నిన్న homesick గురించి ఒక టపా రాసాను. అయినా మనసులో కలిగిన అలజడి ఇంకా తగ్గలేదు.
హాస్టల్లో ఉండటం ఏలాగు తప్పదని తెలిసి, ఇంక ధైర్యం చేసుకుని మా ఆఫీసుకి దగ్గర్లో వున్న హాస్టళ్లను చూడటానికి బయలుదేరాను. వాటిని చూసిన తర్వాత ఇంకొన్ని విషయాలు నన్ను అందోళనకు గురి చేసాయి.
ఒక హాస్టల్ చుడటానికి బావుందని లోపలికి వెళ్లి ఆఫీసు రూము ఎక్కడ? అంటే.. అక్కడ పని చేసే అబ్బాయి నా వైపు ఒక పిచ్చిచూపు విసిరి..వెనకాల అన్నం గిన్నెల ముందు అందరికి గరిటెతొ వడ్డిస్తున్న ముసలయానని చూపించాడు..అయనే ఆ హాస్టల్ యజమాని అని తెలుసుకుని కొంచెం ఆశ్చర్యపడ్డాను. నేను ఇంకా ఏమి అడగకముందే ఆయన ఇక్కడ ఖాళీలు లేవమ్మ అని చెప్పాడు. మనసులో ఇలాంటి హాస్టళ్లకు ఇంత గిరాకినా?! అని అనుకున్నాను.
తర్వాత ఇంకొక హాస్టళ్లొ విచారిస్తే అక్కడ వాళ్లు చెప్పిన వసతులు కొంచెం నచ్చి ఒక గది చూస్తానని అడిగాను. ఆ గదిలో ఇద్దరు ఉత్తర భారత ప్రాంతపు వాళ్లనుకుంటాను..నేను గదిలొకి వెళ్లగానే ఒక వెర్రి ప్రశ్నవేశారు..నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.ఇంకా ఖాళీలు ఉన్నాయా అని అడిగి ఇంకొక గది చూసాను. అక్కడ అందరు అచ్చ తెలుగు ప్రజలు.
మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ముందు నుంచి కాలేజీ వాళ్ళ హాస్టల్లోనే ఉన్నాను. బయటి హాస్టళ్ళ సంగతి పెద్దగ తెలియదు. అక్కడ నేను చూసిన గది ఒక 3 bedroom flat. ఒక్కొక్క bedroom లో 3 beds ఇరికించారు.మొత్తానికి వాళ్ళు ఒక్కొక్కరి నుంచి వసూలు చేసే పైకం అక్షరాల ఆరువేలు.మొత్తం మీద వాళ్ళకి
ఒక flat కి వచ్చే నగదు 18వేల రూపాయలు. అక్కడ నాకు నచ్చిన సదుపాయం మనకు కావాల్సింది మనమే వండుకోవచ్చు. కాని కూరలు,ఉప్పు ,కారము అన్ని మనమే తెచ్చుకోవాలి:(. ఇలాంటి హాస్టల్లో పార్కింగ్ఏరియా ని అన్నిటికి వాడుకుంటారు అంటే అదే dining room, washing area,kitchen... ALL IN ONE:(
ఏ రాయి అయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అని..దాదాపు దాంట్లో చేరుదామని అనుకుంటున్నాను. అయినా ఇంకా తెలీని homesick నన్ను వెంటాడుతూనే ఉంది. Wish me good luck to enjoy crocodile's festival:D:D:D:)
kodava ledanDi Madhu mohan gaaru..
ReplyDeleteblog bagundi and try to improve better looking and thanks for following my blog
ReplyDeletebut i want to tell u dnt follow my blog bcz it was so sad and horrible when we see my blog we will went our past and again we will go just sad thats y i dont want to update my blog