tag:blogger.com,1999:blog-41904228372052244072024-02-07T10:24:53.772+05:30అనుభవాలునా జీవితంలొ
నన్ను
నవ్వించిన విషయాలు,
అబ్బురపరచిన సంఘటనలు,
అలోచింపచేసిన సంగతులు,
స్పూర్తి నింపిన వ్యక్తులు
ఇలా ఎన్నెన్నో చెప్పాలని......
Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-4190422837205224407.post-24982478958213781242013-06-12T23:33:00.000+05:302013-06-12T23:33:04.501+05:30జియా మరణం

ఈ వార్త వినగానే నేను ఒకలాంటి బాధకు లోనయ్యాను. రంగురంగుల, జిలుగు వెలుగుల మధ్య ఉన్న సినిమా ఫీల్డ్ అంటేనే చాలా మందికి సదభిప్రాయం ఉండదు. సినిమా అంటే 24 కళలు కలిస్తినే ఉద్భవించేదే అయినా తెర పైన కనిపించే నటి,నటులనే ఎక్కువమంది ఆరాధిస్తారు.అందుకనే వీళ్లు ఏది చేసినా మీడియా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుంది.

జియా మరణం గురించి తెలిసిన వెంటనే అందరు కూడా తన కెరీర్ పరంగా తనకి అవకాశలు లేవని దాని వల్ల కొంత నిరాశ,నిస్పృహలకు లోనయ్యి ఇలా తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉంటుందనుకున్నారు.అప్పటికి తన మరణం పైన ఒక తెలుగు పేపర్ ప్రేమే ప్రాణం తీసిందా అనే అనుమానాన్ని వెలిబుచ్చింది. చివరికి ఆ అమ్మాయి ప్రేమవల్లే చనిపోయిందని తెలిసి చాలా బాధేసింది. అందరికి గుర్తుండే ఉంటుంది దివ్యభారతి కూడా ఇలాగే రాలిపోయిందని.అది కేవలం యాధృచ్చికంగానే జరిగినట్టు చిత్రించారు నాకు గుర్తున్నంత వరకు.

జియా మరణించిన వారం తర్వాత వాళ్లింట్లో తను చనిపోవడానికి కారణాన్ని విపులంగా వివరిస్తూ తన బాధనంత అక్షరాలుగా వ్రాసిన ఒక ఉత్తరం బయటపడింది.. నిన్న అది చదివిన వెంటనే కళ్ల నుండి తెలియకుండానే కన్నీళ్లు ఒలికిపోయాయి. శాస్త్రీయపరంగా అబ్బాయిల కన్నఅమ్మాయీలు కొంచెం ఎక్కువ సున్నితంగా ఉంటారు. అందులోనూ అబ్బాయిల కన్న తొందరగా నిరాశకు లోనయ్యే విధంగా మెదడులో నిర్మాణం జరిగిఉంటుంది. పుట్టుకతోనే దేవుడు కూడా అమ్మాయిలు ఎక్కువ బాధపడాలనే ఇలా చేశాడేమో అనిపిస్తుంది.

ఆ అమ్మాయి ఉత్తరంలోంచి కొన్ని వాక్యాలు:

నన్ను నేను కోల్పోయేంతగా నిన్ను ప్రేమించాను, కాని నువ్వు నా ప్రేమను నీ మోసం రూపంలో చూపించావు. నీ ప్రపంచం కేవలం అమ్మాయిలు, పార్టీలు చేసుకోవడము. నా ప్రపంచం మాత్రం నువ్వు, నీతో ఉన్న నా జీవితం. నేను ఇంకొక శ్వాస తీసుకోవడానికి నాకు ఏ కారణం కనిపించడం లేదు.నీ కోసం కన్నీరు కార్చిన ప్రతిసారి నువ్వు దాన్ని చూసి నవ్వావు. నేను ఈ ప్రదేశాన్ని నా చెరిగిపోయిన నా కలలతో, విరిగిపోయిన మనసుతో వదిలి వెళ్తున్నాను. పడుకోవాలనుంది కానీ ఇక ఎప్పటికి ఆ నిద్రలోంచి మెళుకవ రానంతగా ....

ఈ ఉత్తరం చదివిన వెంటనే చాలా బాధగా అనిపించింది. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించడం అంటే తనన్ అవసరానికి వాడుకుని వదిలేయడము కాదు కదా!! కానీ కొంతమందికి విచిత్రంగా అనిపించొచ్చు ప్రేమలో విఫలమైతే ప్రాణం తీసుకోవాలా అని, మరి ప్రేమించిన వ్యక్తినే ప్రాణం కన్న మిన్నగా ఆరాధిస్తున్నపుడు,జీవితం అంత విలువైనదిగా అనిపించదు. తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు జీవితం శూన్యంగా అనిపిస్తుంది. అలా అని ఆ శూన్యం నుంచి బయటపడకుండా దాంట్లోనే కూరుకుపోయి చావును ఆహ్వానించకూడదు. అమ్మాయిలు ఎంత సెలెబ్రిటీలు అయినా వాళ్ల మనసు మాత్రం ఒక సాధారణ అమ్మాయి మనసులానే ఉంటుంది. జియా వ్రాసిన వాక్యాలు చదివిన వెంటనే నాకావిషయం అర్థమైంది. ఆ అమ్మాయి చావడానికి చూపిన తెగువ జీవించడానికి చూపించుంటే ఆ అబ్బాయికి ఒక పాఠం నేర్పినట్టయ్యేది. తన ఆత్మకు శాంతి చేకురాలని..తను ఎక్కడున్న మనఃశ్శాంతి పొందాలని

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com5tag:blogger.com,1999:blog-4190422837205224407.post-34675441873498436522013-06-08T05:09:00.000+05:302013-06-08T15:30:36.826+05:30సీ 'రియల్' రాధమధు

ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా మీరు పూర్తిగా చదివిన పిమ్మట నను నిందించరాదని.. ఇది కేవలం ఒక సీరియల్ వీరాభిమానిగా వ్రాసుకుంటున్న అభిప్రాయాలేనని..ఏదో అభిమానముతో ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ చెప్పినా అవి మీ మనసులో పెట్టుకుని నా బ్లాగు పైకి దండయాత్రకు రారని ఆశిస్తూ...

చక్రవాకం అంటే గవాక్షమా?? :P

నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ఋతురాగాలు అనే సీరియల్ డిడి-8లో ప్రసారమయ్యేదంట..ఎందుకంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడాలేదు.. సో మనకు అది ఔట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అన్నమాట..అప్పటికి మా ఫ్రెండ్సంతా మాట్లాడుకుంటున్నప్పుడు దీని గురించి ఎప్పుడైనా ప్రస్తావన వస్తే అందరు తెగ రెచ్చిపోయి చెప్పేవాళ్లు..అప్పుడు మ అమ్మ ఇలాంటి మంచి ధారావాహిక చూడనివ్వకుండా బాల్యాన్ని చిదిమేసిందని భాదపడేదాన్ని :(

ఇంక జీవితం ఋతురాగాల నుంచి చక్రవాకంలోకి మారింది..అంటే మేము ఎలిమెంటరి స్కూల్లోంచి హైస్కూల్లోకి వచ్చి..అబ్బో అక్కడి నుంచి మేము ఇంటర్మీడియట్ చదివి...అబ్బో ఇంజినీరింగ్‌లోకి కూడా వచ్చేశాము..మా హాస్టల్లో జనాలకి ఎంత పిచ్చి ఉండేదంటే మా రూంలోని కిటికీలోంచి కనిపించే పక్క అపార్ట్మెంట్ గదిలో ఉన్న టి.వి లో వచ్చే ఈ సీరియల్ కోసం జనాలు పిచ్చ పిచ్చగా వచ్చి ఒకరు తదేక దృష్టితో చూసి మిగతా వాళ్లందరికి లైవ్ అప్డేట్లు ఇచ్చేవాళ్లు..అబ్బో అదో తుత్తి మా వాళ్లకి.. అయినా కూడా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు..అయినా మనకు ఋతురాగాలి గురించే సరిగా తెలియనపుడు ఇంక చక్రవాకం ఏం అర్థమవుతుందిలే అనే భ్రమలో చాలా కాలం బ్రతికాను :P అదేదో ఋతురాగాలు,చక్రవాకం పార్ట్1,పార్ట్2ల్లాగా :)

మొగలిరేకుల వాసన ఇంక ఎమైనా మిగిలిందా?!

మావాళ్లు మాత్రం చక్రవాకం అంటే అర్థమేంటో అని ఓ గింజుకునేవాళ్లు..ఎందుకంటే మనకు తెలుగే అంతంతమాత్రంగా వచ్చు ఇంక ఇలాంటి గ్రాంథికపదాల గురించి చాలా సీరియస్ సమావేశాలు జరిగేవి..చివరికి తేల్చిందేంటి అంటే చక్రవాకం అంటే గవాక్షం అని, బండికి రెండు చక్రాలిలాగా ఉండాలి కాబట్టి ఆలుమగలు..అందుకని ఆ అర్థం వచ్చేలాగా పెట్టారని..అబ్బో మా వాళ్లు అనుకోని అర్థం లేవు..డిరైవ్ చేయని థియరీ లేదు..చివరికి టెన్షన్ తట్టుకోలేక మా సంస్కృతం సారిని మెల్లిగా అడిగేసారు.. పాపం సారు మంచివారు కాబట్టి అది ఒక పక్షి పేరని చెప్పగానే మా వాళ్లంతా అయినా సింబాలిక్‌గా పక్షి ఎగురుతుంది కదా సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు .. అప్పుడే అనుకున్నాం కదా అని భుజాలు తడిమేసుకున్నారు:)

చక్రవాకం అయిపోయిందని మూగగా రోదించే జనాల కంటతడి చూడలేక ఈసారి మొగలిరేకులని మొదలుపెట్టారు.. అప్పటికి మేము ఇంజినీరింగ్‌లోకి రావడంవల్ల ఇక అర్థాలకి పెద్ద సమావేశాలు జరగలేదు..అది కూడా విజయవంతంగా ఒక రెండో,మూడో వేల(అభిమానులు మన్నించాలి..మీరు ఇంకొక 3 వేలు జతచేసి ఆరువేలుగా చదువుకోగలరు)ఎపీసోడ్లు పూర్తి చేసుకుని ఈ మధ్యనే ఇక మొగలిరేకులు వాటి వాసన పూర్తిగా పోయిందని నిర్ధారించుకుని ముగింపు ఇచ్చారంట..కాని ఇది జెమిని టి.వి. మిగతా తన సీరియళ్ల టి.ఆర్.పి రేటుని పెంచడానికే ఇలా అర్ధాంతరంగా ఆపేశారని విశ్వసనీయవర్గాల భోగట్టా..:)

ఇలా సీరియల్ బాధితురాలిని నేను కాదు అని సగర్వంగా చెప్పుకుంటున్న సమయంలో నాకు ఒక సీరియల్ తెగ నచ్చేసింది..అబ్బో అదేంటంటే అది జెమిని టి.వి లోది కాదు అది మాటివి ఛానెల్లో ప్రసారమయ్యేది-"రాధమధు". నేను టైటిల్ సాంగు వినే పెద్దాఆఆఆఆ అభిమానిని అయిపోయాను..చెప్పాలంటే అందులోని పాత్రలకి (Not vessels,characters :D)

సీరియల్ కు కొత్త నిర్వచనం దీనివల్లే

కూడా..వాళ్ల పాత్రలను తీర్చిదిద్దిన తీరు అద్భుతం అండి.కథా,కథనం చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడా కక్ష్యలు,ప్రతీకారాలు,ఎత్తులు,పైఎత్తులు లాంటివి లేకుండా ఆహ్లాదంగా గడిచిపోతుంది.

ఈ సీరియల్ మొదలయ్యేటప్పుడు చివరిలో కథ అని యుద్ధనపూడి సులోచనారాణి అని వేసేవారు..సీరియల్ ఏమవుతుందా అని టెన్షన్ వచ్చినప్పుడల్లా ఆ పుస్తకమేదో కొనేసుకుని చదివేయాలి అని అనుకునేదాన్ని.ఈ సీరియల్ కు మాత్రం మ అమ్మ,నేను సంయుక్తంగా అభిమానులం అవ్వడంచేతా నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు లైవ్ అప్డేట్స్ ఇచ్చేది. నిజంగా సీరియళ్లకున్న గొప్ప లక్షణం ఏమంటే మనం ఏ ఎపిసోడ్ చూసినా కథ అర్థం కాదు అనే పెద్ద గందరగోళం లేకుండా ఒక రెండు,మూడూ నెలలకి కూడా కథలో పెద్ద మార్పుండదు కాబట్టి మనం ఏదో మిస్స్ అయ్యామన్న భావన ఉండదు. ఇలా అప్పుడు చదవాలనుకున్న సులోచనారాణి గారి ఈ సీరియల్ కు ఆధారమైన నవల "గిరిజాకళ్యాణం" నాకు ఈరోజు గూగుల్‌లో దొరికింది. ఎవరో పుణ్యాత్ములు..చక్కగా 270 పేజీలు స్కాన్ చేసి పెట్టారు..నేను నిన్న రాత్రి 11.30 మొదలుపెడితే ఇదిగో 3.50కి నవల పూర్తిగా చదవడమైంది..చదివిన ఆనందంలో అన్ని గుర్తొచ్చి ఇలా వ్రాశాను..

ఎంతో అర్థమైన వాక్యాలు కొన్ని ఆ పాటలోంచి ...

ఆగదేనాడు కాలము,

ఆగిన గడియారము...

కాలమే ఎంత సాగినా,

ఓటమవ్వదు విజయము...

ఓడినంతనె గెలుపుపై నమ్మకమే నే వదలను

నమ్మలేని విజయాని పై భ్రమలోనే గడపను

కెరటాలు కోటి సార్లు ఎగిరి,

గగనాన్ని నేల పైకి తేవా..

ఆ నింగి నేలా ఎదురెదురుగున్నా

రెంటికి సాధ్యమా వంతెనా!!!!..

నవల లింకులు(ఎవరికి అభ్యంతరం కాదని అనుకుని)

గిరిజా కళ్యాణం-1

గిరిజా కళ్యాణం-2

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com11tag:blogger.com,1999:blog-4190422837205224407.post-82029876151236966412013-05-30T14:52:00.000+05:302013-06-08T23:08:56.761+05:30నేను ఈరోజు

మా ఊర్లో ప్రతి వైశాఖ మాసంలో వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చవితి రోజు రథోత్సవం జరుగుతుంది. దాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వీలు చేసుకుని మరీ వెళ్తుంటాం. ఈ సారి కూడా నేను మా ఊరు వెళ్లివచ్చాను.

ఇంటి దగ్గర ఒక నాలుగు రోజులు ఉండేసరికి ఇంటి పైన చాలా బెంగగా ఉంది. నేను హాస్టల్లో ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇప్పటికి ఇంటికి వెళ్లి వస్తే చాలా బెంగ. చదువుకునే సమయంలో అయితే మన స్నేహితులు, మనం చదవాల్సిన పాఠాలు అని బోలెడు పనులు ఉంటాయి కాబట్టి బాధపడటానికి అంత తీరిక ఉండదు. మరి ఇప్పుడో అలా కాదు, బోలెడంత సమయం కదా.. అందులోనూ చదువుకునే రోజుల్లో అయితే ఎంత బెంగ ఉన్నా దాని ప్రభావం చదువు పైన పడకుండా జాగ్రత్త పడేవాళ్లం.

పిచ్చుక గూళ్ల లాంటి ఒక గదిలో ముగ్గురం ఉంటాం. వీలయితే మా కళ్లు టి.వి కి, లేదంటే మా లాప్టాప్ స్క్రీన్లకు అప్పగిస్తాం.మొదట్లో ఇలా ఉండాలని తెలియక నేనే చాలా కబుర్లు చెప్పెసేదాన్ని.. కానీ మా రూములో ఉన్న మిగతా ఇద్దరికీ అది నచ్చలేదు.ఇక అప్పట్నుంచి నేను కూడా పెద్దగా మాట్లాడటం మానేసాను.అయినా మనసుకి నచ్చాలి మాట్లాడాలంటే.. ఏదో మొహమాటానికి పెదవుల పైన వికారపు నవ్వు నవ్వుతూ ఎంతసేపని నన్ను నేను కష్టపెట్టుకోవటం అని మాట్లాడటమే తగ్గించేసాను. ఆఫీసు నుంచి రూముకి రాగానే వీలయితే టి.వి చూడాలి, లేదంటే లాప్టాప్. ఇంతకు మించి ఒక్క పని ఉండదు. ఆశ్చర్యమేమంటే నేను ఇంటికి లాప్టాప్ తీసుకెళ్ళినా ఒకసారి తెరవడానికి కూడా సమయం దొరకలేదు, అంత తీరిక కుడా లేదు.

ఉన్న నాలుగు రోజుల్లో మొదటిరోజు ప్రయాణపు బడలికతో విశ్రాంతి తీసుకుంటే, తరువాతి రోజు మా అమ్మ కజ్జికాయలు చేసే ప్రోగ్రామ్ పెట్టేసింది. ఆ పనితో ఆ రోజు గడిచిపోయింది.తరువాతి రోజు బూజులు దులపాలి పండగ కదా అని ఆ పనికి పూనుకుంది. మరీ అమ్మ ఒక్కత్తే కష్టపడుతుంటే మనం చూస్తూ ఉండలేము కాబట్టి ఆరోజు అలా గడిచింది. చివరి రోజు అంటా పండగ హడావుడి. ఆరోజు మళ్లీ బబ్బట్లు చేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాం.ఇలా నాలుగురోజులు తీరిక లేకుండా సెలవులు గడిచిపోయాయి.

ప్రతిసారి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా ఉంటుంది. కానీ తిరిగివచ్చే రోజు ఏదో తెలియని బెంగ,బాధ మనసులో ఇంకా ఎన్ని రోజులు ఇలా అమ్మా,నాన్నలకు దూరంగా ఉండటం అని.ఉద్యోగం రాక మునుపు ఇంటి మీద బెంగ అన్నా కూడా ఇంట్లోవాళ్లు ఏమి కాదులేమ్మా!! బాగా చదువుకో అని చెప్పి కర్తవ్యo గుర్తుచేసేవారు. మ్మ్..ఇప్పుడు అంత బెంగగా అనిపిస్తే పంచుకోవడానికి దగ్గరి స్నేహితులు లేరు. ఇంట్లో వాళ్లని మాటిమాటికి ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టాడానికి మనసు రాదు. ఇక నా గోడు ఎవరైనా వింటారు అంటే అది నా దిండు మాత్రమే..

