Wednesday, 12 December 2012

ఈరోజు(12-12-12)

                           ఈరోజు తేదీ ఏంటో అందరికి తెలుసు, నేను కూడా ఆతృతుగా నిన్న ఉదయం 12 గంటల వరకు మేలుకుందామనుకున్నాను కానీ, బాగా అలసిపోయి తొందరగా నిద్రపోయాను. ఇందాకా మా కొలీగ్తో మాటల మధ్యలో 12-12-12 12:12 కొంచెం ప్రత్యేకం కదా.. అని అనుకున్నాం.
          మరి ఇంత ప్రత్యేకంగా ఉన్న క్షణాన ఏం చేసామో  గుర్తుంటే బావుంటుంది కదా అని ఒక ఐడియా తట్టింది.. నాకు తట్టిన ఐడియాకు మనసులో నాకు నేనే మురిసి మేఘాల్లో తేలుతూ ఇలా ఒక పోస్ట్ రాసుకుని నా గుర్తుగా ఉంచుకుంటున్నాను.. ఎందుకంటే ఇంత కన్న ఏం చేయాలో తోచలేదు మరి.. కాబట్టి నేను ఈ క్షణాన్ని ఇలా బందించేసుకుంటున్నాను అన్న మాట. విదేశాల్లో ఉన్న వాళ్లు అలా నన్ను చూసి నవ్వకూడదు, ఇది మన భారతదేశ కాలమానంలో వ్రాస్తున్నది.. సో చదివిన తర్వాత మీరు కూడా నాలాగా ఒక టపా వ్రాసుకుని ఆ క్షణాన్ని బందించుకోండీ..
          ఎందుకంటే ఇలాంటి రోజు మళ్లీ ఇప్పట్లొ వచ్చేటట్టు కనిపించట్లేదు..ఎందుకంటే 13-13-13 రావడానికి మనకో 13 నెల లేదు మరి..ఇంక 13-31 వరకు కూడా నెలలు లేవు కాబట్టి.. నాకు అలా అనిపించింది.. ఏంటో అమ్మాయి చాలా హడవుడి అంటారా..హ్హ్మ్మ్.. ఏమో ఈలోపల ప్రళయం వచ్చి అందరు దాంతోబాటు పోతే ఇంకేం చేస్తాం.. అయినా అదెలాగు జరగదంట మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారం అమావాస్య కూడా ఇంక రాలేదు...సముద్రాలలో సుడిగుండాలు లాంటివి ఏర్పడే అవకాశాలు కూడా లేవని చెప్పారు..మనిషి ఆశాజీవి అంటారుగా మరి!! అలాగే నేను కూడా..ఇప్పుడప్పుడే ప్రళయం వచ్చే సూచనలు లేవని అన్నారు.. ఇదండీ సంగతి.. నీకు బాగా పిచ్చి ముదిరింది అంటారా!!! కానీయండీ..కొంతమందికి ధనం పిచ్చి,కొంతమందికి  పరువు పిచ్చి, ఇంకొంతమందికి పదవి పిచ్చి.. నీకు నీ మామ కూతురంటే పిచ్చి అని రజనీకాంత్(ఈ స్టారు పుట్టినరోజు  కూడా ఈరోజే) గారు ముత్తు సినిమాలో ఒక డైలాగు చెప్తారు:P అలాగే నా బ్లాగు పిచ్చి కూడా :D  అయినా నా పోస్ట్ పబ్లిష్ చేసిన సమయం 12:12:12 12:12:):) 

16 comments:

 1. నీకు బాగా పిచ్చి ముదిరింది ... naa abhiprayame meeru last lo chepparu :)

  nijalu oppukuntaru :D

  ReplyDelete
  Replies
  1. శ్రీనివాస్ గారు,
   హ హ హ.. :D:D

   Delete
  2. Chinni garu, meeru emi ananante oka photo share chestanu :)

   Delete
  3. శ్రీనివాస్ గారు,అభ్యంతరకరమైనది కాదంటే పంపండి..ఇంక్కొక విషయమేమంటే నాకు ఇక్కడ ఆఫీసులో అన్ని సైట్లు తెరవడానికి కుదరదు..అందుకని కింద లింక్ లో ఏం ఉందో కూడా నేను చూడలేదు.. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలో పెట్టండి.

   Delete
  4. అభ్యంతరకరమైనది kadu lendi. anyways it's a facebook image. office lo open avademo meeku...
   it's a funny one on 12-12-12 :)

   and kinda link 1912 lo vachina 12-12-12 gurinchi...

   Delete
 2. https://twitter.com/stefanjbecket/status/278736451208871938/photo/1

  ReplyDelete
 3. ee post correctgaa 12-12-12 12:12 ki post chesaaru.. great memrable post... naa comment unnamduku great feel avutunnaanu

  ReplyDelete
  Replies
  1. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి:) చాలా సంతోషం నా బ్లాగుపిచ్చిని అర్థం చేసుకున్నందుకు:)

   Delete
 4. బాగుంది చిన్ని మీ పోస్ట్...మధురమైన క్షణాలు ఇలా పంచుకోవడం.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు డేవిడ్ గారు, ధన్యవాదాలు డేవిడ్ గారు, నాకు కూడా సంతోషంగా ఉంది మీరు నా ఆనందాన్ని పంచుకున్నందుకు.

   Delete
 5. superb timing a :) wt a punctuality..

  ReplyDelete
 6. సందీప్ గారు, మీ అంత punctuality కాదు:)

  ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.