ అమ్మాయి విడాకులు
తీసుకోవచ్చు అంతగా సర్డుకుపోలేనప్పుడు.. అదే ముగింపు అయితే అసలు అలాంటి బంధాన్ని సుజిత తన జీవితంలోకి రానివ్వకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు తన జీవితంలో అలాంటి బంధం ఉంది కాబట్టి 
సర్దుకుపోవడమే..
 ( ఈ కథ కేవలం కల్పితం. ఎవ్వరిని ఉద్ద్యేశించి వ్రాసినది కాదు.)


                 
                 
                 
                 
                 
               
                      

30 comments:

  1. స్టోరీ బాగుంది చిన్నీగారు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు కిషోర్ గారు:)

    ReplyDelete
  3. ఒకసారి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే చిన్న సమస్య అండి ఇది. మీరేంటండి, విడాకులు తీసుకోమనేవరకు వెళ్ళారు :)

    ReplyDelete
    Replies
    1. అబ్బాయి ఆలోచనా విధానం నాకు నచ్చలేదండీ :P..అయినా కథలో సర్దుకుపోయింది అనే కదా వ్రాసాను:):)

      Delete
    2. అబ్బాయి అలా ఎందుకు ప్రవర్తించాడో వివరించి దాన్ని బట్టి ఒక conclusion ki వస్తే బావుండేది అని నా అభిప్రాయం :)

      Delete
    3. మీ అభిప్రాయాన్ని ఇంకొక కథ వ్రాసేటప్పుడు పరిగణనలోకి తీసుకుని వ్రాస్తాను.:)

      Delete
  4. ఇంత చిన్న విషయాలకే 'సర్డుకుపోవటం' అంత పెద్ద మాటలు అవసరం లేదని నా అభిప్రాయం.

    చదువుతున్నంత సేపు బాగా అనిపించింది, ఇంత తొందరగా అయిపోయిందని అనిపించింది. బాగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. రాము,హేమ గారు..
      ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు. సర్దుకుపోవడం అనడం కంటే దానిని అంత పట్టించుకోకుండా ఉండటం అని చెప్పాల్సిందేమో. కానీ ఆ విషయం వ్రాసేటప్పుడు తట్టలేదు.:)

      Delete
    2. ఒక్కో సారి మగ వాళ్ళు కూడా పని ఒత్తిడిలో అప్పుడప్పుడు అలా ప్రవర్తించవచ్చు. అది ఆడవాళ్లు అర్థం చేసుకోవాలి. ప్రతీ సారి మగాడు అలా చేస్తే అది వేరే విషయం (మీరు చెప్పినట్లు)

      ఏది ఏమయినాను ఎలాంటి పరిస్తితి అయినాను అతను తనకు ఎన్నో సేవలు చేసే భార్య కొరకు శాంతంగా ఒక రెండు నిముషాలు కేటాయిస్తే అతనికి పోయేది ఏమి లేదు, వచ్చేదే ఎక్కువ.

      చిన్న చిన్న విషయాలు, పొరపాటున నోరు జారిన మాటలు అవతలి పక్క ఎంతటి భాదను కలిగించాగాలవో మీ కథతో తెలుసుకున్నాను.

      Delete
    3. రాము,హేమ గారు..
      ధన్యవాదాలు కథలోని భావన మీకు అర్థమైనందుకు.

      Delete
    4. ఈ రాము, హేమ గారు ఎవరండి? నన్నేనా?

      శ్రీనివాస రావు గారు రాసిన కామెంటు చూసి, అటుపక్క ఏమి జరిగి ఉంటుందో వివరిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి... నాకు రాసే అలవాటు లేకున్నా ఎదో తొందర తొందరగా అటుపక్క కల్పిత స్టోరిని రాసాను. కింద పోస్టు చేస్తాను. (అచ్చు)తప్పులు ఉంటె క్షమించాలి. మీ మూలంగా నేను రాసిన మొదటి చిరు కథ. మీకు నచ్చితే మీకే అంకితం. :)

      Delete
    5. Green Star గారు, మన్నించాలి. "apmediakaburlu"బ్లాగు మీదే అనుకుని దాంట్లో రాము,హేమలు ఎడిటర్స్ అని ఉంటే మీ పేరేనూ అనేసుకుని confidentగా ఆ పేరుతో సంభోదించాను:P..కథ వ్రాస్తారా, వ్రాయండి..మీ ఊహ ఎలా ఉంటుందో చదివి తెల్సుకుంటాను.