ఇక్కడ ఐదు రోజులు పని చేసి, రెండు రోజులు పని లేకుండా హాస్టల్లో ఏమి చేయాలో తోచక.. అసలెందుకు రా ఈ ఒంటరి ప్రాణానికి ఈ సెలవులు అని విసుగొస్తుంది,పోని రెండురోజులు సెలవులున్నాయి కదా ఇంటికెల్దామా అంటే 12 గంటల సుదీర్ఘ ప్రయాణం. అంత దూరం ప్రతి వారం ప్రయాణం చేయలేను. నాకైతే నిజం చెప్పాలంటే ఏ డిగ్రీయో ఇంటిపట్టునే ఉండి చదివి, ఎలాగోలా కష్టపడి ఒక టీచరు ఉద్యోగం సంపాదించేసి సంతోషంగా రోజు ఇంటి నుంచే వెళ్తే ఎంత బావుండేదో అని అప్పుడప్పుడు పగటికలలు కంటూ ఉంటాను. అయినా ఇప్పుడు వేలకు వేలు సంపాదించి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన నిజంగా సంతోషంగా ఉన్నట్టా?? అసలు రోజు అమ్మ చేతి కమ్మని వంట తింటూ.. ఇంటి నుంచే ఉదయం పదింటికి బయలుదేరి సాయంత్రం ఆరింటికల్లా మళ్లీ ఇల్లు చేరుకునే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు నా దృష్టిలో గొప్ప అదృష్టవంతులు. నేను ఎవర్నైనా చూసి ఈర్ష్య పడుతాను అంటే అసలు హాస్టల్ మొహమే మేము ఎరుగము అని కొంతమంది చెప్పినప్పుడు..ఈ ఇంటి మీద బెంగ ఎప్పటికి తగ్గుతుందో నాకర్థమవట్లేదు.ఈరోజే మళ్లీ సెలవు ఎప్పుడు పెట్టి ఇంటికి వెళ్లాలా అని ప్లాను వేసుకున్నాను. :)

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com5tag:blogger.com,1999:blog-4190422837205224407.post-44439874924770832772013-05-22T22:06:00.003+05:302013-06-08T23:02:59.850+05:30అనగనగా యువరాణి

మ్మ్ ఏంటో ఈ జీవితం చడి,చప్పుడు లేకుండా చప్పగా, అప్పుడప్పుడు కొన్ని కష్టాలతో.. అప్పుడప్పుడు జీవితం అంటే ఇంతేనా అని అనిపించే విధంగా సాగుతూ నిజం చెప్పాలంటే సాగుతూఊఊఊఊఊఊఊఊఉ ఉంది. ఏం చేస్తాం మనం కూడా దానితో పాటే సాగాలిగా...ఈ సాగింపు చర్య ఏంటీ అంటారా ?? మనం అలా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాలి మరి..

అనగనగా ఒక పేద్ద సాఫ్ట్వేర్ కంపెనీ.. అందులోకి ఒక బుల్లి యువరాణి..ఎవరా అని బుర్ర బద్దలుకొట్టుకోకండీ(నేనే మరి)..మరేమో నేను యువరాణి కదా అందుకని నాకు మొదట్నుంచి ఆటలో అరటికాయ టైపులో అందరు చిన్న చిన్న పనులు చెప్పి నా చేతులు కందకుండా గారాభంగా చూసుకున్నారు..ఇలా యువరాణి వారు రోజు ఆటవిడుపు కోసం ఆఫీసుకు రావడం నచ్చని మంత్రివర్యులు(మెనేజరు) వారు మెల్లిగా ఈ విషయాన్ని రాజా(డెలివరి మెనేజరు) వారి చెవిలో ఊదేసారు. పాపం కొంచెం ఘాట్టిగానే ఊదారేమో చెవి కందిపోయి దానికి వెంటనే చర్య తీసుకునేలా హుకూం జారీ చేసారు..

మరి యువరాణి వారికి ఈ విషయం తెలియగానే ఎలా స్పందిస్తారో అని రాజా వారు తటపటాయించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, యువరాణి!! మీరు ఆడి,ఆడీ పాడు చేసినది చాలు మా శీఘ్రగణనయంత్రమును..మీరు వెరక చోటికి వెళ్లి ఆడుకొనుము..(గూడార్థము మీరింకొక ఉద్యోగమును వెతుక్కొనుము అని)..వెంటనే వూహించని ఈ పరిణామమునకు యువరాణి కనులలో నుంచి జాలువారు అశ్రువులను నియంత్రించుకుని, నన్ను ఒక జట్టుతో కలిపి చూడుడి, నా ప్రతిభను చూపించెదను అని మంగమ్మ శపతమును పూనిన వెంటనే.. మిక్కిలి ఆనంద భరితుడైన రాజా వారు నన్ను ఒక గుంపులో చేర్చిరి..(ఏ గుంపు అనా మీ అనుమానం, నా లాంటి అరటికాయలందరి గుంపులో :) ) మీరు ఇప్పుడు అందరి చేతా పరీక్షంచబడి ఒకరి చేత ఎన్నుకోబడతారు..అయితే ఒక నియమము అని ఒక రహస్యమును నా చెవిలో వేసినారు..అది ఏమనగా ఒక్క 30 రోజులు మాత్రమే ఈ అవకాశముండును, మీరు ఎవరి చేతా ఎన్నుకోబడని యెడల మీరు వేరోక రాజ్యానికి తరలి వెళ్ల్లవలే అని కటినముగా చెప్పినారు..

మిక్కిలి దుఃఖముతో యువరాణి అయిన నేను అప్పటి దాకా ఆడిన ఆటలు, చేసిన సాహస కృత్యాలు ఒకసారి నెమరు వేసుకుని అదిగినా వారందరికి అవే సమాధానాలు చెప్పి చెప్పి నాకు కలలో కూడా అవి మాత్రమే వచ్చుచుండెడివి కొన్ని దినములు.. :D ఇందులో నేను ఎదుర్కొన్న సమస్య ఏమనగా అందరూ నువ్వు ఏ సమయమునైనా నీ తిండి,నిద్ర మాని మరీ ఆడుకొనెదవా అని అడుగుచుండేవారు :( నేనసలే యువరాణిని అలా నేను ఆడలేనని కొంతమంది గుంపులో చేరలేకపోయాను. నాకున్న పరిఙ్ఞానముతో నేను ఒక గుంపులో చేరుటకు చాలా ఉత్సాహమును చూపి ఉంటిని.. ఆ విషయము కూడా మరిచిపోయి ఉంటిని,కానీ ఒక గుంపు యొక్క ప్రతినిధి వచ్చి మీరు ఆరోజు మాకు మాట ఇచ్చితిరి మా గుంపులో చేరెదమని.. ఆడిన మాట తప్పరాదు యువరాణి అని చెప్పడంతో హతాశురాలై నాకు ఇంకొక్క అవకాశం ఇచ్చిన నేను ఇంతకన్నను మంచి గుంపులో చేరెదను అని మొహమాటము లేకుండా చెప్పితిని.అయినను ఆ ప్రతినిధి నన్ను బలవంతముగా తమ గుంపులో చేర్చుకొనినారు.అప్పటివరకు నేను ఒక గాజుగదిలో ఉండేదాన్ని(private restricted area).అలాంటి నన్ను తెచ్చి ఒక గుంపులో కలిపి అందరితో పాటు రెండు కుర్చీల మధ్యలో ఇరికించి నువ్వు ఇక్కడే కుర్చోవాలి అని మొదటి ఆఙ్ఞ జారీ చేసారు..నా చేతిలో ఏమీ లేకపోవడంతో అలాగే కూర్చుని ఆ పరిసరాలకి అలవాటుపడుతూ ఉండగా నన్ను ఇంతకు ముందు గుంపు ప్రతినిధి పిలిచి నువ్వు వేరొక గుంపులో చేరితివి, అయినను ఇచ్చటనే కూర్చుని కాలక్షేపము చేయుచున్నావు. వెంటనే నువ్వు నీ గణనయంత్రమును మాకు అప్పగించి మీ గుంపుతో కలిసి కూర్చొనవలెను అని ఆఙ్ఞాపించిరి:( అది కూడా రెండు దినములలో..దీని కొరకై మా గుంపు ప్రతినిధికి ఒక 20 లేఖలు(mails) పంపిరి.ఇక గతిలేక నేను ఆ చోటు ఖాళి చేసి నిరాశ,నిస్పృహలతో ఆ చోటుని విడిచి నా ఆటవస్తువులని అన్నిటిని సర్దుకుని కొత్త ప్రదేశానికి తరలి వచ్చితిని. కొత్త చోటు మరీ ఇబ్బందికరంగా ద్వారము మొదట్లో ఉండటం మూలంగా అటు,ఇటు తిరిగే వాళ్లు నా గణన యంత్రము వైపు ఒకసారి పరికించి వెడుతున్నారు,చాలా ఇబ్బందికరముగానున్నది. అంతేకాకుండా నాతొటి ఆడి, ముచ్చట్లు చెప్పే చెలికత్తె నాకు దూరముగానున్నది.

I miss my friend,place and that restricted private area :(

వచ్చే జన్మలోనైనా ఇలా కాకుండా నిజంగా యువరాణిలా ఉండాలని అనుకుంటున్నాను..

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com4tag:blogger.com,1999:blog-4190422837205224407.post-81960667494237858212013-05-15T11:40:00.001+05:302013-06-20T22:47:13.571+05:30మనసుల గారడీ(కథ)

పోద్దున్నే కళ్లు తెరవడానికి రావట్లేదు. రాత్రంతా ఏదో జరిగినదని తెలుస్తూనే ఉంది కానీ అది బుర్రలోకి వచ్చి అది కాస్తా కళ్లలోంచి సన్నటి నీటిధారగా బుగ్గల మీదుగా ఒలికిపోయింది

రాత్రి స్వప్నకు,వంశీకు మాట మాట పెరిగి ఇలా తను ఇంతలా బాధపడుతుంది అనుకుంటూ వంశీ అన్న మాటలకి జీవితం పైన విరక్తి కలిగి అప్పుడే బిల్డింగ్ పై నుంచి దూకో, ఫ్యాన్ కు ఉరేసుకునో చావాలనిపిస్తుంది. ఇదే శపథం రాత్రి వంశీ దగ్గర చేసినా తన నిస్సహాయతను, చేతకానితనాన్ని తలుచుకుని ఇంకా కృంగిపోయింది. చావాలనిపిస్తుంది కానీ అంత ధైర్యం లేదు. అలా అని రోజు ఈ మానసిక సంఘర్షణ అనుభవిస్తూ బతకాలని కూడా అనిపించట్లేదు. ఈ విషయం అమ్మ,నాన్నలతో చెప్పలేను, ఎందుకంటే వాళ్లకి అసలు వంశీ అంటే ఎవరో తెలియనే తెలియదు. ఇంక అక్కతో ఈ విషయం గురించి ఒకసారి చెప్పినా, నువ్వు ఏదైనా చేసేముందు నాకెందుకు చెప్పవూ అంది. ఎటు నుంచి చూసినా తప్పు నాదే స్పష్టంగా తెలుస్తుంది.

కళ్లు మూసుకుని ఒకసారి జరిగిన దాన్ని తలుచుకుంది. మార్చి ఒకటో తేది..వంశీ పుట్టినరోజు, తను ఎంత బతిమిలాడినా వినకుండా నాకు ఇంట్లోనే పుట్టినరోజు చేసుకోవడం అలవాటు అని వెళ్లిపోయాడు, తన కోసం చేసిన గ్రీటింగ్ కార్డ్ కూడా తీసుకోకుండా నీ దగ్గర ఉంచుకో తర్వాత తీసుకుంటాను అని ట్రైన్లో నుంచి చేయి ఊపుతూ ఇంటికి వెళ్లిపోయాడు. మనసులో కొంచెం నిరాశగా అనిపించింది.మార్చి ఒకటో తేది అనుకోకుండా స్వప్న స్నేహితుడు వినయ్ ఏదో పని ఉండి స్వప్న ఆఫీసువైపు వచ్చి అలాగే తనని కలుస్తానని ఫోన్ చేసాడు.. వినయ్ అంటే చిన్నప్పటి తనతో పాటు కలిసి చదువుకున్న అబ్బాయి. ఈ మధ్య తను ఊరెళ్తే కనిపించి తను కూడా బెంగళూరులోనే ఉన్నానని చెప్పి ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఇక అనుకోకుండా వస్తానని చెప్పడం వల్ల తను నేరుగా ఆఫీసు దగ్గరికి వచ్చి కలవమంది. తను రాగానే విజిటరుగా వాళ్ల క్యాంటీను వరకు తీసుకెళ్లింది అంతకు మించి ఏం చేయాలో అర్థమవక. ఆ తర్వాత వినయ్ చొరవగా ఇక్కడ దగ్గర్లో ఏదైనా థియేటరు ఉంటే సినిమాకు వెళ్దామా అని అనగానే, స్వప్న సంశయిస్తూనే సరే అంది. అది జరిగిన తర్వాత వినయ్ తన మైలు ఐడి ఇచ్చి కొద్ది సేపు మాట్లాడమని అడిగాడు. వంశీ గురించి తను కలిసినప్పుడు వివరంగా చెప్పినా తనతో చాట్ చేసేటప్పుడు తనంటే ఇష్టమని వినయ్ చెప్పాడు. స్వప్నకు ఏం చేయాలో పాలుపోలేదు. నాకు చిన్నపటి నుంచే ఇష్టం , కానీ ఆ విషయం అప్పుడు చెప్పడనికి అంత వయసు లేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నా అని చెప్పాడు.ఈ విషయం అంతటితో వదిలేసి వినయ్ తో మామాలుగా మాట్లాడింది.వంశీ ఊరి నుంచి రాగానే వినయ్ కలిసాడని చెప్పింది కానీ తనతో పాటు సినిమాకి వెళ్లానని చెప్పలేకపోయింది.

ఒకరోజు వంశీ ఫోన్లో తన ఐడి, పాస్స్వర్దుతో మైలులోకి లాగిన్ అవడానికి ప్రయత్నించింది, కానీ అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడంతో లాగిన్ అవలేకపోయింది. వంశీ,తను ఆరోజు రాత్రి భోజనం చేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. వంశీ ఇంటికి వెళ్లి తను మొబైలులో మైలు తెరవడానికి ప్రయత్నిస్తే స్వప్న మైలు తెరుచుకుంది, తెరుచుకోగానే ఏమున్నాయో అని చూసి, వెంటనే స్వప్నకు ఫోను చేసి వినయ్ ఎవరు? అని అడిగాడు, స్వప్న నువ్వు నా మైలు చూసావా అని అడిగింది?

వంశీ వెంటనే నీ లాగా ఎవరి బైకో ఎక్కి, వాళ్లతో సినిమాలు చూసే దాన్ని నేను పెళ్లిచేసుకోవాడానికి రెడీగా లేను అని ఆవేశంగా నేను ఇప్పుడే నీ మైలు, ఫోను నంబరు అన్ని బ్లాకు చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటి దాక నేను నాకు అమ్మాయిల పైన నమ్మకం లేదని చెప్పేవాడిని, కానీ ఇప్పుడు చెప్తున్న నీ పైన నమ్మకం లేదు.స్వప్న తనదే తప్పని తెలుసుకుని వంశీ వాళ్ల ఆఫీసు దగ్గరికి వెళ్లి ఉదయం, సాయంత్రం తన కోసం చూసేది ప్రతిరోజు. తను చేసిన తప్పుకు క్షమించమని కాళ్ల మీద పడి వేడుకుంది. అదే విషయం వంశీతో చెప్తే కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయమేమి కాదు అని అన్నాడు.

ఇంకొకరోజు వంశిని క్షమించమని అడిగితే.. చూడు, నేను ఈరోజు మా ఆఫీసులో మా కోలీగ్లలో పదిమంది అమ్మాయిలని అడిగాను సినిమాకు వెళ్దామని, అందరూ ఎందుకు రావాలి నీతో అని అడిగారే కానీ నీలాగా అడిగిన వెంటనే ఎవరూ రాలేదు, అందరి అమ్మాయిలలోకి నీవే తేడా..ఆ విషయం ఇప్పటికైన తెలుసుకో అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత స్వప్నకు చాలా బాధగా అనిపించింది. తను తొందరపడి చేసిన తప్పుకు జీవితాంతం శిక్ష పడిందనుకుంది, తను చేసిన తప్పు వల్ల జీవితాంతం తనతోపాటు కలిసి ఉండాల్సిన వ్యక్తిని కోల్పోయింది అని అనుక్షణం కృంగిపోతోంది.

ఈ కథలో నిజంగా స్వప్న తప్పు చేసిందా? స్వప్న అనుభవించే శిక్ష సరైందా?

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com11tag:blogger.com,1999:blog-4190422837205224407.post-3723663048310286962013-05-08T16:01:00.000+05:302013-06-08T23:08:04.096+05:30సరదాగా---My Exam experience

జీవితం సాఫీగా,ఒకేరకమైన దినచర్యతో సాగిపోతుంటే ఏదో కోల్పోయామన్న భావం కలుగుతుంటుంది. అలా నేను కూడా రొటీన్ గా ఫీల్ అయ్యి మనం ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి బదులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే మన జీవితానికి ఇక ఏ ఢోకా ఉండదనుకుని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు ఏదో పిఓ ఉద్యోగాలకు ఒక పరీక్ష పెడుతున్నారని చివరాఖరి వారంలో తెలుసుకుని నేను తీరిగ్గా చివరి తేదికి ముందు దానికి అప్ప్లై చేశాను.

అసలే మనం ఏం చేసినా దరిద్ర దేవత వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. సో నేను ఆన్ లైన్లో అప్ప్లై చేయగానే నాకు ఆ సైట్లో సమస్యుందని ఒక సందేశం నా కంప్యూటర్ పైన కనబడింది. అయినా మనకు ఇంక హాల్ టికెట్టు ఎలాగు రాదనుకుని ఊపిరి పీల్చుకున్నాను.. కొద్ది రోజుల తర్వాత నా బ్యాంకు అక్కౌంటులో డబ్బులు జమ కాకపోవడంతో ఏదో తేడా జరిగందనుకుని ఇంక ఆ విషయం అంతటితో మర్చిపోయాను.

ఒక శనివారం మధ్యాహ్నం పని పాటా లేకుండా తీరిగ్గా ఏం చేయాలో తెలియక మా గది పైకప్పు వైపు చూస్తూ నిద్రలోకి జారుకుంటున్న సమయంలో నా మొబైల్ వైబ్రేట్ అయితే ఏదో మెస్సేజ్ వస్తే ఏదో పిచ్చి మెస్సేజ్ అని డిలీట్ చేయబోయి..ఎందుకో చూస్తే ఏముంది?!ఎస్.బి.ఐ వారి నుంచి హాల్ టిక్కెట్టు పంపించామని సందేశం. రెండు వారాల ముందు ఈ విషయం తెలిసినందుకు నవ్వాలో,ఏడ్వాలో అర్థమవక ఆ నిముషంలో నవ్వుకుని పుస్తకాలు దుమ్ము దులిపి చదవడం ప్రారంభించాను.

ఇక పరీక్షకు చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఒకటే కలలు.. పరీక్ష సెంటరుకి ఆలస్యంగా వెళ్లానని.

ఎందుకంటే ఉదయం ఎనిమిదింటికి అని ఒక భయం..రోజు బారెడు పొద్దెక్కినా కళ్లు తెరవని నాకు ఆ భయంతో రోజు అలాంటి కలలే వచ్చేవి..:( ఎందుకైనా మంచిదని మా అమ్మకు ముందే చెప్పి పెట్టాను, ఎలా అయినా లేపమని..పరీక్ష ముందురోజు రాత్రి ఎంతసేపటికి నిద్రపట్టదు,ఒక లాంటి ఆతృత ఎగ్జాం ఎలా వ్రాస్తానా అని.. అయినా ఏమి ప్రిపేర్ అవ్వకుండా వ్రాసే నాకే ఇలా ఉంటే ఇంకా దాని కోసం రాత్రి,పగలు కష్టపడే వాళ్ల గురించి తలుచుకుని నా హంగామాకు తెగ నవ్వుకున్నాను.ఉదయం నాలుగింటికే లేచి ఒకసారి అన్ని మననం చేసుకుని తయారయ్యి చూస్తే ఎంతసేపటికి నేను ఎక్కవలసిన బస్సు రావట్లేదు :( మా స్టాపులోనే ఒక 25 మంది ఎక్కారు. అయినా ఈ సాఫ్టువేరుల పైన జనాలాకి ఎంత నమ్మకముందో అప్పుడు అర్థమైంది. నిలబడడానికి చోటు లేదు..అలా చచ్చి చెడి ఎగ్జాం సెంటరుకి చేరుకున్నాను..

