Friday, 1 March 2013

నేను బ్లాగుతూనే ఉంటాను


తిక్క కుదిరిందా??నాతో పెట్టుకుంటారా??

     ఏంటో ఈ మధ్య నువ్వు ఏదో సమాజాన్ని ఉద్ధరించేటట్టు ఆవేశంలో వ్రాసే నీ వ్రాతలు నువ్వు మాత్రమే మంచిదానివన్నట్టు ఉన్నాయి. అయినా బొమ్మకు ఒక వైపు మాత్రమే చూపి ఇంకొక వైపు చూపకపోతే బొరుసు లేదనుకుంటారు..(నా అంతు లేని ఆలోచనలు పోస్టుకు వచ్చిన ఒక మెచ్చుకోలు.)ఇది మరీ బాగుంది.. దానికి రెండోవైపు ఏముందో చూడకుండా ఉండటం మీ తప్పు.అంతే కానీ ఇలా నా బ్లాగు మీద పడి ఏడిస్తే ఏం లాభం ??
         ఈలాంటి మెచ్చుకోలు ప్రశంస విన్న తర్వాత నాకు కొన్ని అలోచనలు వచ్చాయి...వాటిలో అన్ని కాదు కొన్ని మాత్రమే.. అన్నీ వ్రాస్తే పరీక్షా హాల్లో ఇచ్చే మెయిన్ బుక్లెట్ 16 పేజీలు కూడా సరిపోవు
1. నిజంగా బ్లాగులో వ్రాసేదాంట్లో భావం ముఖ్యమా లేదా సంఘటన??
2. ఏదో ఊసుపోక కబుర్లు చెబుతూ నేను ఎవరినైనా బాధపెడుతున్నానా?
3. నా బ్లాగు వల్ల చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నానా?
4. విలువైన సమాచారం ఇవ్వనప్పుడు ఈ బ్లాగు ఎందుకు?
5. ఈ బ్లాగు వల్ల నిజంగా ఏవైనా ఉపయోగాలున్నాయా?
6. నా బ్లాగులో ఇంటిగుట్టు రట్టు చేసే పోస్టులే ఎక్కువా? 
7. అందరితోనూ ఇలా బాహాటంగా అన్ని విషయాలు చెప్పుకుంటారా?? (హవ్వా..నలుగురు చదివితే నవ్విపోదురు గాక)
8. బ్లాగు వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఇది ఉండటం అవసరమా??
                      ఇంత మానసిక సంఘర్షణ తర్వాత బల్గేరియా బడి పాఠంలో ఇవేవి నేర్పకుండా బ్లాగును తయారుచేసుకోవడానికి అనుమతిస్తున్న మతి ఉన్నా లేని బ్లాగర్ వారినే పూర్తిగా బాధ్యత వహించవలసిందిగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడమైనది. దానికి సంబంధించిన కేసు పూర్వాపరాలు విచారణకు గాను మళ్లీ తర్వాతి పోస్టుకు వాయిదా వేయడమైనది. :D :D
                    హమ్మా.. లేదంటే పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నా బ్లాగునే మూయించేయాలని చూస్తారా!! అంతే
మీకు తప్పదు.. ఇప్పుడైనా అర్థమైందా?? బ్లాగర్ ఉన్నంతవరకూ నా బ్లాగ్ ఉంటుంది. మీరు చదివిన, చదివి వినిపించినా, చూసి తరించినా, నన్ను ఏడిపించినా.. మీరు ఏడ్చినా :D  :D
                   నా బ్లాగు చదివి నా పైన అక్షింతలు జల్లిన మా ప్రియమైన అక్కకు, స్నేహితు"రాళ్ళు" వనజ,కావ్య,బిందు,మాధవిలకు ఈ టపా అంకితమిస్తూ.. తలనొప్పికి జండూబామ్ వాడమని ఒక చిన్న సలహా
మీ మీద జాలితో...
గమనిక:
బల్గేరియా బడిపాఠాలు ఇక్కడ http://harekrishna1.blogspot.in/
బల్గేరియా బడి విద్యార్థిగా ఆ పాఠాలు సరిగ్గా నేర్చుకోనందుకు ఆండీగారికి క్షమాపణలు చెప్పుకుంటూ ..  

5 comments:

  1. బాగుంది, బ్లాగర్ గారు,.మీరు బ్లాగుతూనే వుండడి,..బల్గేరియా బడి పాఠాలు చెప్పండి,.ఎప్పుడైనా,..

    ReplyDelete
  2. LOL
    బ్లాగేరియా గురించి ఒక బల్గేరియా కవి ఏమన్నాడో తెలుసా...
    The relationship between a blogger and responder should be like bug and programmer not like drug and chemist
    టాగ్ చేసినందుకు ధన్యవాదాలు :)

    మంత్లీ మితిగా బ్లాగాలని కోరుకొంటూ!

    ReplyDelete
  3. @హరే: లెస్సగా సెలవిచ్చారు స్వామీజీ... ఆ వాక్యాలను బ్లాగోవద్గీతలో చేర్చుకుంటాను.

    మాపై జాలితో జండూబామ్ సలహా ఇచ్చినందుకు మీకు ఆజన్మాంతం ఋణపడి వుంటాము చిన్నిగారూ :)

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.