      Delete
    6. పరవాలేదు, మన్నించాల్సినంత ఏమి జరగలేదు లెండి. నాకు బ్లాగులు ఏమి లేవు. ప్రస్తుతానికి నేను శ్రోతను మాత్రమె ...

      Delete
  5. Replies
    1. ధన్యవాదాలు శివప్రసాద్ గారు.

      Delete
  6. చిన్నిగారు...

    ఇప్పటి ఆధునిక దంపతుల సమస్యల్ని చాలా బాగా అక్షరీకరించారు. చూడటానికి ఇలాంటివన్నీ చాలా చిన్న సమస్యలుగా కనిపిస్తున్నా.. మనసుని చాలా గాయపర్చేవే...

    పార్టనర్ పనుల్ని తమ పనులుగా చేసుకుపోయే దంపతులు చాలామందే ఉన్నారు. అలాగే నీ పనులు నీవి, నా పనులు అంటూ బ్రతికేవాళ్లు ఉన్నారు. మీరు రచనలో చెప్పినవాళ్లు రెండో రకం.. కానీ ఇందులో ఇద్దరిదీ అలాంటి మనస్తత్వమే ఉన్నట్లయితే సమస్య అంటూ ఉండదు. కానీ ఒకరు మాత్రమే అలా ఉండి ఇంకొకరు వేరేలా ఉంటేనే సమస్యలు. భర్త పనుల్ని తన పనులుగా బాధ్యతగా చేస్తున్న ఆమెకి భర్తనుంచి అలాంటి ప్రవర్తన ఎదురైతే నిజంగా చాలా హర్ట్ అవుతుంది. ఆమె బాధలో అర్థం ఉంది. అలాగని బంధాన్ని తెంచుకునేంత పరిపక్వత లేనిది కాదు ఆమె. అందుకే సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. ఎప్పటికైనా అతను భార్యను అర్థం చేసుకుంటే ఆ సంసారంలో సరిగమలే. చాలా మంచి కథనం.. అభినందనలు చిన్నిగారు...

    ReplyDelete
    Replies
    1. శోభ గారు,
      నేను అల్లిన కథకు మీరిచ్చిన వివరణ అద్భుతం. మీ వివరణ చాలా అర్థవంతంగా ఉంది. చక్కని వ్యాఖ్యతో సంతోషపరిచారు.ధన్యవాదాలు:)

      Delete
  7. It all happens like that. The work u feel urgent, may not be to the gentleman :)

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే గారు,
      అందుకనే కదా.. ఇలా పట్టించుకోకుండా నిర్ల్యక్షంగా వ్యవహరించారు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు:)

      Delete
  8. [ఇది సంకేత వయిపు కథ.]

    నేను (సంకేత్) హుషారుగా ఆఫీసు లోకి అడుగు పెట్టగానే మేనేజరు డెస్క్ దగ్గర ఎదురుచూస్తూ ఉన్నాడు, నన్ను చూడగానే 'ఏమయ్యా సంకేత్ నిన్ను ఆ రిపోర్టు పంపమన్నా కదా, నువ్వు ఇంకా పంపలేదు',

    'మీరు సోమవారం లోగా పంపమన్నారు కదా, ఈ రోజు సోమవారమే కదా సంయంత్రం లోపు పంపిస్తాను;

    'సోమవారం లోగా అంటే శనివారం పంపవద్దని రులు ఏమయినా ఉందా?, మధ్యాన్నం లోపు నాకు అది కావలి' అంటూ మేనేజరు చుర చుర వెళ్ళిపోయాడు.