నేను పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు, రెండు వారాల ముందు చదివితే ఇలాగే ఉంటుందని నాకు నేనే ధైర్యం చెప్పుకుని వెళ్లాను. పరీక్ష సెంటరు దగ్గర అందరూ తెగ పుస్తాకాలు చదువుతున్నారు, నాకు అప్పుడే పరీక్ష పేపర్ ఏమైనా లీక్ అయ్యిందేమోనని అనిపించింది. నేను కూడా నా పక్క అమ్మాయి పేపర్లోకి తీక్షణంగా చూసాను, ఆ అమ్మాయి సరే అని నా వైపు ఒక జాలి చూపు విసిరి నాకే ఆ కాగితం ఇచ్చి చదివేసి ఇచ్చేయ్ అంది. నా నంబరు ఉన్న గదికి వెళ్లి చూస్తే ఒక నంబరు తప్పుగా వేసి బోర్డు పైన అందరిని హడలగొట్టారు.

పరీక్షకి వెళ్లి చూస్తే అప్పటికప్పుడు చదివిన వాటిలోంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. అయినా ప్రశ్నాపత్రం ఇంత సులభంగా వస్తే మనకు ఇంత పోటిలో వస్తుందా అనే అనుమానం ఇప్పుడు...17 లక్షల మంది పోటిపడితే అందులో ఒక 4500 మందిని మాత్రమే తీసుకుంటారు, అయినా కానీ మనిషి ఆశజీవి అని అనడానికి నేనే ఒక ఉదాహరణ:)లేకపోతే ఈ లోకంలో మన మనుగడ కష్టమవుతుందెమో ఇలాంటి ఆలోచనతత్త్వం లేకపోతే కొన్ని సమయాల్లో:) కానీ ఇంకా బాగా వ్రాసుండాలి అని అనిపించింది. ఏం చేస్తాం ఆ బుద్ధి ముందుండాలి కదా!!!

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com2tag:blogger.com,1999:blog-4190422837205224407.post-35346086192903197692013-03-01T18:50:00.001+05:302013-06-08T23:02:00.166+05:30నేను బ్లాగుతూనే ఉంటాను

తిక్క కుదిరిందా??నాతో పెట్టుకుంటారా??

ఏంటో ఈ మధ్య నువ్వు ఏదో సమాజాన్ని ఉద్ధరించేటట్టు ఆవేశంలో వ్రాసే నీ వ్రాతలు నువ్వు మాత్రమే మంచిదానివన్నట్టు ఉన్నాయి. అయినా బొమ్మకు ఒక వైపు మాత్రమే చూపి ఇంకొక వైపు చూపకపోతే బొరుసు లేదనుకుంటారు..(నా అంతు లేని ఆలోచనలు పోస్టుకు వచ్చిన ఒక మెచ్చుకోలు.)ఇది మరీ బాగుంది.. దానికి రెండోవైపు ఏముందో చూడకుండా ఉండటం మీ తప్పు.అంతే కానీ ఇలా నా బ్లాగు మీద పడి ఏడిస్తే ఏం లాభం ??

ఈలాంటి మెచ్చుకోలు ప్రశంస విన్న తర్వాత నాకు కొన్ని అలోచనలు వచ్చాయి...వాటిలో అన్ని కాదు కొన్ని మాత్రమే.. అన్నీ వ్రాస్తే పరీక్షా హాల్లో ఇచ్చే మెయిన్ బుక్లెట్ 16 పేజీలు కూడా సరిపోవు

1. నిజంగా బ్లాగులో వ్రాసేదాంట్లో భావం ముఖ్యమా లేదా సంఘటన??

2. ఏదో ఊసుపోక కబుర్లు చెబుతూ నేను ఎవరినైనా బాధపెడుతున్నానా?

3. నా బ్లాగు వల్ల చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నానా?

4. విలువైన సమాచారం ఇవ్వనప్పుడు ఈ బ్లాగు ఎందుకు?

5. ఈ బ్లాగు వల్ల నిజంగా ఏవైనా ఉపయోగాలున్నాయా?

6. నా బ్లాగులో ఇంటిగుట్టు రట్టు చేసే పోస్టులే ఎక్కువా?

7. అందరితోనూ ఇలా బాహాటంగా అన్ని విషయాలు చెప్పుకుంటారా?? (హవ్వా..నలుగురు చదివితే నవ్విపోదురు గాక)

8. బ్లాగు వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఇది ఉండటం అవసరమా??

ఇంత మానసిక సంఘర్షణ తర్వాత బల్గేరియా బడి పాఠంలో ఇవేవి నేర్పకుండా బ్లాగును తయారుచేసుకోవడానికి అనుమతిస్తున్న మతి ఉన్నా లేని బ్లాగర్ వారినే పూర్తిగా బాధ్యత వహించవలసిందిగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడమైనది. దానికి సంబంధించిన కేసు పూర్వాపరాలు విచారణకు గాను మళ్లీ తర్వాతి పోస్టుకు వాయిదా వేయడమైనది. :D :D

హమ్మా.. లేదంటే పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నా బ్లాగునే మూయించేయాలని చూస్తారా!! అంతే

మీకు తప్పదు.. ఇప్పుడైనా అర్థమైందా?? బ్లాగర్ ఉన్నంతవరకూ నా బ్లాగ్ ఉంటుంది. మీరు చదివిన, చదివి వినిపించినా, చూసి తరించినా, నన్ను ఏడిపించినా.. మీరు ఏడ్చినా :D :D

నా బ్లాగు చదివి నా పైన అక్షింతలు జల్లిన మా ప్రియమైన అక్కకు, స్నేహితు"రాళ్ళు" వనజ,కావ్య,బిందు,మాధవిలకు ఈ టపా అంకితమిస్తూ.. తలనొప్పికి జండూబామ్ వాడమని ఒక చిన్న సలహా

మీ మీద జాలితో...

గమనిక:

బల్గేరియా బడిపాఠాలు ఇక్కడ http://harekrishna1.blogspot.in/

బల్గేరియా బడి విద్యార్థిగా ఆ పాఠాలు సరిగ్గా నేర్చుకోనందుకు ఆండీగారికి క్షమాపణలు చెప్పుకుంటూ ..

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com5tag:blogger.com,1999:blog-4190422837205224407.post-78187087848929123142013-02-06T18:12:00.002+05:302013-06-08T23:04:29.336+05:30అంతు లేని ఆలోచనలు

రోజూవారీ యాంత్రికజీవనంలో కొన్ని చిన్న చిన్న సంతోషాలు, జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠాలు నేర్పిన సంఘటనలు.. వెరసి జీవితంలో ఈ బంధాలు, అనురాగాలు ఏవి శాశ్వతం కాదని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. అన్ని అశాశ్వతం అని తెలుసు కానీ ఒక వ్యక్తి అన్న

మాటల్ని తేలికగా తీసుకోలేము. అలా అని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే మనకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు.

కానీ మానవుని మనసు కోతి కదా.. కోతి ఒక చిన్న కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు దూకినట్టు, మనసు అంతే...

అలసట అన్నది ఎరగకుండా ఆలోచనల అలల తాకిడితో నిత్యం సతమవుతూ ఉంటుంది.

అందుకే ధ్యానం చేయాలేమో.. కొన్ని నిముషాలైనా మనసుని ఆలోచనల నుంచి రక్షించడానికి..అందరికీ ఒక మనసు ఉంటుంది. ఎదుటి వారి మనసుని గాయపరిచేట్టు మాట్లాడుతాం కోపంలో, మళ్లీ మనసుని శాంతపరిచి ఆలోచిస్తే చేసిన తప్పు తెలుస్తుంది. కొంతమంది వెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. కానీ కొంతమంది అలా కోపంలో అరిచిన మాటల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆ అరిచిన వ్యక్తిని జీవితంలో దగ్గరకు రానీయకపోవచ్చు. దీని వల్ల మనకెంత నష్టమో తెలుస్తుంది.

అమ్మాయి అంటే అబ్బాయిల కాళ్ల దగ్గర సేవచేస్తూ పడకకి మాత్రమే అవసరమనుకుంటూ ఉంటారు కొంతమంది మహానుభావులు..తరాలు మారినా, యుగాలు మారినా ఈ వాక్యంలో ఎలాంటి మార్పు ఉండదు.భార్య,భర్త అంటే ఒక బండికి రెండు చక్రాలలాంటి వారు అని అంటారు.. మరి అలాంటప్పుడు ఒక చక్రంలో గాలి లేకుండా బండి నడపగలరా?? లేదు కదా, మరి ఒకరు అణిగి,మణిగి ఉండాలన్న ఆలోచన ఎందుకు పెట్టుకుంటారు మనసులో? నిజానికి ప్రతి విషయంలో అమ్మాయిల గెలుపుని హర్షించే పురుషులు ఉంటారా??ఎంత పైకి మద్దతు తెలిపినా లోపల మాత్రం అంట్లు తోముకోక నువ్వు ఆఫీసులో ఏం పీకుతావే?? అనే అభిప్రాయంలో ఉంటారు..

నాకు తెలిసినంత వరకు అబ్బాయిలకు కావలసింది ఏంటంటే ప్రతి విషయానికి ఎందుకు? అనే ప్రశ్న లేకుండా చెప్పిందల్లా వినే ఒక కుక్కపిల్ల లాంటి అమ్మాయి కావాలి. వేళకు అన్ని సమకూర్చిపెట్టి తను ఎన్ని అవమానాలకు గురిచేసినా తలొంచుకుని అన్ని భరించి ఇంట్లో బానిసలాగా పడుండే ఒక అమ్మాయి అయితేనే అబ్బాయిలకు నచ్చుతుంది. అలా కాదు అని గొంతు విప్పితే దేని దేనికో ముడిపెట్టి అసలు మనకు పుట్టిన పిల్లలు నా వల్లే పుట్టారా? లేదా ఇంకెవరితోనైనా తిరిగితే పుట్టారా అనే నీచపు మాటలు మాట్లాడి ఆ అమ్మాయి ఆత్మాభిమానం పైనా, మానం పైనా అనుమానం ప్రకటించిన ఇలాంటి కుక్కలకు ఏ న్యాయస్థానంలో ఎలాంటి శిక్షవేస్తే వాడి బుద్ధి మారుతుంది??

ఇప్పటి పరిస్థితుల్లో ఇన్ని అవమానాలు భరించి తన జీవితాన్ని నాశనం చేసుకుని అమ్మాయి బతుకుతుంది అంటే కుటుంబగౌరవం కాపాడాలన్న తాపత్రయం అయ్యుండొచ్చు. పిల్లల్ని అనాథలుగా వదిలివెళ్లే ధైర్యంలేక అయ్యుండొచ్చు. కానీ అదే సహనాన్ని పదే పదే పరీక్షపెడితే చివరికి కొంతకాలానికి అబ్బాయిలపైన ఆసిడ్ దాడి అనే వార్త వినాల్సివస్తుంది. ఈ పురుషాహంకార సమాజంలో బతుకుతున్నందుకు తలదించుకుంటున్నాను.ఈ అభిప్రాయం కలగడానికి నా జీవితంలో ఎదురైన సంఘటనలు కారణం. తప్పులు అందరూ చేస్తారు. కానీ కొంతమంది వాటిని సరిదిద్దుకుని జీవితంలో ముందుకెళ్తారు. కొంతమందికి ఆ ధైర్యంలేక ప్రాణాన్ని వదిలేసుకుంటారు. అలా ప్రాణాలను బలి తీసుకోవాలన్నంత బాధపెట్టి వాళ్ల చావుకి కారణమైన ప్రతిఒక్కరికి దేవుడి చేతిలో అంతకంటే పెద్ద శిక్ష పడుతుందనే ఆశతో....

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com16tag:blogger.com,1999:blog-4190422837205224407.post-83648299880163167602013-01-25T13:04:00.000+05:302013-01-25T13:04:09.698+05:30Live for Today

These are just some inspiring words and not written by me actually. I like words told here. It will be very helpful if we able to follow these words and need to be reminded in difficulties which makes us little sad and leave pain in heart. So here I am sharing with you...

There are two days in every week about which we should not worry.

Two days which should be kept free from fear and apprehension.

One of these days is yesterday with its mistakes and cares,
Its faults and blunders, Its aches and pains.
Yesterday has passed forever beyond our control.
All the money in the world cannot bring back yesterday.
We cannot undo a single act we performed.
We cannot erase a single word we said. Yesterday is gone.

The other day we should not worry about is tomorrow.
With its possible adversities, Its burdens,
Its large promise and poor performance.
Tomorrow is also beyond our immediate control.
Tomorrow's Sun will rise, either in splendor or behind a mask of<o:p></o:p>

clouds, but it will rise.

Until it does, we have no stake in tomorrow, for it is yet unborn.<o:p></o:p>

This just leaves only one day . . . Today.
Any person can fight the battles of just one day.
It is only when you and I add the burdens of those two <o:p></o:p>

awful eternity's - yesterday and tomorrow that we break down.<o:p></o:p>

It is not the experience of today that drives people mad.
It is the remorse or bitterness for something which happened <o:p></o:p>

yesterday and the dread of what tomorrow may bring.<o:p></o:p>

Let us therefore live but one day at a time.

Forget worries done in the past and dont get depressed by your future, that is out of our control.

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com5tag:blogger.com,1999:blog-4190422837205224407.post-70865097948294951672013-01-14T14:49:00.001+05:302013-06-08T23:12:16.909+05:30మా లోగిలిలో సంక్రాంతి

ఈరోజు సంక్రాంతి మా లోగిలిలో ఇలా సందడి చేసింది. మా అమ్మ మాకు ఇచ్చిన ప్రశంస.. ఎంతసేపు ఆ లాప్టాప్

ముందు కూర్చోకపోతే కొంచెం మంచిది సాధన చేసి వేస్తే బాగుండేదేమో అని .. :P

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. :)

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com7tag:blogger.com,1999:blog-4190422837205224407.post-6604461674544085862013-01-04T16:48:00.000+05:302013-06-08T23:05:47.933+05:30నా ఆలోచనలు మాత్రమే

జీవితంలో బాగా స్థిరపడి మంచి ఉద్యోగంలో చేరి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లి,తండ్రి వాళ్ల పిల్లలకు చిన్నప్పటి నుంచి నూరిపోసే మాటలు ఇవి. చిన్నప్పుడు బాగా చదివి, మంచి

మార్కులు తెచ్చుకుని కష్టపడి పై చదువులు చదివి తప్పటడుగు వేయబోయిన ప్రతిసారి అమ్మ,నాన్నల

శ్రమను, మన పైన ఉన్న కొండంతటి ఆశల్ని గుర్తు తెచ్చుకుని మళ్లీ మనసుని నియంత్రించుకుని సరైన

మార్గంలో నడుస్తూ సాగిస్తున్న ఈ జీవన ప్రయాణంలో నేను ఎదుర్కొన్న అనుభవాలు...

అందవిహీనంగా ఉంటానని, చక్కని మాటలు పలుకుతున్నా నా గొంతుక మధురమైన

కోయిల పాటలా కాకుండా గార్ధభస్వరమని నా బాల్యంలో తోటి విద్యార్థులు చేసిన అవహేళన తలుచుకుని

అప్పటి నుండి ఇంకెవరితోనూ కలవకుండా, నా గొంతుక నుంచి మాట పెగల్చకుండా ఒంటరిగా ఆ పసి మనసు తల్లడిల్లితే దానిని ఎలా ఊరడించాలో తెలియక ఎందుకు నాకీ పుట్టుక అని అనిపించిన క్షణాన్ని నా మనసు

నుంచి ఎవరు చెరిపేయగలరు?? ఒక్క నా మరణం తప్ప!!! అప్పటి నా పసిమనసుకి అర్థమైన విషయం ఈ

లోకంలో బ్రతకడానికి కావాల్సిన అర్హతల్లో ముఖ్యమైనది.. అందమని!!

చదువులో ఎంత ముందంజ వేసినా సాటి విద్యార్థుల నుంచి వచ్చే అవహేళనలు, చీత్కారాలు..

నా హృదయాన్ని అమితంగా గాయపరిచాయి. పాతబడిన దుస్తుల్ని చూసి అవహేళనగా అరుస్తూ నా పేదరికాన్ని వెక్కిరించిన వాళ్ల సౌభాగ్యానికి బాధపడాలో, లేదంటే అమ్మని వెళ్లి ఎందుకు రోజు ఇంత పాతబడిన బట్టల్ని వేసుకుంటున్నానని అడగాలో తెలీదు. అసలు మేము అలాంటి పరిస్థితుల్లో ఎందుకు బతుకుతున్నామో నిజంగా తెలియకుండానే నా బాల్యం గడిచింది.

ఇన్ని బాధల మధ్య నాకు తెలిసింది ఒక్కటే, చదవాలి అని!! చదివితే ఉద్యోగం

వస్తుంది,మంచి పేరు వస్తుంది. నేను అందంగా లేకపోయినా, నా స్వరం బాగోకపోయినా నన్ను అందరూ

గౌరవంగా చూస్తారు అనే ఒక గుడ్డి నమ్మకంతో చదివాను. ఇప్పుడు నన్ను చూసి మొహం పైనే ఎవరూ

మాటలు అని నన్ను కించపరచకపొయినా వెనకాల ఇంకా అవహేళనలు ఉన్నాయి. కానీ అవన్నీ

మనసులో ఒక న్యూనతా భావాన్ని బలపరిచాయి.

ఇంక కాలేజి స్నేహాలు దాదాపు డబ్బుతో ముడిపడి అప్పటి దాకా తెలియని ఒక రంగుల

ప్రపంచం.ఇలా కాలేజిలో మాటి మాటికి జరిగే అట్టహాసంగా జరిగే పార్టీలకు వెళ్లకుండా ఉండేది, పొగరుతో

కాదని ఆ ఒక్క పార్టీకి ఇచ్చే డబ్బుకోసం అమ్మ,నాన్న ఎంత కష్టపడతారో చెప్పి వాళ్ల జాలి మాటలు

వినడం ఇష్టంలేక ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకు తిరిగేదాన్ని. దాన్ని వాళ్లంతా

ఎవరితో కలవడానికి ఇష్టపడని ఒక వింతజీవిగా భావించి మెల్లిగా ఇలాంటి విషయాల్లో నన్ను అడగడమే

మానేశారు. జీవితం నేర్పిన మరొక పాఠం నాకు, నా స్నేహితులకు మధ్య స్నేహం మనుగడకు

కావల్సినది డబ్బు అని ...

అందుకే స్నేహం ఏది ఆశించదు అన్న మాట విన్న ప్రతిసారి అదొక అతిశయోక్తిగా అనిపిస్తుంది.

