ఈ వార్త వినగానే నేను ఒకలాంటి బాధకు లోనయ్యాను. రంగురంగుల, జిలుగు వెలుగుల మధ్య ఉన్న సినిమా ఫీల్డ్ అంటేనే చాలా మందికి సదభిప్రాయం ఉండదు. సినిమా అంటే 24 కళలు కలిస్తినే ఉద్భవించేదే అయినా తెర పైన కనిపించే నటి,నటులనే ఎక్కువమంది ఆరాధిస్తారు.అందుకనే వీళ్లు ఏది చేసినా మీడియా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుంది.
జియా మరణం గురించి తెలిసిన వెంటనే అందరు కూడా తన కెరీర్ పరంగా తనకి అవకాశలు లేవని దాని వల్ల కొంత నిరాశ,నిస్పృహలకు లోనయ్యి ఇలా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉంటుందనుకున్నారు.అప్పటికి తన మరణం పైన ఒక తెలుగు పేపర్ ప్రేమే ప్రాణం తీసిందా అనే అనుమానాన్ని వెలిబుచ్చింది. చివరికి ఆ అమ్మాయి ప్రేమవల్లే చనిపోయిందని తెలిసి చాలా బాధేసింది. అందరికి గుర్తుండే ఉంటుంది దివ్యభారతి కూడా ఇలాగే రాలిపోయిందని.అది కేవలం యాధృచ్చికంగానే జరిగినట్టు చిత్రించారు నాకు గుర్తున్నంత వరకు.
జియా మరణించిన వారం తర్వాత వాళ్లింట్లో తను చనిపోవడానికి కారణాన్ని విపులంగా వివరిస్తూ తన బాధనంత అక్షరాలుగా వ్రాసిన ఒక ఉత్తరం బయటపడింది.. నిన్న అది చదివిన వెంటనే కళ్ల నుండి తెలియకుండానే కన్నీళ్లు ఒలికిపోయాయి. శాస్త్రీయపరంగా అబ్బాయిల కన్నఅమ్మాయీలు కొంచెం ఎక్కువ సున్నితంగా ఉంటారు. అందులోనూ అబ్బాయిల కన్న తొందరగా నిరాశకు లోనయ్యే విధంగా మెదడులో నిర్మాణం జరిగిఉంటుంది. పుట్టుకతోనే దేవుడు కూడా అమ్మాయిలు ఎక్కువ బాధపడాలనే ఇలా చేశాడేమో అనిపిస్తుంది.
ఆ అమ్మాయి ఉత్తరంలోంచి కొన్ని వాక్యాలు:
నన్ను నేను కోల్పోయేంతగా నిన్ను ప్రేమించాను, కాని నువ్వు నా ప్రేమను నీ మోసం రూపంలో చూపించావు. నీ ప్రపంచం కేవలం అమ్మాయిలు, పార్టీలు చేసుకోవడము. నా ప్రపంచం మాత్రం నువ్వు, నీతో ఉన్న నా జీవితం. నేను ఇంకొక శ్వాస తీసుకోవడానికి నాకు ఏ కారణం కనిపించడం లేదు.నీ కోసం కన్నీరు కార్చిన ప్రతిసారి నువ్వు దాన్ని చూసి నవ్వావు. నేను ఈ ప్రదేశాన్ని నా చెరిగిపోయిన నా కలలతో, విరిగిపోయిన మనసుతో వదిలి వెళ్తున్నాను. పడుకోవాలనుంది కానీ ఇక ఎప్పటికి ఆ నిద్రలోంచి మెళుకవ రానంతగా ....
ఈ ఉత్తరం చదివిన వెంటనే చాలా బాధగా అనిపించింది. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించడం అంటే తనన్ అవసరానికి వాడుకుని వదిలేయడము కాదు కదా!! కానీ కొంతమందికి విచిత్రంగా అనిపించొచ్చు ప్రేమలో విఫలమైతే ప్రాణం తీసుకోవాలా అని, మరి ప్రేమించిన వ్యక్తినే ప్రాణం కన్న మిన్నగా ఆరాధిస్తున్నపుడు,జీవితం అంత విలువైనదిగా అనిపించదు. తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు జీవితం శూన్యంగా అనిపిస్తుంది. అలా అని ఆ శూన్యం నుంచి బయటపడకుండా దాంట్లోనే కూరుకుపోయి చావును ఆహ్వానించకూడదు. అమ్మాయిలు ఎంత సెలెబ్రిటీలు అయినా వాళ్ల మనసు మాత్రం ఒక సాధారణ అమ్మాయి మనసులానే ఉంటుంది. జియా వ్రాసిన వాక్యాలు చదివిన వెంటనే నాకావిషయం అర్థమైంది. ఆ అమ్మాయి చావడానికి చూపిన తెగువ జీవించడానికి చూపించుంటే ఆ అబ్బాయికి ఒక పాఠం నేర్పినట్టయ్యేది. తన ఆత్మకు శాంతి చేకురాలని..తను ఎక్కడున్న మనఃశ్శాంతి పొందాలని