    ఎవరి నుండి తిట్లు పడ్డాయో నా మీద చూపిస్తున్నాడు అనుకుంటూ కంపూటర్ ఆన్ చేసి రిపోర్టు ఓపెన్ చేసాను. రిపోర్టు చివరి దశలో ఉంది, పూర్తీ చెయ్యటానికి రాకేశ్, ప్రతిమలు కొన్ని వివరాలు నాకు పంపాలి, వాళ్ళు ఈపాటికే పంపించి ఉంటె గంటలో పని అయిపోతుంది అనుకుంటూ మెయిల్ చూసుకుంటే వాళ్ళు ఇంకా పంపలేదు. విషయాన్నీ వివరిస్తూ వెంటనే ఆ వివరాలు పంపమని వాళ్ళకు అర్జెంట్ మెయిల్ లు పంపాను. రెండు గంటలయినా రిప్లై లేదు. రాకేశ్ డిల్లి ఆఫీసులో ఉంటాడు, ప్రతిమ ఇక్కడే.

    వెంటనే ఆమె ఉండే ఫ్లోర్ కు వెళ్లి చుస్తే ఆమె డెస్క్ లో లేదు, వెనక్కి వచ్చి రాకెష్ కు ఫోన్ చేస్తే అది వాయిస్ మెయిల్ కు పోయింది. ఇంతలో సుజిత ఫోను, ఎదో మెయిల్ పంపాలని, అప్పుడే నా డెస్క్ ఫోన్ మోగటంతో రాకేశేమో అని సుజిత ఫోనును హడావిడిగా పూర్తీ చేసి డెస్క్ ఫోన్ ఎత్తితే ఎదో ICICI లోను ఇస్తామంటూ వేదవ ఫోను. అప్పటికే మధ్యాన్నం 12.30 అయ్యింది, మళ్ళి ప్రతిమ దేస్కుకు వెళితే ఆమె డెస్క్ దగ్గర కనబడలేదు. పక్క వాళ్ళను అడిగితె పొద్దుటి నుండి డెస్క్ దగ్గర లేదు, ఆఫీస్ కు అయితే వచ్చింది, కాంటీన్ లో వెతకండి అంటే పరుగున అక్కడికి వెళ్ళాను, అక్కడ ప్రతిమ ఎవరితోనో కబుర్లు చెపుతూ కనబడింది, వెంటనే వెళ్లి 'నాకు రేపోర్తుకు కావలిసిన వివరాలు పంపమని పోయిన వారం అడిగాను, పొద్దున్న కూడా మెయిల్ పెట్టాను, ఏమయింది' అని అడిగాను.

    'అవునా, నేను పొద్దున్న ఒక మీటింగ్ ఉంటె డైరెక్టుగా అక్కడికి వెళ్లి అక్కడి నుండి ఇక్కడకు వచ్చాను, ఈయన సంపత్, మేము ఇద్దరం ఈ ఆదివారం ఎంగేజ్ అవుతున్నాము, సంపత్ ఈయన సంకేత్' అంటూ పరిచయ కార్యక్రమం మొదలు పెట్టింది, నాకసలే టెన్షన్ గా ఉంది, కొత్త పరిచయాలు, ఎంగేజ్మెంటు లు ఆనందించే స్తితి లో లేను. అంతలో నా మేనజరు అలా వెళ్తూ నన్ను అదో రకంగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఎదో అదర బాదరాగా మాట్లాడి ప్రతిమను డెస్క్ దగ్గరికి లక్కోచ్చేసరికి ఒకటిన్నర అయ్యింది, ఇంతలో నా సెల్ ఫోను కొన్ని సార్లు మోగిన చూసే సమయం లేదు.

    ప్రతిమను ఆ వివరాలు వెంటనే పంపమని నా డెస్క్ దగ్గరకు వచ్చి రాకేశ్ కు ఫోన్ చేస్తే దొరికాడు, హమ్మయ్య అనుకుంటూ విషయం కదిపితే

    'నేను నీకు కావలిసిన వివరాలు పంపాలంటే నాకు రమణి గారు కొన్ని వివరాలు పంపాలి, ఆవిడా ఈ రోజు అనారోగ్యం కారణంగా ఆఫీసుకు రాలేదు, ఈ రోజు పంపలేనండి' అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు.