కొంతమంది నన్ను తక్కువచేసి మాట్లాడి వాళ్ల స్నేహితుల ముందు నన్ను చిన్నబుచ్చిన సందర్భాలు

ఎన్నో.. అందుకే ఒకరితో స్నేహానికి వందసార్లు ఆలోచిస్తాను.. వాళ్ల జీవితంలో నేను వాళ్లకి సముద్రంలో

ఒక చిన్న నీటిబొట్టే కావొచ్చు, కానీ వారి స్నేహం నా జీవితానికి చాలా ముఖ్యమైనదని నాకు మాత్రమే

తెలుసు. స్నేహానికి కూడా పరపతి కావాలనే మనుషుల మధ్య ఉన్న నాకు నా స్నేహంకోసం చేతులు

చాచే ప్రతిఒక్కరిని చూస్తే చాలా అబ్బురంగా ఉంటుంది. కానీ మనసులో ఒక చిన్న ఆందోళన కుడా.. నా

నుంచి వీళ్లు నిజంగానే ఏమి ఆశించట్లేదా అని? నిజజీవితంలోనే నాకు దొరకని స్నేహం ఇక

ముఖపుస్తకంలో, జి-మెయిల్ లో ఇచ్చే స్నేహాల్లో ఉంటుందని నేను నమ్మను ఖచ్చితంగా. అటువంటి

స్నేహాలు మళ్లీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్న తర్వాత కొనసాగుతాయన్న నమ్మకం నాకు లేదు.

నా జీవితం నాకు నేర్పిన పాఠం ఎవరితోనైనా ఎంత తొందరగా దగ్గరైతే, అంత తొందరగానే విడిపోతానని..

కొంతమంది వాళ్లకు నచ్చినట్టుగా నేను మారాలని ఆశిస్తారు. నన్ను నన్నుగా ఎందుకు స్వీకరించరో

అర్థం కాదు నాతో స్నేహమే ముఖ్యమైనపుడు. మొహం పైనే నచ్చని విషయాన్ని చెప్పకుండా వారి

వెనకాల దొంగచాటుగా నవ్వడం ఎంత వరకు కరెక్టో నాకర్థం కాదు.

నా జ్ఞాపకాల తుట్టను కదిపితే కదిలిన తేనెలాంటి మధురమైన నా జీవితానుభవాలు.. అవెంత

మధురమో నా కంటి కనుపాప నుంచి జాలువారిన అశ్రువులు చెబుతున్నాయి..

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com11tag:blogger.com,1999:blog-4190422837205224407.post-3099065775458495812012-12-31T16:34:00.000+05:302013-06-08T23:12:44.507+05:30న్యూఇయర్ ఙ్ఞాపకాలు

నాకు ఊహ తెలిసనప్పటినుంచి జనవరి ఒకటో తారీఖు హడావుడి దీపావళి పండగ అవగానే మొదలయ్యేది. అప్పట్లో పావలాకు హీరోలు, హీరోయిన్ల, బాల నటీ,నటులు, పూవులు, ప్రకృతి ఫోటోలుగా గ్రీటింగ్ కార్డులు దొరికేవి. ఇంట్లో అమ్మ ఇచ్చిన అర్ధరూపాయి, రూపాయి కూడబెట్టి ఈ గ్రీటింగ్ కార్డులు కొనుక్కునేవాళ్ళం. నేను రెండు,మూడు తరగతులు చదివేటప్పుడు మాత్రం అన్నయ్యవాళ్లు మమ్మల్ని తీసుకెళ్లి కొనిపెట్టేవాళ్లు రెండు,మూడు షీట్లు.ఒక్కొక్క షీటుకి తొమ్మిది కార్డులు ఉండేవి.

అసలు అదంతా ఒక పండగలాగా ఉండేది. బడిలో పిల్లలంతా డిసెంబర్ నెల మొత్తం నువ్వు ఎలాంటి కార్డులు కొంటున్నావ్? నీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయి అని ఒకటే హడావుడి. కొంతమంది ముందుగానే వాళ్లతో ఉన్న ఫోటోలన్నీ చూపించి నీకు ఏది కావాలో అదే ఇస్తాను అని చెప్పేవాళ్లు. మళ్లీ అది ఇంకొకరు ఎంచుకోకుండా దాని వెనక పేరు వ్రాసి ఒకరి కోసం దాన్ని ముందుగానే రిజర్వు చేసేవారు :D.మేము ఎక్కువగా బేబి శ్యామిలి ఫోటోలు కొనేవాళ్లo. ఇక అబ్బాయిల కోసం హీరోల ఫోటోలు, టీచర్ల కోసం పూవుల ఫోటోలు కొనేవాళ్ళం. ఏ ఒక్కరికీ రెండు ఒకే ఫోటోలు రాకుండా జాగ్రత్త పడేవాళ్లం. కొంతమంది ముందుగానే గ్రీటింగ్ కార్డ్ వెనకాల పేరు వ్రాయించుకోకుండా తీసుకునేవారు. ఇంకొక సంవత్సరం ఇంకొకరికి ఇవ్వొచ్చు అనే ఆలోచనతో.:P నచ్చినా, నచ్చకపోయినా ఎలాంటి కల్మషం లేకుండా, లేనిపోని మొహమాటాలకు పోకుండా ఒకరికొకరు మొహం పైనే చెప్పేసుకుని నచ్చింది ఇచ్చి పుచ్చుకునే వాళ్లం. స్కూలికి కొత్త డ్రెస్ వేసుకుని చాక్లెట్లు ఒక పర్సులో వేసుకుని చాలా ఉత్సాహంగా వెళ్లేవాళ్లం. ఇష్టమైన వాళ్లకేమో రెండు చాక్లెట్లు, అందరికీ ఒక్కొక్కటి.స్కూలికి ఎవరైనా రాకపోతే వాళ్ల ఇంటికి వెళ్లి మరీ గ్రీటింగ్ కార్డు ఇచ్చేవాళ్ళం.

డిసెంబర్ 31 వ తేది రాత్రి మా ఇంట్లో అందరి భోజనాలు తొమ్మిది గంటలకల్లా అయిపోయేవి. తొమ్మిది గంటలకే ఇంటి ముందు అమ్మ ముగ్గు మొదలుపెట్టేది . అంతకు ఒక వారం ముందు రోజుల నుంచి అమ్మ ఒక పెద్ద ముగ్గు బాగా సాధన చేసి తను ముగ్గుపిండితో ముగ్గు వేస్తే వాటికి రంగులు మేము నింపేవాళ్లం. ఎవరింటి ముందు ఎంత పెద్ద ముగ్గు ఉంటే అంత గొప్ప. రంగులు నింపిన తర్వాత మళ్లీ అమ్మ ఇంకోసారి చుట్టూ బయట outline వేసేది. అంత చలిలో అందరూ స్వెట్టర్లు వేసుకుని ఏ రంగులు ఎక్కడ నింపాలి అని గొడవపడుతూ, మధ్యలో అమ్మ నేను చెప్పిన రంగే వేయాలి అంటే అక్క వినట్లేదు అని విసిగిస్తుంటే అమ్మ మా అల్లరి భరించలేక కోప్పడుతూ.. భలే సందడిగా ఉండేది. రాత్రి 10 అయితే చాలు!!దుప్పట్లో దూరి సందడి సద్దుమణిగిపోయే మా ఊరు ఆ రోజు మాత్రం 12 అయితే కానీ రాత్రి అయినట్టు కాదనేది.

ఇక ఇంట్లో సందడి చెప్పకర్లేదు. నాన్నగారు తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే స్నేహితుల కోసం ముందుగానే కేకు తెప్పించేవారు. అమ్మ చేత అందరికి ఫలాహారం చేయించేవారు. వాటిని అందరికి వడ్డించే బాధ్యత నాది, మా అక్కది. వచ్చే జనాలతో ఇల్లంతా హడావుడిగా ఉండేది.

ఈ సందడిని గత తొమ్మిది సంవత్సరాలుగా నేను కోల్పోతున్నాను.అందుకే నా newyear resolution ఏంటంటే ఈ సంవత్సరం అనవసరంగా ఎప్పుడుపడితే అప్పుడు సెలవలు తీసుకుని ఇంటికి వెళ్లకుండా ఒకేసారి క్రిస్మస్ పండగ నుంచి కొత్తసంవత్సరం రోజు వరకు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను.మీకు కూడా నా ఆలోచన నచ్చిందా?? అయితే మీరు కూడా ఫాలో అయిపోండి. ఈ ఐడియా ఏ మాత్రం బెడిసికొట్టినా నన్ను మాత్రం బాధ్యురాలిని చేయకండి. :P

ఈ సంవత్సరంలోనే నేను ఈ బ్లాగును మొదలుపెట్టాను.మొదలుపెట్టినప్పటి నుంచి నా ఆశ, శ్వాస ఇదేగా కాలాన్ని గడిపేస్తున్నాను. నాకు అప్పటికప్పుడు వచ్చిన దుఃఖాన్ని,సంతోషాన్ని అన్నిటినీ నాతో పంచుకుంటూ నన్నింతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు. చాలామంది స్నేహితులని ఈ బ్లాగువల్ల కలుసుకున్నాను. నాకొక కొత్త ప్రపంచాన్ని చూపిన మీ అందరికీ ఈ సంవత్సరం అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.మరీ అత్యాశ అంటారా!!! అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

<left></left>

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com22tag:blogger.com,1999:blog-4190422837205224407.post-89521144104890872012-12-27T15:01:00.000+05:302013-06-08T23:06:24.893+05:30నేటి ప్రేమ-పెళ్లి

ఈ టపాలోని మాటలు కేవలం నా అభిప్రాయాలు మాత్రమే.. ఎవ్వరిని నొప్పించడానికి వ్రాసినవి కావు. ఎవ్వరూ దీనిని పర్సనల్ గా తీసుకోకూడదని మనవి. ఎవ్వరినైనా నొప్పిస్తే క్షమించాలి.

ఈరోజుల్లో అందరికీ మంచి చదువు, ఉద్యోగాలు ఉండటంతో చాలా మంది తమ స్వంత అభిప్రాయాలకే ఓటు వేస్తున్నారు. ఇలా సొంత అభిప్రాయం అన్నది ఎక్కువగా పెళ్లి అనే విషయంలో చూపిస్తున్నారు.

ఈ పెళ్లి అనే విషయంలో అమ్మాయిలు అబ్బాయిలని ఎలా ఎంచుకుంటారు అంటే ఎక్కువగా వాళ్ల క్లాస్మేట్స్ అయ్యుంటారు. వాళ్లతో గౌరవంగా మాట్లాడేవారు, సౌమ్యులు అయిన వారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. అదే అబ్బాయిలు అయితే మొదట అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇది నేను తప్పు అని

చెప్పను. ఎందుకంటే మొదటి చూపులోనే కంటికి కనిపించేది అందమే కాని మనసు కాదు కాబట్టి. అబ్బాయిలకి వాళ్ల క్లాసు అమ్మాయిలతో పాటు ఇంకా వాళ్ల కన్నా తక్కువ క్లాసు అమ్మాయిలని ఎంచుకునే అవకాశం ఉంటుంది.ఈ మధ్యకాలంలో కాలేజీలో చేరిన వెంటనే జూనియర్స్ కోసం సీనియర్స్ ఒక వెల్కం పార్టీ ఏర్పాటు చేస్తారు. ఇలాంటి వాటిలో ఎవరికి ఎవరు అని నిశ్చయం చేసుకుంటారు సీనియర్స్. వీటిలో కడదాకా మిగిలే బంధాలు కొన్నే ఉంటాయి. అప్పటికప్పుడు జీవితం గురించి ఎటువంటి అవగాహన, ప్రణాళికా లేకుండా వేసే మొదటి తప్పటడుగు. అన్నీ తప్పటడుగులే ఉండకపోవచ్చు.. ఏడడుగులు వేసే ప్రేమలు ఉండొచ్చు.

అందరికి ఒక "అదర్ సైడ్" ఉంటుంది. ఇది పరిచయం మొదట్లో అంతగా బయటపడదు, కాబట్టి పరిచయంలో కొత్తగా ఇద్దరి వైపు నుంచి సర్దుకుపోయే తత్త్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. పరిచయం పెరిగిన తర్వాత ఒకరి లోపాలు ఇంకొకరికి కనపడతాయి. ఇద్దరు ఎప్పుడూ వాటి గురించే గొడవ పడటం ప్రారంభమవుతుంది. బొమ్మరిల్లు సినిమాలో లాగా ఇది వరకు మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు. ఇప్పుడు కేవలం తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు అని జెనిలియా బాధపడుతుంది. ఇద్దరి మధ్య పరిచయం పెరగడం వల్ల ఒకరి లోపాలు ఇంకొకరికి తెలియడం వల్ల గొడవలు పెరుగుతాయా? తగ్గుతాయా?

ఈ మధ్యకాలంలో ప్రేమ అనే మాట అందరి నోళ్లలో నానుతోంది. కాలేజిలో ఈ ప్రేమ అనేది మొదలై అది జీవితాంతం తోడుగా ఉండే బంధంగా మారడానికి ఎన్నో అడ్డంకులు. చదువుకునేటప్పుడు దూరం తెలియకపోవడం వల్ల కొంతమంది ఉద్యోగాలు వచ్చి వేరు వేరు ఊర్లలో ఉండాల్సివస్తే ఆ ఉద్యోగం మానలేరు, అలా అని ఈ బంధాన్ని వదులుకోనూలేరు. ఇక్కడ వాళ్లు పడే మానసిక సంఘర్షణ అంత,ఇంతా కాదు. కొంతమందికి దానిని స్పోర్టివ్ గా తీసుకుని ముందుకు సాగే మానసిక పరిణతి ఉండదు.

ఉద్యోగాల్లో చేరిన తర్వాత మళ్లీ కొత్త పరిచయాలు మొదలవుతాయి. ఇక అప్పుడు ఇప్పటిదాకా ఒకే కాలేజీ ప్రపంచంలో ఉన్నవాళ్లు రెండు రెండు వేర్వేరు ప్రపంచాల్లో ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది పని వల్ల ఒకరు ఇంకొకర్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని అనుకుంటారు.ఇంకొంతమంది అనుకుంటారు ఉద్యోగమే కదా ముఖ్యము ప్రేమ కన్నా అని. కాదని అనట్లేదు కానీ జీవితాంతం తోడుగా ఉండాలనుకున్న వ్యక్తితో రోజుకు రెండు నిముషాలు కూడా ఖర్చు చేసేంత తీరిక లేకుండా ఉంటారా? అయినా అంతకు ముందు ఎన్నో నిముషాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుని ఉంటారు. ఒకరి పట్ల నిర్లక్ష్యధోరణి వహించకూడదు."take for granted" అని అనుకోవడం తగదు. పెళ్లికి ముందే ఇలాంటి ధోరణి అసలు పనికిరాదు. పెళ్లికి తర్వాత ఉండొచ్చా??అంటే అది వారి అవగాహన మీద ఆధారపడుతుంది. ప్రేమలో విఫలమైనా ఆ ఇద్దరి వ్యక్తులకి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ పెళ్లిలో విఫలమైతే అది జీవితాంతం ఒక మచ్చగా మిగిలిపోతుంది.ప్రేమ స్థానంలో నిర్లక్ష్యం కనిపిస్తుందంటే ఆ బంధం కడదాకా కొనసాగుతుందనేనా??

అన్ని అడ్డంకులలోకి మొదటిది, ఇద్దరిని సులభంగా వేరు చేసేది అహం(ఇగో). ఇది ఎక్కువగా ఉద్యోగం చేసే వాళ్లలో ఆడ,మగ అని తేడా లేకుండా ఉంటుంది. లోకజ్ఞానానికి అనులోమానుపాతంగా(proportional) ఈ అహం అనేది పెరుగుతుందేమో అని నా అభిప్రాయం. ఏమీ చదువుకోని ఒక పల్లెపడుచు తన మగనితో నీ చేత నేను మాటలు ఎందుకు పడాలి అని అనగలదా?? అహాన్నీ మనం అదుపు చేయలేమా? ప్రతిదానికి ఇంకొకరు మన పైనే ఆధారపడి బతుకుతున్నారు అనే భావన ఉండకూడదు. ఒకసారి ఎవరో ఒకరు సర్దుకుని మొదట రాజీకి వస్తే, ఇక జీవితాంతం తనే రాజీకొస్తారులే అని ఆలోచించకూడదు. ఏది జరిగినా అంతా నీ తప్పు వల్లే జరిగింది అంటూ ప్రతిసారీ పరనింద తగదు. అప్పుడప్పుడూ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోవాలి తప్పు మనవైపు ఉందా?లేదా? అని. ఆవేశంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడటం కన్నా మౌనం వహించడమే ఉత్తమం. మనకు ఒకరితో స్నేహమే ముఖ్యమైతే చొరవ తీసుకుని బంధం బీటలు వారకుండా చూసుకోవాలి.

ఇద్దరూ కలిసి జీవించాలి అని అనుకున్నప్పుడు వాళ్ల కుటుంబం సహాయం లేకుండా పెళ్లి అనే

మధురఘట్టాన్ని చేరుకోవడానికి ఇప్పటి యువత సుముఖంగా లేదు. మొదట ఇక్కడ అడ్డంకి కులం. ఇప్పటికీ పల్లెటూర్లలో అగ్రకులాలవారు నిమ్నకులాలవారిని పెళ్లి చేసుకుంటే వాళ్లను వెలివేసి దూరంగా ఉంచుతారు.జీవితాంతం ఇద్దరు తోడుగా ఉండాలంటే కులమే ముఖ్యమా?ఒకవ్యక్తి తన కులంవాళ్లని పెళ్లిచేసుకుంటే తప్ప సంతోషంగా జీవించలేరా?? ఈ కట్టుబాట్లు అనేవి మనిషి మృగం రూపం దాల్చకుండా ఉండటానికి తప్ప జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడానికి కాదని నా అభిప్రాయం. చాలామంది ఈ కులం బారినపడి విడిపోతున్నారు ఈ మధ్య కాలంలో.

అలా విడిపోయిన వారు జీవితాంతం తమ భాగస్వామితో ఎలాంటి అపరాధభావన లేకుండా ఉండగలరా? తరువాతి జీవితాన్ని సంతోషంగా గడపగలరా??

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com13tag:blogger.com,1999:blog-4190422837205224407.post-26892676941451072172012-12-16T20:49:00.001+05:302013-06-08T23:09:27.818+05:30నా ప్రేమకథ

అసలు నువ్వు అంటే నాకెంత ఇష్టమో తెలుసా..? తన పైన ఉన్న ఇష్టాన్ని మీ అందరికి చెపుదామనే ఈ టపా..

తన గురించి అందరు మాట్లాడుకుంటుంటే వినడమే తప్ప తనని దగ్గరగా చూసింది లేదు.. నాకు తెలిసినంత వరకు తనకు టెక్నికల్ విషయాలు బాగా తెలుసు..ఎందుకంటే అప్పుడప్పుడు తన సహాయం తీసుకున్నా కానీ అప్పటికప్పుడు తన సహాయానికి ఒక చిన్న థాంక్స్ చెప్పి నా పని నేను చూసుకుని మళ్లీ తనను అసలు చూసేదాన్నే కాదు. పరిచయం లేని కొత్తలో ఇంకొకరి ద్వారా తన నుంచి సహాయం అందేది.:)

తను కేవలం ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతాడేమో అని తనకి అస్సలు తెలుగు తెలియదేమో అని అనుకున్నాను.. కానీ తనకు తెలుగు కూడా తెలుసని నాకు తెలిసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపడి తనతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించాను, కానీ మనసులో చిన్న బెరుకు.. మొదట పొడి పొడి మాటలతో మా పరిచయం మొదలైంది. తనంటే నాకు చాలా ఇష్టం అని నాకు తెలుసు.. కానీ తనతో ఎలా చెప్పాలో తెలియని ఒక చిన్న గందరగోళం మనసులో.. కానీ తనేమో తనకి ఈ విషయమే పట్టనట్టు నాతో మాములుగానే ఉండేవాడు. కొద్దిరోజులు బానే ఉంది.. పరిచయంలో ఎలాంటి కలతలు లేవు..ప్రయాణం సాఫీగా సాగుతోందీ..

కానీ నా మనసులో మాట చెప్పకుండా తన నుంచి తప్పించుకు తిరగలేక ఒకరోజు నేను చెప్పేసాను.. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం..ఇప్పట్నుంచి నా జీవితంలో నువ్వు కూడా ఒక భాగమేనని.. చెప్పిన వెంటనే నా ప్రతిపాదనని ఒప్పుకోకపొయినా మరీ అంతగా నన్ను ఇబ్బంది పెట్టలేదు.. ఒక చిన్న ముద్దుపేరు పెట్టమని అడిగాడు..ఆ మాత్రానికే నేను తెగ సంబరపడి బాగా ముద్దుపేర్లు ఏముంటాయా అని చించి ఒక 10,20 పేర్లు చెపితే ఒకపేరు బావుందని అన్నాడు..హమ్మయ్యా!!సంతోషం అనుకుని ఇంక తన ప్రేమ గెలుచుకున్నందుకు ఏనుగు ఎక్కినంత సంబరపడ్డాను.

అది మొదలు.. నాకు తెలిసిన ప్రతి విషయం తనతో చెప్పుకోవడం ఒక అలవాటు అయ్యింది.. మొదట్లో తనను రోజుకొకసారి కూడా చూడాలనిపించేది కాదు.. రాను, రానూ తనని రోజుకోక వంద సార్లు తలుచుకుంటున్నాను.. ఆఫీసులో ఎవరూ చూడకుండా తనని దొంగచాటుగా చూసేదాన్ని. తన నుంచి కూడా అలాంటి అభిమానమే కనిపించింది నాకు. ఒక్కొక్కసారి తనతో మాటల్లో మునిగితే అసలు సమయమే తెలిసేది కాదు.. అంతగా నాకు కబుర్లు చెప్తాడు..అందుకే ఎక్కువగా పని ఉన్నప్పుడు నేను తన దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా తప్పించుకు తిరుగుతాను:) మీరలా దుర్మార్గులారా అని నన్ను తిట్టేసుకోకూడదు.. తప్పదు మరి, ఇలాంటి విరహం అనుభవించాల్సిందే.. మీరే ఒప్పుకుంటారు నా మాటే సరైనదని నా మాటలు పూర్తిగా విన్న తర్వాత..:) ఇంకా తన వల్ల చాలా సార్లు ఆఫీసులో ఉండిపోవాల్సి వచ్చేది ఒక్కొక్కసారి తను చెప్పే ఊసులు వినడానికి.. తను కూడా నా మాటలన్నీ శ్రద్ధగా వినేవాడు.

తన గురించి ఒక కవిత (తవిక) మీ కోసం

నా ఏడుపుకి తను ఒక ఓదార్పు,

నా సంతోషానికి తను ఒక చిరునవ్వు,

నా భయానికి తను ఒక ధైర్యం,

నా విజయానికి తను ఒక కారణం,

నా అపజయంలో తను ఒక భరోసా..

నేనే తను.. తనే నేను...

ఒక్కొక్కసారి నేను బస్సు కోసం స్టాపులో ఎదురు చూస్తున్నప్పుడు తనను పొరపాటున నా ఫోనులో పలకరిస్తే ఇంకా తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయేదాన్ని. అలా తనతో మాట్లాడుతూ ఒక్కొక్కసారి మూడుగంటల పైనే గడిపేసిన క్షణాలు ఉన్నాయి. తనతో రాత్రంతా కబుర్లు చెప్తూ ఆఫీసులో కునికిపాట్లు తీసిన సందర్భాలెన్నో..ఒక్కొక్కసారి దారిలో నడిచేటప్పుడు తన చెప్పిన ఒక అభినందనకరమైన ప్రశంసను ఫోనులో చూసుకుంటూ మురిసిపోయి ఏమరపాటుగా ఏ వాహనానికో అడ్డుగా పోయి చివాట్లు పెట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా తనని వదిలిపెట్టలేనంతగా తనకి నేను అలవాటు పడిపోయాను. తన వల్ల నాకు ఇంకా మంచి మంచి స్నేహితులు దొరికారు. నాకంటూ ఉన్న ప్రపంచం నుంచి నాలో మరుగునపడిపోతున్న ఒక గొప్ప లక్షణాన్ని బయటికి తీసి నాకు నన్నే కొత్తగా పరిచయం చేశాడు. తన పరిచయం, తనతో పాటు వచ్చిన కొత్తప్రపంచం నాకు కొత్తగా, హాయిగా, సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు తన వ్యసనం నుంచి బయటపడాలని అనుకుంటున్నా కూడా.. అలా తన ప్రేమని వదిలి ఉండలేకపోతున్నాను. తను నా జీవితంలో భాగంగానే నాతో పాటు జీవన ప్రయాణం చేస్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత మీకు తనని పరిచయం చేయకపోతే మీరు నన్ను తిట్టేసుకుంటారు.. నాకు తెలుసండి.. ఇంతగా నను మురిపించింది ఇంకెవరు?? ఇదే నా ప్రేమ (నా బ్లాగు )

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com25tag:blogger.com,1999:blog-4190422837205224407.post-89645815433432656122012-12-12T12:12:00.000+05:302013-06-08T23:22:53.089+05:30ఈరోజు(12-12-12)

ఈరోజు తేదీ ఏంటో అందరికి తెలుసు, నేను కూడా ఆతృతుగా నిన్న ఉదయం 12 గంటల వరకు మేలుకుందామనుకున్నాను కానీ, బాగా అలసిపోయి తొందరగా నిద్రపోయాను. ఇందాకా మా కొలీగ్‌తో మాటల మధ్యలో 12-12-12 12:12 కొంచెం ప్రత్యేకం కదా.. అని అనుకున్నాం.

మరి ఇంత ప్రత్యేకంగా ఉన్న క్షణాన ఏం చేసామో గుర్తుంటే బావుంటుంది కదా అని ఒక ఐడియా తట్టింది.. నాకు తట్టిన ఐడియాకు మనసులో నాకు నేనే మురిసి మేఘాల్లో తేలుతూ ఇలా ఒక పోస్ట్ రాసుకుని నా గుర్తుగా ఉంచుకుంటున్నాను.. ఎందుకంటే ఇంత కన్న ఏం చేయాలో తోచలేదు మరి.. కాబట్టి నేను ఈ క్షణాన్ని ఇలా బందించేసుకుంటున్నాను అన్న మాట. విదేశాల్లో ఉన్న వాళ్లు అలా నన్ను చూసి నవ్వకూడదు, ఇది మన భారతదేశ కాలమానంలో వ్రాస్తున్నది.. సో చదివిన తర్వాత మీరు కూడా నాలాగా ఒక టపా వ్రాసుకుని ఆ క్షణాన్ని బందించుకోండీ..

ఎందుకంటే ఇలాంటి రోజు మళ్లీ ఇప్పట్లొ వచ్చేటట్టు కనిపించట్లేదు..ఎందుకంటే 13-13-13 రావడానికి మనకో 13 నెల లేదు మరి..ఇంక 13-31 వరకు కూడా నెలలు లేవు కాబట్టి.. నాకు అలా అనిపించింది.. ఏంటో అమ్మాయి చాలా హడవుడి అంటారా..హ్హ్మ్మ్.. ఏమో ఈలోపల ప్రళయం వచ్చి అందరు దాంతోబాటు పోతే ఇంకేం చేస్తాం.. అయినా అదెలాగు జరగదంట మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారం అమావాస్య కూడా ఇంక రాలేదు...సముద్రాలలో సుడిగుండాలు లాంటివి ఏర్పడే అవకాశాలు కూడా లేవని చెప్పారు..మనిషి ఆశాజీవి అంటారుగా మరి!! అలాగే నేను కూడా..ఇప్పుడప్పుడే ప్రళయం వచ్చే సూచనలు లేవని అన్నారు.. ఇదండీ సంగతి.. నీకు బాగా పిచ్చి ముదిరింది అంటారా!!! కానీయండీ..కొంతమందికి ధనం పిచ్చి,కొంతమందికి పరువు పిచ్చి, ఇంకొంతమందికి పదవి పిచ్చి.. నీకు నీ మామ కూతురంటే పిచ్చి అని రజనీకాంత్(ఈ స్టారు పుట్టినరోజు కూడా ఈరోజే) గారు ముత్తు సినిమాలో ఒక డైలాగు చెప్తారు:P అలాగే నా బ్లాగు పిచ్చి కూడా :D అయినా నా పోస్ట్ పబ్లిష్ చేసిన సమయం 12:12:12 12:12:):)

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com16tag:blogger.com,1999:blog-4190422837205224407.post-78571228816386560932012-12-08T13:19:00.000+05:302013-06-08T23:13:20.675+05:30ఆనంద హేల

నిన్న రాత్రి పది గంటలకు అక్క ఫోన్ చేసింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పరీక్షాఫలితాలు వచ్చాయి. కొంచెం చూడు అని.. నేను సైట్ తెరిచి చూసాను ఏం పెట్టారో చూద్దాము అని.. 316 మంది హాల్ టికెట్ల నంబర్లు పెట్టారు. మాకు హాల్ టికెట్ నంబర్ తెలీదు. తనేమో ఎటూ తేల్చని నీట్ పరీక్ష వ్రాయడానికి బెంగళూరు వెళ్లింది. తన హాల్ టికెట్ ఏమో నేను నా ఆఫీస్ డెస్క్టాపు మీద సేవ్ చేసాను. ఇంక చేసేదేమీలేక రాత్రి అలాగే నిద్రపోయాను. ఉదయాన్నే లేవగానే తను ఫోన్ చేసింది. ఆఫీసుకు వెళ్ళావా అని.. నేను అప్పుడే కళ్లు నలుపుకుంటూ ఇప్పుడే లేచాను అని బద్ధకంగా చెప్పాను.

ఫలితాలు వచ్చాయి కదా అని గుర్తు చేసింది. నాకు కూడా గుర్తుంది కానీ ప్రభుత్వఉద్యోగం అంటే ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగి నిజంగా మెరిట్ చూపించిన వాళ్లకే ఇస్తారనే నమ్మకం నాకు లేకపోవడంతో నేను వెంటనే తొందరపడి చూడాలని అనుకోలేదు.ఈ వైద్యశాఖలో చాలా అవకతవకలు, మోసాలు జరుగుతాయని నాకు తెలుసు. దాని వల్ల ఎంతమంది విద్యార్థులు తమ జీవితాలను నష్టపోతున్నారో కూడా తెలుసు. ఎందుకంటే అక్క కూడా వాటి వల్ల నష్టపోయింది కాబట్టి. వాటి గురించి ఒక టపా వేద్దామనుకున్నాను కానీ మనం ఎంత గొంతు చించుకున్నా అవి పాలకుల చెవులకి ఎప్పటికీ వినిపించవు. హ్మ్మ్ ఇలా ఇన్ని ఆలోచనలు బుర్రలోకి వచ్చి ఇప్పుడు చూడటం అవసరమా అని అనిపించింది.

ఇంతలోపు ఇంకొకసారి తన నుంచి ఫోన్ "పోనీ, అమ్మని అడుగుదాము..తను చెప్తుంది కదా హాల్ టికెట్ నంబరు అని..". నేను వద్దు..ఇప్పుడు అంత హడావుడి ఏం చేయకు. నేనే ఆఫీస్ వెళ్లి చూస్తాను.ఒకవేళ రాకపోతే అమ్మవాళ్లు బాధపడతారు అని ఆఫీస్ కు వచ్చి చూసాను ఏమాత్రం తనకు ఉద్యోగం వచ్చిఉంటుంది అనే ఆశ లేకుండా.. హుర్రే!!! తనకి ఉద్యోగo వచ్చింది.. తనకి వెంటనే ఫోన్ చేసి చెప్పాను. ఇంక ఎక్కడో మెరిట్ మీదే ప్రభుత్వఉద్యోగాలు ఇస్తున్నారు అని ఆనందపడిపోతున్నాను.

నిజంగా నా జీవితంలో ఇదొక సంతోషకరమైనవార్త. తనలో తాను బాధపడుతున్న అక్కకు ఒక పెద్ద ఊరట. తను పడ్డ శ్రమకు దొరికిన ఫలితం.ఈ ఆనంద హేల మీ అందరితో పంచుకోవాలని ఇలా వచ్చాను.. మా తరుపున మీకు కమ్మని పాయసం ఇదిగో...

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com26tag:blogger.com,1999:blog-4190422837205224407.post-20952328031515381802012-12-05T22:22:00.002+05:302013-06-08T05:33:27.259+05:30సి(చి)ల్లీ సంఘటన

సుజిత, సంకేత్ ఇద్దరూ భార్యభర్తలు. మధ్యతరగతి జీవితాలను అనుభవించి హైకులు, ప్రమోషన్లతో తమ కోర్కెల చిట్టాను నెరవేర్చుకునే రోజు ఎప్పుడొస్తుందా అని ఒక సగటు రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూసినట్టు వీళ్లు కూడా అంతే ధైన్యంగా బతుకులు రెండు డెస్క్‌టాపులు, రెండు లాప్‌టాప్‌లతో వెళ్లదీస్తున్నారు. ఇంత కన్నా ఎక్కువగా సాఫ్ట్వేర్ జీవితాల్లో మీరు ఆశించకూడదు. నేను చెప్పకూడదు. :D :D

పెళ్ళైనకొత్తలో ఒక పాట పాడు అని అడిగినందుకు సంకేత్ కు సుజిత సిగ్గుపడుతూ తల ఒంచుకుని "మరీ...మరీ.." అని నసుగుతున్న సుజిత వైపు eye మూలగా చూస్తూ "ఏం!పర్లేదు రా..నువ్వు ఏదైనా పాడు.." "సంకీ..I dont have battery in my ipod.." సంకేత్ వైపు నుంచి ఏ సమాధానం లేకపోవడంతో తలెత్తి "రేపట్నుంచి నీ కోసం charge చేసి పెడతాను. నీకు ఏ పాటలు ఇష్టమో చెబితే అవి డౌన్లోడ్ చేస్తాను" అని ఇచ్చిన సమాధానం బుర్ర తిరిగిపోయేటట్టు చేసింది. అదేమీ బయటపడనీయకుండా "అబ్బే..అదేం లేదు..సరదాగా అడిగాను" అని ఒక వెర్రి నవ్వు నవ్వాడు. మనసులో దేవుడా.. జానకిలా పాటలు పాడే అమ్మాయిని ఇవ్వమంటే ఇలా పాటలు వినిపిస్తాననే ఆధునిక సంగీత గాయనిమణిని నన్ను భార్యగా అంటగడతావా??

ఇలా రోజులు సాగుతున్నాయి.. వాళ్లకి కూడా ఏదో తెలియని అసంతృప్తి.. జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఏ కోశానా అనిపించట్లేదు. అయినా అలాగే సా..గిస్తున్నారు తమ జీవన పోరాటాన్ని.. వాళ్ల జీవితంలో నుంచి ఒక చిన్న సంఘటన...

ఒకరోజు సుజిత ఆఫీసులో ఉండగా సుజిత చిన్న తమ్ముడు అక్కకు ఫోన్ చేసి ఒక చిన్న సహాయం చేయవా అని అడిగాడు. దానికి సుజిత "చెప్పు రా.. ఏం కావాలి" అని అడిగింది. అక్క మా కాలేజిలో ఒక ఇండస్ట్రీ కోసం resume తయారు చేసుకోమన్నారు. అది నువ్వు చేసిపెట్టవా?? హ్మ్మ్.. అలాగే లేరా!! నేను ఇంటికి వెళ్ళిన వెంటనే చేసి నీకు పంపిస్తాను. అక్కా.. సాయంత్రం 4 గంటల లోపల ఇవ్వమని చెప్పారు. అవునా!!!సరే చేసి పంపిస్తానులే!!

"రేయ్.. చిన్నా!! నాకు ఇక్కడి నుంచి మెయిల్స్ వెళ్ళవు కదరా.."కొంచెం ఇబ్బందేరా.. నీకు మెయిల్ చేర్చడం.."

అక్కా !! పోనీ బావను అడగమంటావా.. అబ్బ.. భలే గుర్తుచేసావు రా.. నేనే ఆయనకు చెప్తాలే..నేను నీకు పంపిన తర్వాత ఫోన్ చేస్తాను..

సుజిత బాగా అలోచించి తన స్నేహితురాలికి మెయిల్ సౌకర్యం ఉందని తెలిసి తనకి విషయం చెప్పి సహాయం చేయమంది.

అదేంటంటే..సుజీ నేను నీ జిమెయిల్కి అయితే పంపగలను. మళ్లీ భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా అది నీ పర్సనల్ మెయిల్ ఐడియే కాబట్టి నేను అంత ఇబ్బంది పడక్కర్లేదు అని. సుజిత సరేలే అని తన స్నేహితురాలు చెప్పింది కూడా కరెక్టే కదా అని తన మెయిల్ ఐడీకే పంపమంది.

సంకేత్ కు ఫోన్ చేస్తే మొదటిసారి తన కాల్ కు సమాధానం ఇవ్వలేదు. మళ్లీ ప్రయత్నించింది. సంకేత్ ఫోన్ ఎత్తి ఏంటి విషయం అని అడగ్గా ఇలా ఒక మెయిల్ పంపాలి అని చెప్పే లోపల.. ఎవరి దాన్నుంచి అని విసుగ్గా అడిగాడు. సుజిత నా దాన్నుండే.. అని ఇంకా ఏదొ వివరించే లోపల సరే..సరే.. నాకు నీ మెయిల్ ఐడీ పాస్వర్డ్ నా మొబైల్‌కు మెసేజ్ పెట్టు అన్ని వివరంగా అని సుజిత మాటల్ని మధ్యలోనే తుంచి అవతలి వైపు కాల్ పెట్టేశాడు.

సుజిత అన్ని వివరంగా సంకేత్‌కు మెసేజ్ చేసి అప్పటి దాకా పడిన టెన్షన్ నుంచి బయటపడదామని భోజనానికి వెళ్లింది. భోజనం చేసి వచ్చి మళ్లీ ఆఫీసు పనిలో పడింది. సాయంత్రం 4కి మీటింగ్ రిక్వెస్ట్ చూసి సమయం నాలుగు అయ్యిందని ఒకసారి సంకేత్ ని విషయం కనుక్కుందామని మళ్లీ తనకి ఫోన్ కలిపింది. తనేమో ఫోన్ తీయట్లేదు. సరేలే అతను తన పనులతో తీరిక లేకుండా ఉన్నాడేమో అని ఇంకొక గంట వేచి చూసి ఫోన్ చేస్తే తన నుంచి ఏం సమాధానం లేదు. అరే!! ఈ మనిషికి నేనంటే ఎంత నిర్లక్ష్యం అని మనసులో అనుకుంది.రెండు సార్లు ప్రయత్నించి తన మీద ఆధారపడినందుకు తనని తనే నిందించుకుంటూ .. చీ..వెధవ జీవితం అనుకుంటూ ఈ తలనొప్పి తగ్గాలంటే ఒక కాఫీ తాగాలని కాంటీన్ వైపు అడుగులు వేసింది. స్నేహితులంతా కలిసి పిచ్చాపాటీ కబుర్లు చెప్పడంతో మళ్లీ కొంచెం మనసు తేలికపడి హాయిగా అనిపించింది.