    ఇంతలో నా మేనేజరు రానే వచ్చాడు. 'ఏంటయ్యా రిపోర్టు ఇంకా పంపలేదు. నాకక్కడ పై నుండి పోన్లు వస్తున్నాయి, ఎం చెప్పాలి' అంటూ కసిరాడు. పరిస్తితి అంతా వివరించాను.

    'అందుకే నేను చెపుతాను, ఇలా చివరి వరకు అగోద్దని, పోయిన వారమే వాళ్ళను నువ్వు తరిమితే నాకు ఈ రోజు ఈ పరిస్తితి ఉండేది కాదు కదా' అంటూ తిట్టుకుంటూ వెళ్ళాడు. పోయిన రెండు నిముషాలకే ఎదో మెయిల్ పంపించాడు, తెరిచి చూస్తె, రాకేశ్,రమణి ల మేనజర్ ల ఫోన్ నంబర్లు పంపించి వాళ్ళను విచారంచమని.

    ఇంతలో మళ్ళి సుజిత ఫోను, ఫోన్ ఎత్తితే ఎదో మెయిల్ తన ఎకౌంటు నుండి పంపలంట... పంపావా అని, చిర్రెత్తుకొచ్చింది. ఎదో మాట్లాడి పెట్టేసి సుజిత జిమెయిల్ ఎకౌంటు ఓపెన్ చేసి ఆ మెయిల్ పంపి వెనక్కి తిరిగి చూస్తె మా మేనేజరు, నన్ను మింగేసేలా చూస్తూ....

    [మిగిలినది కింది కామెంటులో చదవండి. బ్లాగు నా పూర్తీ కథను పోస్టు చెయ్యనివ్వలేదు.]

    ReplyDelete
    Replies
    1. 'నేను పంపించిన నంబర్లకు ఫోన్ చేసావా'

      'లేదండి, ఇప్పుడే చేస్తాను'

      'మీ పర్సనల్ పనులు కాస్త తగ్గించండి, వాటికి చాలా సమయం ఉంది, ఆఫీసుకు వచ్చినందుకు ముందు ఆఫీసు పని చుడండి' కోపాన్ని బిగ పట్టుకొని మాట్లాడుతున్నట్లు అన్నాడు, నేను జిమెయిల్ ఓపెన్ చేసి ఎదో మెయిల్ పంపటం చూసి అలా అన్నాడని అర్థం అయ్యింది.

      మేనేజరు పంపిన నంబర్లకు ఫోన్ చేసి పరిస్తితి వివరిస్తే వాళ్ళు రమణి కి ఫోన్ చేసి ఆమె కంపూటర్ పాస్వర్డ్ తెలుసుకొని అది రాకేశ్ కి ఇచ్చి, రాకేశ్ ఆమె కంపూటర్ నుండి ఆయనకి కావలసిన సమాచారం తీసుకోని, ఆయన నాకు కావాల్సిన వివరాలు పంపి నేను రిపోర్టు పూర్తీ చేసి పంపే సరికి సాయంత్రం ఆరు.

      ఉద్యోగం చేయటం మొదలు పెట్టిన గత ఆరు సంవత్సరాలలో ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు అనుకుంటూ ఇంటికి వెళ్ళాను.

      ఇంట్లో పరిస్తితి అంతా గంబిరంగా ఉంది. సుజిత కాస్త ముభావంగా ఉన్నట్లు అనిపించింది. విషయం అడుగుదామనుకున్నా , అలసట తీరాక అడుగుదాం లే అంటూ కాస్త ఫ్రెష్ అయ్యి కాఫీ అడిగాను,

      'నీ పని నువ్వే చేసుకో' నా వయిపు తిరగకుండానే కాస్త నిష్టూరంగానే అంది.