కాంటీన్ నుంచి వస్తూ ఒకసారి మళ్లీ తన భర్తకు ఫోన్ కలిపింది. ఆశ్చర్యంగా ఈసారి ఫోన్ ఎత్తాడు.

ఆతురతగా పంపించారా ? నేను వివరంగా మెసేజ్ చేసాను కదా అని అడిగింది.

సంకేత్ కూల్ గా నాకు మెసేజ్ రాలేదు. నువ్వు ఇందాక నీ పాస్వర్డ్ ఫోనులో చెప్పలేదు కదా అని

చావు కబురు చల్లగా చెప్పాడు. ఈ మాటకు సుజితకు కోపం తలకెక్కి బుర్ర నుంచి నోటికి అది వ్యాపించింది. కానీ అది నోటి మాటల ద్వారా బయటపడకుండా జాగ్రత్తపడింది.

నేను నీకు 2.30 కే మెసేజ్ పెట్టాను అని సుజిత అంది.

అది నాకు రాలేదు మరి అన్నాడు నిర్లక్ష్య ధోరణిలో.

నేను మళ్లీ పంపిస్తాను అని తనకి మెసేజ్ పెట్టి తను లిఫ్ట్ లో పైకి వెళ్లి మళ్లీ సంకేత్ కి ఫోన్ కలిపి

విషయం కనుక్కుంది.

ఇప్పుడు వచ్చిందిలే. జిమెయిల్ తెరిచాను. పంపిస్తున్నాను.

నేను నీకు 4 సార్లు ఫోన్ చేసాను మధ్యలో పంపించావేమో కనుక్కుందామని అని సుజిత చెప్పింది.

నువ్వు మెయిల్ఐడీ చెప్పావు కానీ పాస్వర్డ్ చెప్పలేదు కదా!!!

ఇందాకా నేను పాస్వర్డ్ చెప్తానంటే మెసేజ్ పెట్టమన్నారు కదా..ఉన్న విషయం అడిగింది.

పెట్టినా నాకు రాలేదు అని అన్నాడు.

మీకు రాకపోతే నాకు మళ్లీ కాల్ చేసి అడగాల్సింది.ఇది చాలా అవసరం అని చిన్నా చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను అని అసలు కారణం వివరించింది.

అయినా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను అయినా ఏం చేయగలను అని విసుక్కున్నాడు.

ఇందాకా నేను చెప్పబోతే విసుక్కున్నారు. మెసేజ్ పెట్టమన్నారు. అయినా నేను కాల్ చేసినా మీరు తీయలేదు కొంచెం మొండిగా అదే విషయం చెప్పింది. ఇప్పుడేమో నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటున్నారు అని ఆవేశంగా చెప్పింది.

హేయ్!! కూల్ అని వెర్రిగా అన్నాడు. ఆ గొంతులో కొంపలేమీ మునగలేదన్న అర్థం ధ్వనించింది.

అయినా నాకే మెయిల్ ఆక్సెస్ ఉంటే మిమ్మల్ని ఇంతలా వేడుకునేదాన్ని కాదు. ఒక రెండు నిముషాల పనే కదా అని మిమ్మల్ని అడిగాను. లేకపోతే నేనే ఇంటికి వెళ్లిన తర్వాత తీరికగా చేసుకునేదాన్ని. అయినా నేను ఫోన్ చేసినప్పుడు మీరు కొంచెమైనా శాంతంగా విన్నారా??

అంత ముఖ్యమైన పనే అయితే నువ్వే చేసుకోవాల్సింది.

సుజిత ఆశ్చర్యపోయింది అనుకోకుండా సంకేత్ విసిరిన మాటల తూటాకి...తన పట్ల తను చూపించిన నిర్లక్ష్యానికి..

నేనే నీ స్థానంలో ఉంటే నా పని నేను చేసుకుంటాను సుజిత, నీలాగా ఇంకొకరు చేస్తారని మాత్రం ఎదురుచూడను అని దురుసుగా సమాధానం చెప్పాడు.

ఇంకా మాటలు కొనసాగించడం ఇష్టం లేక సుజిత ఫోన్ పెట్టేసింది.

తన మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది. ఇంత చిన్న విషయంలో తన సహాయం అడగడం తప్పు అని సంకేత్ అనుకుంటున్నాడా??..నేను నా పని తనని చేయమని ఇక్కడ నిశ్చింతగా నిద్రపోతున్నానా?? అయినా resume నేనే తయారుచేశాను. దాన్ని చిన్నాకు పంపించమని అడిగినందుకు ఎందుకు నన్ను ఇంతగా విసుక్కుంటున్నాడు.తనకి ఇష్టమైన వంటలు వండి బాధ్యతగా తనకి రోజు నేను పెడుతున్నా కూడా ఏరోజు తను నా పైన ఆధారపడి జీవిస్తున్నాడు అని నేను అనుకోలేదు. ఈ చిన్న విషయానికే తన పైన లేని భారాన్ని ఊహించుకుని నా పైన ఇంతగా విసుగు చూపడం ఏంటో అని చాలా బాధపడింది.ఇంక ఇలాంటి తప్పు మళ్లీ చేయకూడదని ఒక ధృడనిర్ణయం తీసుకుంది. అంటే తనని ఏ విషయంలో సహాయం అడగకూడదు. తనని కావాల్సిన సౌకర్యాలు నేను తనకు ఇవ్వాలే తప్ప తను నాకోసం అది చేయాలి,ఇది చేయాలి అని తన నుంచి ఏమీ ఆశించకూడదు.

ఈ కథ పై నా అభిప్రాయం:

అమ్మాయిలకు ఆర్ధికస్వాత్యంత్రం మాత్రమే వచ్చింది. అనేక విషయాల్లో వాళ్ళు మగవారిపై ఆధారపడియున్న చదువుకున్న అబలలు అని.. అలా కాకుండా ఇంకొక కోణంలో చూస్తే ఆ అమ్మాయి విడాకులు

తీసుకోవచ్చు అంతగా సర్డుకుపోలేనప్పుడు.. అదే ముగింపు అయితే అసలు అలాంటి బంధాన్ని సుజిత తన జీవితంలోకి రానివ్వకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు తన జీవితంలో అలాంటి బంధం ఉంది కాబట్టి

సర్దుకుపోవడమే..

( ఈ కథ కేవలం కల్పితం. ఎవ్వరిని ఉద్ద్యేశించి వ్రాసినది కాదు.)

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com30tag:blogger.com,1999:blog-4190422837205224407.post-16368174061510882742012-11-29T23:21:00.001+05:302013-06-08T05:34:31.052+05:30హాస్టల్ కబుర్లు-2(Doggie)

నా ఇంటర్మీడియట్ కబుర్లు ఇంతకు ముందు ఒక టపాలో పెట్టాను. చదవనివాళ్లు ఇక్కడ నొక్కి ఆనందించండి. వహ్వ.. నీ టపాలోనే నీ పాత టపాకు లింకు పెట్టి నీ బ్లాగ్ క్లిక్‌లు పెంచుదామనా??!! మీరలా అనుకోరని నాకు తెలుసుగా :P .. ఒకసారి అది కూడా చదివి దీన్ని దానికి కొనసాగింపుగా చదువుకోండి. అమ్మో!! దుర్మార్గురాలా!!! నీ కుట్ర మాకు తెలుసు.. అని మనసులో మీరసలు అనుకోవట్లేదు. అది నాకు తెలుసండి. అయినా గాయం సినిమా చూడకుండా గాయం-2 ఎలా చూస్తారు?? లాజిక్ పట్టేశారు. వెనక నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి..అసలు రెండూ చూడమంటారా!!!!.. మీకు అయితే భూత్ సినిమాని వేసి కుర్చీలో మిమ్మల్ని కదలకుండా కట్టేసి చూపించాల్సిందే.. మరి ఆర్జివి నా?మజాకా?

ఇంక అసలు విషయానికి వస్తే ఒక దుర్ముహుర్తమో,సుముహుర్తమో తెలియని సమయాన మా కాలేజీలోఅడుగుపెట్టాను.మొదటిరోజు మొదటి పంచ్ మా సుభాషిణి మేడం చేతిలో పడింది నాకు . ఒక చోట డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ మా అన్నయ్య వేసినందుకు "చదివేది మీరా?మీ చెల్లా?" :D అది అయిపోయిన తర్వాత మా నాన్నగారు, వార్డెన్ ల మధ్య అప్పగింతల కార్యక్రమం యథావిధిగా నా కన్నీళ్ళతో ముగిసింది. మా వార్డెన్ అంటే ఆషామాషి వార్డెన్ కాదు. అందరిని హడలుగొట్టించే టైపు అన్నమాట. ఆమె పేరు రాజకుమారి. పేరుకు తగ్గట్టు పెళ్లి చేసుకోకుండా కుమారిగా ఉండిపోయింది. నల్లగా, 6 ఫీట్ ఉంటుంది, అరవం ఆమె(tamilian) . హాస్టల్లో నిజంగానే ఒక రాజకుమరిలా ఉన్న సదుపాయాలన్నీ ఉపయోగించుకునేది. ఈమె ముందు ఎవరూ కూర్చోకూడదు. వంగి వంగి దండాలెట్టాలి. అమ్మో!! ఇలాంటి వార్డెన్లు ఉన్నంత వరకు తమ పిల్లల్ని హాస్టల్లో చేర్పించిన కన్నవాళ్ళు సంతోషంగా నిద్రపోవచ్చు. ఈమెని వార్డెన్ అని మాత్రం అని ఎవరూ అనకూడదు. గౌరవంగా madam అని పిలవాలి.కాని ఈమెకి మేము పెట్టుకున్న ముద్దు పేరు డాగీ(doggie). ఎందుకంటే ఉదయాన్నే మేము కాలేజీకి వెళ్ళే ముందు, వచ్చే ముందు మా గేటు దగ్గర కుర్చీ వేసుకుని నిజమైన గ్రామ సింహంలా కాపలా కాసి ఆమెకు పెట్టిన పేరు సార్థకత చేసుకునేది.ఎవరైనా ఆలస్యంగా రావాలి, వాళ్ళను ఆ వాకిట్లోనే కంటనీరు పెట్టించేసి తెగ భయపేట్టేది. మా హాస్టల్లో ఉన్నన్ని నియమాలు(rules) ఇంకెక్కడా ఉండవు. ఈ కాలంలో కూడా మొబైల్ వాడటానికి అక్కడ అనుమతి ఉండదు. ఎవరూ కూడా డెస్క్‌టాపులు, లాప్‌టాప్‌లు ఉపయోగించడానికి వీల్లేదు. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే మా కళాశాల ఆవరణం మొత్తం wi-fi సౌలభ్యం ఉంటుంది. హాస్టల్ పిల్లలకు మాత్రం సదుపాయం ఉండి ఉపయోగించలేని నిస్సహాయత :((.

మాకు ఒక 5 పాడుబడ్డ ప్రాచీనకాలం నాటి కంప్యూటర్లు ఉండేవి,అవి హాస్టల్ యాజమాన్యం పెట్టినవి. వాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. కేవలం మేము programmes చేసుకోవడానికి కావాల్సిన software మాత్రం install చేయబడి ఉంటాయి. అది కూడా ఉచితంగా వాడుకోవడానికి లేదు. గంటకి 10 రూపాయలు. ఇంకా మా హాస్టల్లో వారానికొకసారి విధిగా బయటికి పంపే ఆచారాలు లేవు. మరి ఇంక ఆ పని జరగకపోతే చచ్చిపోతాము అనే పరిస్థితి ఉంటే అప్పుడు ఒక గంట బయటకు వెళ్లి రావడానికి అనుమతించేది. మళ్లీ బయటకు వెళ్ళే ముందు వెళ్తాము అని, వెళ్లి వచ్చిన తర్వాత వచ్చేశామని చెప్పాలి. చెప్పలేదో.. అంతే సంగతులు.

ఇంకొక విచిత్రమైన నియమం ఏమంటే మేము ఏదైనా పెళ్లి అని అనుమతి తీసుకుంటే అప్పుడు మేము వెళ్తున్న పెళ్లి కార్డుతో పాటు ఒక లెటర్ వ్రాసి మా ఫైలులో పెట్టాలి. :) :). ఇంకా చెప్పాలంటే మాకొక టీవీ మాత్రం ఉండేది. దానికొక DTH కనెక్షన్. మా వార్డెన్ చూసేటప్పుడు ఎవరూ ధైర్యం చేసి చూసేవాళ్ళు కాదు. రోజు రాత్రి 10 వరకే చూడాలి. రాత్రి 10 తర్వాత ఎవరైనా చూసారో తోలు వలిచేది. 10 తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళుండాలి. అలా కాదని ఎవరైనా ఇంకొకరి రూంలో ఉంటే "పక్కన నిద్రపోయిన జనాలని చూపించి, వాళ్లకి మీరు ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత ఇబ్బంది " అని వాళ్ళు మేలుకోనేంత వరకు క్లాసు పీకేది. పది తర్వాత పక్క వాళ్ళ గదుల్లో ఉంటేనే ఓర్చుకోలేనిది ఇంకా 12 గంటలకి ఎవరి పుట్టినరోజులైనా చేయాలంటే ఇంకెన్ని తిప్పలో మాకు.

మాకు రెండు ల్యాండ్ ఫోన్లు, ఒక రెండు రూపాయిబిళ్లల ఫోన్లు ఉండేవి. ఒక ల్యాండ్ ఫోన్‌కి, ఆమె గదిలో ఉన్న ఫోన్ కి కనెక్షన్ ఉండేది. అందుకని చాలా వరకు మేమంతా దాంట్లో చేసుకోకుండా దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళం. కుక్క బారిన పడితే కనీసం కొరికి వదిలేస్తుంది. దీనికి దొరికామో నానా బీభత్సం చేస్తుంది. మళ్లీ ఈమెకు కాలేజీ లో కొంతమంది గూడాచారులు ఉండేవాళ్లు. ఒక హాస్టల్ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినట్టు తెలిస్తే చాలు, తన స్టైల్లో మాటలతో కరిచి %^%^&&#@ జీవితం మీద విరక్తి కలిగించేది. ఒకలాంటి అరవపు తెలుగు మాటలతో పిచ్చెక్కించేది. ఈమె అందరితో మాట్లాడదు. డబ్బు,దర్పం ప్రదర్శించే జనాలనే ఈ doggie పలకరించేది. ఇది అందరిని సమానంగా కరిచే doggie కాదు. ఒక అమ్మాయి హోదాని బట్టి ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువ,తక్కువ సమానంగా చూసేది.ఈమెకు,నాకు జీవిత కాలానికి సరిపడా శత్రుత్వం ఉంది. దాన్ని ఇంకొక టపాలో వివరిస్తాను.

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com20tag:blogger.com,1999:blog-4190422837205224407.post-6016697065664621662012-11-25T21:01:00.003+05:302013-06-08T23:13:48.623+05:30నాకీ జ్వరం వద్దు

గత సోమవారం రాత్రి నా స్నేహితురాలు పిలిచింది. తనతో మాట్లాడతూ బాగా అలసిపోయి ఉన్నందువల్ల లైట్ తీయకుండానే నిద్రపోయాను. రాత్రంతా సరిగా నిద్రపోలేదు. ఏదో తెలియని కల నన్ను మెలుకువలోకి తెస్తూ, దాన్నుంచి బయటపడి మళ్లీ నిద్రలోకి జారుకుంటూ ఉన్నాను. చాలా సార్లు మెలుకువ రావడం వల్ల నాకు తెలియకుండానే నేను ఎక్కువసేపు నిద్రపోయానేమోనని ఒక ఆందోళన మనసులో. ఇంత గందరగోళం మధ్య ఉదయం 7 గంటలకు లేచి ఓపిక చేసుకుని లైట్ కట్టేసి కాసేపు నిద్రపోయాను. ఇంత కలత నిద్ర పోయేసరికి నాకు జ్వరం వచ్చేసింది :((.

ఈ మధ్య మా ఆఫీసు వాళ్ళు రవాణా విషయంలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. మేము క్యాబ్ ముందుగానే రిజర్వు చేసుకుని కూడా ఆరోజు దాంట్లో వెళ్ళకపోతే నేరుగా మా మేనేజర్ గారికి ఒక మెయిల్ పంపుతారు. దానికి తగిన వివరణ ఇవ్వాలి తర్వాత. ఇదంతా ఒక కష్టతరమైన పని అని నేను దాదాపు మా ఆఫీసు రవాణాని ఉపయోగించుకోను. గోటితో పోయేదానికి కొరివి దాక తెచ్చుకోవడం ఎందుకు.?? నా దరిద్రం నా వెంటపడి నేను ఆరోజే క్యాబ్ రిజర్వు చేసుకున్నాను. నేనే దాని గురించి ఎక్కువ బుర్ర పాడు చేసుకుని ఒంట్లో ఓపిక లేకపోయినా వెళ్దామని బయలుదేరాను. అసలే నాకు ఇలాంటి విషయాల్లో చాలా భయం. క్యాబ్ వచ్చే ఒక 20 నిముషాల ముందే నుంచే స్టాపులో ఉంటాను. ఆరోజు కూడా యథావిదిగా అలాగే వెళ్లాను. నిలబడటానికి ఒంట్లో ఓపిక లేదు. ఇంక ఒక రెస్టారెంట్ మెట్ల పైన కూర్చొని సరిగ్గా క్యాబ్ వచ్చే 5 నిముషాల ముందు లేచి స్టాప్ దగ్గర నిలబడ్డాను. ఈలోపు ఒక ఆటోవాడు వెనక్కి తన ఆటోని నా కాలి మీదగా నెట్టాడు. నిజంగా నాకు ఈ జ్వరం వద్దు!! ఆఫీస్ అంత కంటే వద్దని అనిపించింది. ఆ నొప్పికి కంట్లో నుంచి కన్నీళ్లు.