      'ఓహో, ఆ మెయిల్ పంపమంటే నేను కాస్త కటువుగా మాట్లడననే కాబోలు ఇదంతా, పరిస్తితి అర్థం చేసుకోదూ, ఎం చేస్తాం, మనం సర్డుకుపోవటమే' అనుకుంటూ టివి ఆన్ చేసాను...ఎదో పాట వస్తుంది.

      'మీకు మీరే....మాకు మేమే .......'

      Delete
    2. సో..మీరు బాగా కష్టపడి పరుగులు పెట్టించి కథను హడావుడిగా నడిపించారు..సంకేత్ వైపు తప్పు లేదని అనిపించారు.. మీ కథ చదివి ఆ టెన్షన్ పడలేక..అమ్మో!!అలాంటి కండిషన్లో నేను కనీసం నా మొబైల్ ఆన్లో కూడా పెట్టను..బావుంది మీ వైపు ఊహా కథ..నేను నిజం చెప్పాలంటే నా కథలో హీరోకు అలా పరుగులు పెట్టించే మెనేజరు లేడు కదా.. చివరి క్లైమాక్స్ పాట అదిరింది.:)

      Delete

  9. హల్లో చిన్ని గారు, మీరు టైటిల్ ఏమి పెట్టారో ఒక్కసారి చూడండి..
    "సి(చి)ల్లీ సంఘటన " ..మరి అలాంటి చిన్న విషయానికి, సర్దుకుపోవడం, విడాకులు ఇవన్నీ పెద్ద పదాలు.
    రాసిన కథ సహజం గా ఉంది.

    ReplyDelete
  10. జలతారు వెన్నెల గారు,
    ధన్యవాదాలు కథ నచ్చినందుకు,మీ వ్యాఖ్యకు.. అవును కొంచెం పెద్ద పదాలని నాకు కూడా అనింపించింది. ఏమి పట్టించుకోకుండా ఉండిపోయింది అని చెప్తే బావుండేదెమో..:) అవునండీ titleki nyaayam జరగలేదు:P

    ReplyDelete
  11. చిన్ని గారు బాగుంది మీరు రాసిన కథ. "తనని ఏ విషయంలో సహాయం అడగకూడదు. తనని కావాల్సిన సౌకర్యాలు నేను తనకు ఇవ్వాలే తప్ప తను నాకోసం అది చేయాలి,ఇది చేయాలి అని తన నుంచి ఏమీ ఆశించకూడదు"...ఇలా ఎందుకు అలోచిస్తుందో నాకు అర్థం కావడం లేదు.... భర్తకు సేవలు చేసిపెట్టడమేనా భార్య విధి...ఇద్దరు ఒకరికి ఒకరు అర్థం చేసుకొని, తోడు నీడగా ఉండడం కుదరదా?...

    ReplyDelete
  12. హాయ్ డేవిడ్ గారు,అలాంటి తపన నా కథలోని అబ్బాయికి లేదండి, అందుకే అమ్మాయి అలా అనుకుంది. ఇద్దరికి మధ్య మంచి అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా కుదురుతుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు:)

    ReplyDelete
  13. bagundi andi ila kuda godavalu padatru...:)

    ReplyDelete
  14. హాయ్ చిన్ని.....ఇలాంటి incidents అందరి జీవితం లో జరుగుతాయ్ అనుకుంటా as far as i know......ఎదుటివాళ్ళ 'నిర్లక్షం ' ఏదో ఒక point of time లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు.....పోస్ట్ బాగుంది....:)
    కానీ, వివాహ బంధంలో వీలైనంత వరకు సర్దుకుపోవటమే మంచిది(ఇద్దరూ)....సమస్య భరించలేనంత పెద్దది అయతే తప్ప....విడాకులు అనే మాట రావద్దు....ఇది jus నా opinion :)

    ReplyDelete
    Replies
    1. అంజలి గారు,
      నా ఓటు కూడా సర్దుకుపోవడానికే, కానీ ఆ అమ్మాయి తట్టుకోలేనంత మానసిక సంఘర్షణకు గురవుతూ ఉంటే అప్పుడు ప్రశాంతత కోసం దూరంగా ఉండవచ్చు అని అనుకున్నాను.

      Delete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.