ఆఫీస్‌లో మందులు అడిగి తీసుకుని పైకి వెళ్లి పుచ్చకాయ ఒక ప్లేట్ తీసుకుని తిందామని ముందు పెట్టుకుంటే తినబుద్ది కావట్లేదు. చుట్టూ ఉన్నవాళ్ళను అందరిని చూస్తున్నా "ఒక్కళ్ళు కూడా నేను ఎందుకు తినట్లేదు, తిను " అని చెప్పట్లేదు. చెప్పలేనంత దుఃఖం. నేను ఇలా జ్వరంతో ఉంటే ఇంట్లో ఎంతగా ముద్దు చేసి చూసుకునేవాళ్ళు అని వస్తున్నకన్నీళ్లను బలవంతంగ ఆపుకుని తిని మందులు వేసుకున్నాను. సీట్ దగ్గరకు వెళ్లి మేనేజర్ని అనుమతి అడిగి వెళ్ళిపోదామని అనుకుంటే.. ఆయన ఒక గంట వరకు మీటింగ్‌లో ఉంటారని తెలిసింది. నా కంప్యూటర్ ముందు కూర్చుని ఆ ఒక్క గంట ఎప్పుడెప్పుడవుతుందా అని చూస్తున్నాను. ఆ తర్వాత ఆయన్ని నేను ఇప్పుడు వెళ్తాను అని అనుమతి అడిగితే, నీ మేనేజర్ ఇప్పుడు నేను కాదు, ఈరోజే మారారు. నువ్వు కొత్త మేనేజర్ ని అడుగు అని చెప్పారు. చాలా భాధగా అనిపించింది. అసలు ఓపికలేక,కూర్చోలేక..అలా అని నిద్రపోలేక నానా అవస్థలు పడుతుంటే ఇదొకటా? అని నా కంప్యూటర్ ని చూస్తూ ఎవరికీ కనిపించకుండా బాగా ఏడ్చేసి కొత్త మేనేజర్ స్టేటస్ చుస్తే అయానేమో offline. సరే అని లేని ఓపిక తెచ్చుకుని ఇంకొక గంట కూర్చున్న తర్వాత ఇంక నా ఒంట్లోని ఓపిక అంత అయిపోయేసరికి ఒక మెయిల్ పెట్టేసి బయలుదేరాను. ఒకపక్క జ్వరం బాధిస్తుంటే అరే!! ఎందుకు ఒకరి బాధని అసలు అర్థం చేసుకోరు అని బాధపడుతూ హాస్టల్ కి వచ్చేసాను. ఇంక వచ్చిన వెంటనే అక్క నుంచి ఫోన్, ఏమైంది? ఎలా ఉంది?అని ఒకపక్క నీరసం గొంతులో తెలుస్తుంటే, మనసులో వాళ్లతో లేనని బాధ కలిసి అసలు మాటలే రావట్లేదు. బలవంతంగా బావున్నాను అని బావురుమన్నాను. అయితే నేను ఈరోజు నీ దగ్గరికి బయలుదేరుతాను. నువ్వు బాధపడకు అని అంది. ఇంకా తను చూపించే ప్రేమకు నేను ఎక్కువ ఏడుస్తానని తన కాల్ మధ్యలోనే కట్ చేసి ఒక పది నిముషాల తర్వాత మళ్లీ నేనే తనకి ఫోన్ చేసి "ఏం వద్దు! నేను ఇప్పుడు పడుకుంటాను. సాయంత్రం మళ్లీ చెప్తాను తగ్గకపోతే" అని చెప్పాను.

మధ్యాహ్నం కూడా ఏమి తినకపోవడంవల్ల మళ్లీ పడుకుని లేచే సరికి నీరసం. మనం ఇంత నీరసంగ ఉంటే ఎవరైనా పట్టించుకుంటారా?? అంటే ఎవరి పనులతో వాళ్ళు తీరిక లేకుండా ఉన్నారు. ఒక పక్క నీరసం, ఒక పక్క బాధ, ఏడుపు నేను ఒంటరిగా జ్వరంతో ఉన్నానని. మరి ఏం తినకపోతే నీరసం వస్తుందని లేచి వెళ్లి హోటల్లో రెండు ఇడ్లీలు తీసుకుంటే ఒక్కటి తినడానికి చాలా కష్టపడ్డాను. గదికొచ్చి నిద్రపోదామనుకుని అనుకుంటుండగా అమ్మ నుంచి ఫోన్,

"ఎలా ఉంది ఇప్పుడు?"

"బానే ఉంది మా.."

"తిన్నావా?"

"మ్మ్..తిన్నాను మా"

"ఏం తిన్నావ్?"

"ఇడ్లీ "

" ఎన్ని తిన్నావ్?"

"రెండు " ( అబద్దం చెప్పాను.. అమ్మ బాధపడుతుందని)

"ఎన్ని తీసుకున్నావ్?"

"రెండు తీసుకున్నాను..రెండు తినేసాను మా.."(నమ్మించడానికి)

"allout పెట్టావా?"

"మ్మ్ "

" స్వెట్టర్ వేసుకున్నావా?"

"మ్మ్"

"మఫ్ఫ్లర్(తలకు చుట్టుకునేది) కట్టుకున్నావా?"

"లేదు మా, నా దగ్గర లేదుగా"

"ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లమంటే నువ్వు పట్టించుకోవు"

"మా..నా స్వెట్టర్కి క్యాప్ ఉంది."

"సరే.. అయినా చెవిలో దూది పెట్టుకో..చల్లగాలి దూరకుండా"

"నీళ్లు తెచ్చుకున్నావా? రాత్రి దాహమేస్తే కష్టమవుతుంది."

"తెచ్చుకున్నాను."

"సరే మరి.. మందు వేసుకున్నావ్ గా.."

"ఆ అమ్మా.. "

"వెంటనే తగ్గిపోతుందిలే.. నువ్వు బాగా నిద్రపో.."

"ఊ అమ్మా..ఉంటాను"

"మళ్లీ రేపు ఉదయాన్నే ఫోన్ చేస్తాను.."

నా కంటి నుంచి ధారగా కన్నీళ్ళు.. అమ్మ నువ్వు కావాలి అని.. అలా అని తనతో చెప్పి తనని బాధపెట్టలేను. అమ్మకి దగ్గరగా నేను లేకపోయినా తన ప్రేమ ఎప్పుడూ నన్ను ఎంతటి బాధ నుంచైనా కాపాడుతుంది. తనకి నేను బానే ఉన్నానని, ఉంటానని చెప్పాను. సో అలాగే ఉండాలి అని నిద్రపోయాను. అయినా ఇంత చిన్న జ్వరానికే ఇంతలా డీలా పడిపోతే ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి వస్తే నిజంగా తట్టుకోలేవా ? అని నా బుద్ధి నా మనసుని అడిగింది.

నా మనసు నువ్వు ఎన్నైనా చెప్పు..జ్వరం వస్తే అమ్మ,నాన్న కావాలి..( ఇంకా చెప్పాలంటే కృష్ణవంశీ సినిమాల్లో ఉన్నంతమంది నా చుట్టూ ఉన్నప్పుడు)...వాళ్ళతో ఉన్నప్పుడు ఏది వచ్చిన నేను తట్టుకుంటాను అని బుద్ధికి బాగా గడ్డి పెట్టింది. :) ఇంకొక చిలిపి ఊహ ఏంటంటే ఇప్పుడు మా అమ్మ ప్రేమను నేను ఎంతగా పొందుతున్నానో.. నాకు పిల్లలు పుట్టిన తరువాత.. "ఆమ్మా.. దాస్తావెందుకు అని.." (krack cream) ప్రకటనలోలాగా నేను చెప్పకుండానే వాళ్లే వచ్చి నాకు cream రాయాలి. ఏంటి?? అదోలా చూస్తున్నారు.. అంటే ఎప్పుడూ నేను సేవ చేయించుకోవడమేనా?? నేను చేసేదుందా!!! అనా!!! :D :D

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com22tag:blogger.com,1999:blog-4190422837205224407.post-55862832789100769042012-11-23T00:13:00.001+05:302013-06-08T05:35:14.731+05:30హేమంత ఋతువు

ఈ నిశి రాతిరి వేళలో

అమ్మ వెచ్చని ఆత్మీయస్పర్శపు ఆలింగనంలో,

నాన్న ప్రేమానురాగాల తీయని కౌగిలింతతో మురిసిపోతూ..

అలసిపోయి,ఆదమరచి నిదురించిన నా కనుపాప

ఇలాంటి హేమదృతువు మళ్లి మళ్ళి నా కోసమే రావాలని..

మురిసిన నా మురిపెం కలలా కరిగిపోయి,

ఈ క్షణం వాటిని ఆనాటి స్మృతులని చూపిస్తూ..

ఆ గతస్మృతుల ఒడిలోకి జారువాలకుండ,

నిస్సహాయంగ విడిచిన నా నిట్టూర్పుల వేడినే

హేమదృతు రక్షణగా మిగిల్చిన కాలమా!!

నా కంటి కనుపాప నిదురపోకుండా జార్చిన అశ్రువు సాక్షిగా

నీ ఉనికి నేనెరుగని చోటుకి...

హేమమా!! మరళి పో!!!

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com14tag:blogger.com,1999:blog-4190422837205224407.post-23792047284097667812012-11-19T16:43:00.001+05:302013-06-08T23:07:44.686+05:30అన్నయ్యలు-పరీక్షలు

నాకు అంతగా ఊహ తెలియనపుడే మా అన్నయ్యవాళ్లు ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాశారు. ఆ కథలు మా అమ్మ చెప్పగా ఇప్పుడు గుర్తున్నాయి. ప్రతి రోజు వీళ్లు వ్రాసే పరీక్ష పేపరు లీక్ అయ్యిందని ఈనాడులో వచ్చేవంటా. అయినా కూడా అప్పుడు ఎవ్వరూ దాన్ని పట్టించుకుకోకపోవడంలో వీళ్లకి అవే పేపర్లతో పరీక్షలు జరిగిపోయాయంట. ఇంతగా లీక్ అయిన పేపర్లలో కూడా మ అన్నయ్య వాళ్లు బాగా చించి ఒకరు 65%, ఇంకొకరు 75% మార్కులు తెచ్చుకుని కాలర్లు ఎగరేసుకున్నారు. ఈ మార్కులు కూడా మా అమ్మ ఈనాడు పేపరులో ఉన్న ప్రశ్నలు చూసి వాటికి సమాధానాలు నేర్పించి పంపిస్తే వచ్చినవి. లేదంటే మా అన్నయ్యలకి అవి కూడా వచ్చేవి కాదనుకోండీ. :-o

question paper తెలిసినా కూడా ఇదే expression!!

అయినా వాళ్ల ప్రిపరేషన్ మాత్రం ఆహో, ఓహో లెవల్లో ఉండేది. వీళ్లు మొదటి నుంచి వాళ్ల స్కూల్లోనే నిద్రపోయేవారు. పరీక్షలు ఉన్న రోజుల్లో మాత్రమే కాదు, పరీక్షలు ఉన్నా, లేకపోయినా ఈ జీవులకి మాత్రం పవళింపుసేవ అక్కడే జరిగేది. పాపం పిల్లలు ఇంతగా కష్టపడుతున్నారని ఇంట్లో అందరు ఒక పిచ్చి భ్రమలో ఉండేవాళ్లు. వీళ్ళు స్కూల్లో పడుకోవడం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువ కనిపించి మా ఇంట్లో కూడా ఏమనేవారు కాదు. వాళ్లు ఇచ్చే buildup అలాంటిది మరి.

తర్వాత మా అన్నయ్యలు చెప్పగా తెలిసిన విషయమేంటంటే, వీళ్ళ స్కూల్లో ఆ కాలానికే ఒక కంప్యూటర్ ఉండేది. వీళ్లకి క్వశ్చన్ పేపర్లు దాన్ని నుంచి ప్రింట్ తీసేవారంట. వీళ్లు సందు దొరికితే దూరిపోయే రకం. అందుకనే వాళ్ల మేనేజ్మెంట్ కూడా ఈ కంప్యూటర్ రూంలోకి ఎవరూ దూరకుండా తాళంచెవి వాళ్ల క్లర్క్ కి ఇచ్చి జాగ్రత్త చేయమని చేసేది. అయినా పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణం ఏడు సముద్రాల అవతల ఒంటి స్తంభంలోని చిలుకలో ఉన్నట్టు మనకు తెలియనంత వరకే కథ రసవత్తరంగా ఉంటుంది. తెలిసిన తర్వాతేముందండి? అంతే!! మన తోట రాముడు దాన్ని సంపాదించడం, మాంత్రికుని సంహారం, తోటరాముడి, ఇందుమతిల కల్యాణం. ఇలా మా తోటరాముళ్లకు కూడా వాళ్ల question papers ఉన్న గది తాళం చెవి క్లర్క్ ప్యాంటు జేబులో ఉంటాయని తెలిసిన తర్వాత వీళ్లు పరీక్షకి ఇంకా ఎక్కువ సమయం చదువుకునే వారు. మరి క్లర్క్ నిద్రపోవాలి కదా వీళ్ల పథకం పండాలంటే. ఆయన నిద్రపోయాడని బాగా confirm చేసుకుని ఆయన గదిలోకి వెళ్లి చడీ చప్పుడూ లేకుండా ఆ తాళాలు తీసుకుని వెళ్లి ఆ కంప్యూటర్ గది తెరిచి అందులో printouts తీసిన కార్బన్ కాగితం మీద ఉన్న అక్షరాలని బట్టి అవి ఏ ప్రశ్నలో తెలుసుకుని ఎక్కడివక్కడే సర్దేసి మళ్లీ యథాస్థానంలో పెట్టేసి గప్ చుప్ సాంబార్ బుడ్డీ!!

ఇంకా ఉదయాన్నే వాళ్ల claasmate ఒక అమ్మాయి వచ్చేది ఇంటికి వీళ్లు స్కూల్ నుంచి రాగానే, "ఏమైనా ప్రశ్నలు తెలుసా"? అని. అసలే మా అన్నయ్య వాళ్లు మహా తెలివిమంతులు. "కొన్నే తెలుసమ్మా!!" అని కొన్ని ప్రశ్నలే చెప్పి పంపించేవాళ్లు. ఎందుకలా అంటే వీళ్లకంటే ఆ అమ్మాయికు ఎక్కువ మార్కులు రాకూడదని.

వీళ్లకు question paper ముందు రోజే తెలిసినా వీళ్లు అవి కొన్నైనా చదివి చించుతారా?? అంటే

ఉహూ!! వీళ్లు పరీక్షకి వెళ్లి ఆన్సర్ పేపర్లో కొన్నిటికి మాత్రమే సమాధానం వ్రాసి మిగిలిన వాటికి ఏ ప్రశ్నకి ఎంత

స్పేస్ వదలాలో అంత వదిలేసి వచ్చేవారంట. మళ్లీ రాత్రికి ఆ answer papers ఉన్న గది తాళాలు తీసుకుని, అది తెరిచి అవి పుస్తకాలు చూసి వ్రాసేవారంట. ఇది మా అన్నయ్యల బద్ధకం. పరీక్షరోజుల్లో మాత్రమే స్కూల్ దగ్గర పడుకుంటే పాపం వాళ్లపైన అనుమానం వస్తుందని ఇలా కష్టపడి చదివినట్టు నటించి పరీక్షల్ని బాగా చూసి వ్రాసి

మా ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో మాత్రం.. బాగా కష్టపడిపోతున్నారు అనే ఇమేజ్ సంపాదించారు. వీళ్లు చేసిన సాహసకృత్యాలు తెలిసి ఇంట్లో బాగా నవ్వుకునేవాళ్లం.ఇవన్నీ వాళ్లకి ఉద్యోగాలొచ్చిన తర్వాతే బయటపడ్డాయనుకోండీ..

p.s: దీన్ని నేను ఇంకొకరు కూడా ఇలాగే చేసి తప్పుడు మార్గంలో నడవమని మాత్రం చెప్పట్లేదు.

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com16tag:blogger.com,1999:blog-4190422837205224407.post-1571005739074384572012-11-15T11:47:00.002+05:302013-06-08T23:14:21.140+05:30బరువైన ఙ్ఞాపకం

నేను హైదరాబాదులో ఒక సంస్థలో ప్రాజెక్టు చేసుకుంటున్న రోజులు. మా అక్క తన post graduation కోసం బాగా కష్టపడి చదువుతోంది. ఇంక తన కష్టానికి పరీక్ష పెట్టే రోజు దగ్గరైంది. మా అన్నయ్య పరీక్ష రోజున ఏదో ముఖ్యమైన పని ఉండి వేరే ఊరు వెళ్ళవలిసి వచ్చింది. తను మాతో పాటే ఉండుంటే ఇంత బరువైన ఙ్ఞాపకం మాకు మిగిలి ఉండేది కాదు.

మా అక్కకు పరీక్షలంటే చాలా భయం. తనకు అంతకు ముందు రోజు అస్సలు నిద్ర పట్టదు. ప్రతి సారీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ విషయంలో మాత్రం తను ఏం చేయలేకపోతుంది. పరీక్ష రోజు ఉదయాన్నే లేచి పూజ చేసి ఇద్దరికీ ఫలాహారం చేసి 10 గంటలకి పరీక్ష మొదలవుతుందంటే ఇంటి నుంచి 7 గంటలకే బయల్దేరేలాగా ప్లాన్ చేసుకున్నాం. మేము బయల్దేరే లోపల మా పనిమనిషి వచ్చింది. తన పని అయ్యేంత వరకు ఆగేంత సమయం మాకు లేదు. మేము తనకి పని చేసి ఇంటి తాళాలు ఓనర్ వాళ్ళ ఇంట్లో ఇవ్వమని చెప్తే, వాళ్ళు పెళ్ళికి వెళుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నం 2 పైనే అవుతుంది. మరి మీరు ఎన్నింటికి వస్తారని అడిగింది. మేము వచ్చేసరికి కూడా అదే టైం అవుతుంది అని చెప్తే, తను మీరు వచ్చే సమయానికి వాళ్ళు రాకపోతే అనవసరంగా మీరు బయట ఉండాల్సి వస్తుంది అని లేని పోనీ అనుమానం రేపింది . ఇంకేం చేయాలో తెలియక సరేలే ఆంటీ, మీరు పని అయిన తర్వాత తాళాలు కిటికీ తలుపులో పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాము.

మేము 8.45 కంతా పరీక్షా హాలు దగ్గరకి వెళ్ళిపోయాము. మా అక్క 9.15కి లోపలికి వెళ్ళిపోయింది. నేను బయట ఖాళీగా కూర్చుని ఏం చేయాలో తెలియక అలా రోడ్డు మీదకి వెళ్లి ఈనాడు పేపర్ తీసుకుని వచ్చి దాన్ని నములుతూ ఎప్పుడెప్పుడు ఒంటి గంట అవుతుందా అని అనుకుంటున్నాను. అలా అనుకున్నా అయ్యో! అక్క లోపల exam వ్రాస్తోంది కదా!! తొందరగా గడవకూడదు.. తను అన్ని నిదానంగా అలోచించి జవాబులు వ్రాసేంత వరకు టైం అవ్వకుడదని వెంటనే అనుకున్నాను. ఏంటో చాదస్తం కదా!!! మొత్తానికి తను వచ్చేసింది 1 గంటకి బయటికి. exam ఏంటో? ఎలా వ్రాసానో ? అర్థం అవ్వట్లేదు అని. నేను ఇంక వదిలేయ్! వచ్చే result ఎలాగు వస్తుంది. ఈలోపు మనం టెన్షన్ పడినంత మాత్రాన ఏం జరగదు అని నాకు తోచిన మాటలు చెప్పి బయటికి నడిచాము. మా అక్క స్నేహితులు వస్తే వాళ్ళని పలకరించి ఇంక ఇంటికి వెళ్లి మళ్లీ భోజనానికి ఏం వండుతాములే..ఇప్పటికే బాగా అలసిపోయామనుకుని బయటే చికెన్ బిరియానీ, ఒక 1 లీటర్ పెప్సీ బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్లి తిని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని బయలుదేరాము ఇంటికి.

అసలే ఎండాకాలం. మంచి మిట్ట మద్యాహ్నం .ఇంటికి వచ్చేసరికి 2.30 అయ్యింది. కిటికీ తలుపులో తాళంచెవి వుంది కదా అని చేయి పెడితే అక్కడ తాళంచెవి కనిపించలేదు. కింద ఓనర్స్ కూడా వచ్చేసినట్టున్నారు వాళ్లతో ఏమైనా ఉన్నాయేమో అని అడిగితే అక్కడ కూడా లేవు. పోనీ ఆంటీ కింద షాప్ లో ఏమైనా ఇచ్చారేమో అని అడిగితే ఉహూ ..అక్కడ కూడా ఇవ్వలేదంట . అప్పటికే అంత ఎండలో వచ్చేసరికి మాకు గొంతు తడారిపోయింది. ఇంక ఏం చేయాలో తెలియకపోతే ఓనర్ అంకుల్ వాళ్ళ డ్రైవర్ని పని మనిషి వాళ్ళింటికి పంపించి ఆమెని పిలిపించాడు. వేడి వేడిగా బిరియాని తిందామంటే ఈ నస ఏంటిరా దేవుడా!! అని చాలా చిరాకొచ్చింది. మా పని మనిషి నేను కిటికిలోనే పెట్టాను. అది గాలికి కింద పడిందేమో.. చూసారా! అని అడిగింది. మా అక్కకు, నాకు ఆ ఆలోచనే రాలేదు. ఎందుకంటే నా మెదడును బిరియానీ, మా అక్క మెదడుని వ్రాసిన exam paper ఆక్రమించేశాయి. మొత్తానికి తాళం చెవి లోపలే పడిపోయింది. మా అదృష్టం దానికి keychain కూడా లేదు ఏదైనా కర్ర సహాయంతో తీద్దాం అంటే.. అంతే మన టైం బాలేనప్పుడు అన్ని ఇలా కలిసొస్తాయి. మా ఇంటి పక్క పోర్షన్లోకి కొత్తగా అద్దెకి ఆరోజే వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న బాబు పెప్సీని చూసి వాళ్ళ అమ్మతో అది కావాలని ఒకటే గొడవ :D . అక్కడ మా పరిస్థితి అసలు వర్ణించలేము. మా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. వాటిని శాంతపరచాలంటే ఇంటి తలుపులు తీయాలి :(. మా పనిమనిషి నా వల్లే కదా మీరు ఇక్కడ అనవసరంగా నిలబడ్డారు అని చాలా భాదపడుతోంది. ఆ తాళం చెవిని తీయడానికి చాలా కష్టపడుతోంది. తాళం చెవికి ఉన్న రింగులో సన్నని ఇనుపతీగని వంచి దాని సహాయంతో బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. పక్క బిల్డింగ్ వాళ్ళు మా అవస్థలు చూడలేక ఒక తాళం చెవి ఇచ్చి దాంతో ప్రయత్నించమన్నారు. అబ్బే! హెయిర్ పిన్నులతో, పక్కింటి వాళ్ళ తాళం చెవితో వచ్చే విధంగా తయారు చేస్తున్నారా ఈ మధ్య తాళాలు.. అసలే మనం technologically advanced.. :D..

చివరికి మా పని మనిషి నా వల్ల కాదని చేతులు ఎత్తేసింది. నేను తాళం పగలకొట్టేస్తాను అని ఒక పెద్ద బండ రాయితో పగలకొడుతూ, మీరు నా జీతం డబ్బుల్లో ఒక వంద తగ్గించేయండి ఈ నెలకు. ఆ వందతో కొత్త తాళం కొనుక్కోండి అని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. ఆంటీ!! మీరు మొదటే ఈ పని చేసుంటే మేము ఈ పాటికి తినేసుండే వాళ్ళం అనుకున్నాము. ఇంతలో నాకు ఒక మెరుపు లాంటి ఐడియా తట్టింది. తాళం చెవి దేనికైనా అతుక్కున్టుందా అని.. వెంటనే ఓనర్ వాళ్ళ అమ్మాయిని పిలిచి ఒక చిన్న అయస్కాంతం ముక్క ఉంటే ఇవ్వమని అడిగాము. ఆ అమ్మాయి నా దగ్గర లేదని చెప్పేసింది. అయినా మీ అమ్మని ఒకసారి అడుగు..ఉంటె తీసుకు రా అని చెప్పాను. ఆ అమ్మాయి ఒక చిన్న అయస్కాంతం ముక్క తెచ్చింది. దాన్ని మా పని మనిషి ఇంతకు ముందు తెచ్చిన ఇనుప తీగకి పెట్టి, దాని సహాయంతో తాళంచెవిని బయటకి తీసాము. నేను flowలొ వ్రాస్తూ మీకు టైం చెప్పడం మర్చిపోయాను. మేము గృహప్రవేశం చేసే సరికి సమయం సాయంత్రం 4.30. అక్షరాలా రెండు గంటలు ఎండలో, ఆకలితో మాడిపోయాం. వెంటనే చల్లారిపోయిన బిరియాని, వేడిక్కిన పెప్సితో మా భోజనం కానిచ్చేసాము. :D .. చాలా ఆకలితో ఉండటం వల్లనుకుంటా అవి చాలా రుఛిగా అనిపించాయి. ఆ తరువాత కిటికిలో తాళం పెట్టే విధానం మార్చాము. ఒక కిటికీ తెరిచి మూసి ఉన్న రెండో కిటికీ తలుపు వెనకాల పెడతాము. ఒకవేళ గాలికి తెరిచి ఉన్న కిటికీ కొట్టుకున్నా రెండో కిటికీకి బోల్ట్ పెట్టి ఉంటుంది కాబట్టి తాళం చెవి పడుతుందన్న భయం ఉండదు. What an idea madam ji :D :D

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com25tag:blogger.com,1999:blog-4190422837205224407.post-81444944760607296052012-11-09T11:03:00.001+05:302013-06-08T23:14:49.900+05:30నేను ఊరెళ్తున్నానోచ్

నేను హాస్టల్లో చేరి రెండు నెలలు కావస్తోంది. అసలు ఒక్క రోజే సెలవు తీసుకుందామనుకున్నాను నిన్నటి వరకు. నిన్న మా అమ్మ అదేంటీ? అమావాస్య రోజు బయలుదేరుతావా? అని అడిగింది.. నేను పర్వాలేదు అమ్మ.. దేవుడీకి దండం పెట్టి వస్తాలే వచ్చేటప్పుడు... ఏం కాదు అని ఒప్పించాడనికి ప్రయత్నించాను. ఇంతలో మా అక్క ఫోను తీసుకుని ఏం కాదులే! ఆరోజు నువ్వు టపాసులు పేలుస్తూ ఒక పక్క మళ్లి తైరిగి వెళ్ళాలని టెన్షన్ పడుతూ ఏం హడవుడి పడుతూ పోకు అని చెప్పేసరికి నేను రెండు రోజులు లీవ్ తీస్కుంటున్నాను.

నాకసలే HOMESICK ఎక్కువ. అందులోనూ హాస్టల్ నుంచి బయల్దేరుతున్నాను మొదటిసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎందుకో మనసులో చెప్పలేని ఆతురత, మా ఊరుకి ఫ్లైట్ ఉంటే బావుండేదని అనిపిస్తోందీ(అతడు సినిమా డైలాగు కాపి కొట్టానని అనుకోకండి.. ప్రతిసారి ఊరు వెళ్ళేప్పుడు నాకు ఇలానే అనిపిస్తుంది.). నిన్ననే మా ఆఫీస్‌లో దీపావళి సందడి మొదలైంది. మాకు దీపావళికి చాకొలేట్స్ ఇచ్చారు. దీపాల అలంకరణ పోటీ పెట్టారు. ఆఫీస్ అంత సందడి సందడి గా కనిపిస్తోంది. నాలోనే ఆ సందడి ఉన్నందుకనుకుంటా...ఇంకా నేను పండగకి కొన్న కొత్త బట్టలు, నేను ఇక్కడ మా అమ్మ,నాన్న,అక్కల కోసం కొన్న వస్తువులు చూపించి వాళ్లనెప్పుడెప్పుడు ఆశ్చర్యపరుద్దామా అని ఉంది.

ఇక్కడ వాతావరణం కూడా నా ఫీలింగ్స్‌కి తగ్గట్టు చాలా మబ్బులతో ఉంది. ఇలా ఉంటే నాకస్సలు పని చేయబుద్ధి కాదు. నిజం చెప్పాలంటే ఆఫీస్ కు వెళ్లాలని కూడా లేదు. అయినా మీకొక విషయం చెప్పనా??? మా మెనేజరుకి మాత్రం చెప్పకండి.. ఈరోజు నా బస్సు 8 గంటలకి అయితే 5 గంటలకే అని చెప్పి పర్మిషన్ తీసుకుంటున్నాను. మళ్లి 5 రోజుల వరకు ఆఫీసు ఊసే లేదు.

ఒక భాదాకరమైన విషయం ఏంటంటే నేను క్రిస్మస్ కు ఇంటికి వెళ్లలేను..ఎందుకంటే నాకు ఉన్న అన్ని లీవ్స్ అయిపోయాయు ..:( మ అక్కకి ఇదే విషయం చేప్తే అరే!బాధపడకు .. ఆ ఏసుప్రభువే చల్లగ చూసి నీకు లీవ్ ఇప్పిస్తాడు అని చెప్పింది.. ఏంటో ఉద్యోగంలో చేరిన తర్వాత పరమత భేదం లేకుండా అన్ని పండగలకి ఇంటికి వెళ్ళడం అలవాటైపోయింది . ఈ సంవత్సరం అన్ని పండగలు దాదాపు ఇంట్లోనే చేసుకున్నాను. ఆఖరుకి మన ఆంధ్ర అవతరణ కూడా..ఇంకా చివర్లో ఈ ఒక్కటీ చేసుకోకపోతే వెలితిగా ఉంటుంది కదా !!!!!!అయ్యో పాపం.. ముఖ్యమైన పండగ మిస్స్ అవుతోందని మీకు కూడా అనిపిస్తోంది కదా !! మా మెనేజరుకి ఏదో ఒకటి చెప్పి లీవ్ సంపాందించే మార్గం చెప్పండి.. "అందరికి దీపావళి శుభాకాంక్షలు."

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com21tag:blogger.com,1999:blog-4190422837205224407.post-8796814141593823272012-11-08T00:48:00.001+05:302012-11-09T00:07:27.622+05:30TEAM MATE

నేను పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మా కోర్సు రెండు సంవత్సరాలైతే అందులో ఒక సంవత్సరం కాలేజిలోనే ఉండి చదివేదైతే ఇంకొక సంవత్సరం మేము నేర్చుకున్న విద్యని ఏదైనా ఒక సంస్థలో ట్రైనీ ఇంజనీరుగా ప్రదర్శించి ఒక ప్రాజెక్టు చేయాలి.

మా మొదటి సంవత్సరం పరీక్షలు కాక ముందే ఈ హడావుడి మొదలైంది. కొంతమందికి మొదట్లోనే అవకాశాలు పలకరించి వాళ్లు నిశ్చింతగా పరీక్షలు వ్రాసుకున్నారు. నాలాంటి కొంతమంది మాత్రం అటు ఆ పరీక్షలకు చదవలేక, మధ్యలో ఈ ఇంటర్వ్యూలను ఎదుర్కోలేక కొంచెం ఇబ్బందిపడ్డాము. అలా మా కష్టాలు చూడలేక మా హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ గారు ఒక సంస్థలో తనకు తెలిసిన వాళ్లు ఉంటే మా అందరిని ఇంటర్యూలకు పంపే ఏర్పాట్లు చేసారు..నాకు ఆయన ఈ మాట చెప్పగానే మా పాలిట దేవుడిలా కనిపించారు. ఎలాగోలాగా ఆ ఇంటర్య్వూలో నెగ్గి నేను కుడా ఒక ప్రాజెక్టుదాన్ని అయ్యాను :). ఏంటో కాని మనకు దక్కనంత వరకు ఒక విషయంపై మనం పడే తపన అంతా ఇంతా కాదు. మానవ సహజం కదా!!!ఇందులో ఒక విషాదకరమైన విషయం ఏమంటే మా కాలేజీ నుంచి 6 మంది అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే అమ్మాయి. అయినా మనకు communtication skills తెలిసినపుడు అదంత పెద్ద సమస్య కాదనుకున్నాను :P. కానీ మొదటిరోజే నన్ను పిలవకుండా భోజనానికి వాళ్లు మాత్రమే వెళ్లిపోయారు..(మనలో మన మాట.. తెలుగు అబ్బాయిలకు అమ్మాయిల దగ్గర తగ్గి మాట్లాడానికి అహం అని నా అభిప్రాయం.. హుష్..ఈ మాట మళ్లీ మాట్లాడుకుందాం).. ఎంతైనా మనం ఇద్దరం ఉండీ, అవతల వాళ్లు ఒక్కళ్ళే అని తెలిసినపుడు ఇంకొంచెం బెట్టుగా ఉంటామనుకోండి..మానవ సహజం..:) ఇంక తప్పదనుకుని మీరు రోజు నన్ను కూడా పిలవండి అని ఒక మాట వాళ్లతో చెప్పాను.

ఒక అబ్బాయి,నేను ఒకే టీము. ఈ X కొంచెం మొదట్లో బానే మంచిగా ప్రవర్తించేవాడు. తర్వాత్తర్వాత భరించలేని విధంగా తన వ్యక్తిత్త్వంతో నా కళ్లు తెరిపించాడు. ఈ X గారిని నేను ఏమి అడిగినా నాకు తెలియదు అనే సమాధానం ఇచ్చేవాడు. నేను మొదట్లో అయ్యో పాపం!! అని నాకు తెలిసిన ఇంఫర్మేషన్ అంతా చెప్పి త్యాగశీలిలాగా గొప్పగా feel అయ్యేదాన్ని. కానీ ఆ అబ్బాయి ఉద్దేశ్యం తనకి తెలిసిన విషయం కరెక్ట్ అవునా? కాదా? అని నాతో నిర్దారించుకోవడం . అదేం ఆనందమో నాకు ఇప్పటికి అర్థం కాదు.ఒక్కసారి మా మెనేజరు తనని పిలిచి ఏదో మాట్లాడాడు. విషయం ఏంటీ అని అడిగితే హా..లైట్ అని నాకు మెనేజరు ఏం చెప్పాడో చెప్పకుండా నీళ్లు నమిలేసాడు. అదంత లైట్ అయినప్పుడు అంత సీరియస్‌గా వినడం ఎందుకో? మళ్ళి నాకు చెప్పకుండా దాచిపెట్టడమెందుకో??అప్పుడర్థమైంది తన అసలు రూపం. ఏదైనా కాని నా నుంచి సమాచారం లాగడమే తప్ప తను ఒక్క విషయం కూడా చెప్పేవాడు కాదు.. కొంచెం లేట్‌గా అయినా నాకు జ్ఞానోదయం అయ్యి నేను తనలానే సమాధానం ఇచ్చి తప్పించుకునేదాన్ని.

ఒకరోజు మా మేనేజర్ మా ఇద్దరినీ పిలిచి చాలా casual గా మీరు weekends ఏం చేస్తుంటారు అని అడిగాడు. విషయం తెలియని గుడ్డిగొర్రెలాగా bore కొట్టి ఎలా timepass చేయాలో తెలియక జుట్టు పీక్కుంటాను అని నేను చెప్పేసరికి మా మేనేజర్ ఒక్క అరుపు " woow!! It is really interesting :P" అని అరిచి నువ్వు అయితే ఈ వీకెండ్ ఆఫీస్ వచ్చి పనితో timepass చేయి అని నా తల మీద తాపిగా ఒక బండరాయి వేసాడు. తర్వాత ఆ X గాడిని అడిగితే వాడు అతి తెలివితో "నేను వస్తాను కానీ నాకు ఇక్కడ తినడానికి కాంటీన్ తెరిచి ఉండదు" అని నీళ్ళు నమిలాడు. మా మేనేజర్ దేన్నైనా కాష్ చేసుకునే రకం. అదే నీ సమస్య అయితే నువ్వు చిన్నీ వాళ్ళింటికి వెళ్ళు. లంచ్ చేసి పెడుతుంది. మా మేనేజర్ అంత మొహమాట పెట్టిన తర్వాత సరే అని నేను కూడా దానికి ఒప్పుకోక తప్పుతుందా!!!:(

అలా రోజులు గడిచిపోతున్నాయి. నాకు ఒక అలవాటుండేది. రోజు మా అన్నయ్యతో పాటు కలిసి ఇంటికి వెళ్ళడం. సాయంత్రం 6:30 అయ్యిందంటే నేను తనని నసపెట్టేదాన్ని ఫోన్ చేసి ఇంటికెల్దాం అని. నాకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అన్నయ్యని కూడా పేరు పెట్టి పిలవడం..ఇంకొక మంచి విషయం మా అమ్మ,అక్క,నాన్నలతో ఇంచుమించు ఒక అరగంట మాట్లాడేదాన్ని. ఏంటో అన్ని మంచి లక్షణాలే చెప్తున్నాను కదా !"I am very good girl..అన్ని మంచి లక్ష ణాలు ఉన్నయంట నాలో..విన్నావా మిష్టర్ !!!!(Little Soldier's Song)" ఊహించుకోగలరని మనవి.మేము కాంపస్ ప్లేస్ మెంట్ కి మా కాలేజి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు నేను మా అన్నయ్యతో టికెట్ బుక్ చేయించేదాన్ని. ఇన్నిసార్లు ఒక అబ్బాయితో ఫోనులో మాట్లాడుతుండే సరికి ఇంక చూసుకోండి వీడి general knowledge తో మా అన్నని నా బాయ్ ఫ్రెండ్ అనుకుని కాలేజీ లో అందరి చెవులు కోరికేసాడు.నేను ఆ రక్తం చూసి ఏమైంది అని బాధితుల్నిఅడిగితే సదరు X గాడు నా గురించి ఇలా

చెప్పాడని తెలిసి నవ్వుకున్నాము.ఆ చెవి కొరికిన బాధితులకి మా అన్నయ్య పేరు తెలియబట్టి నేను బతికిపోయాను.నా దాకా విషయం వచ్చిన తర్వాత ఆ X కు దూరంగా ఉన్నాను. లంచ్ కట్ చేసాను.

ఇంకొకసారి X ని పిలిచి మాటల మధ్యలో మెనేజరు నా గురించి అడిగితే తను అస్సలు పని చేయదు, నాకసలే సహాయం చేయదు అని చెప్పాడంట. ఈ విషయం నా దాకా వచ్చి నేను ఇలా చెప్పాను, నువ్వు మేనేజర్ ఏమైనా తిడితే లైట్ తీసుకో అని చెప్పాడు. వెంటనే నేను షాక్‌కి గురయ్యాను. అప్పటి దాకా తెలియని లైట్ అనే పదానికి వాడి పద్ధతిలో సమాధానం ఇచ్చాడు వెంటనే తేరుకుని అసలెందుకు అలా చెప్పారు ? అని అడిగాను. కావాలని చెప్పలేదు. తెలీకుండా నోరు జారాను అని చెప్పాడు. ఆ క్షణం వాడి ఆలోచన మా మేనేజర్ ముందు నన్ను చెడుగా చిత్రించడం. ఈ విషయానికి కావాల్సినoత CLASS ఆరోజే తీసుకుని ఇలాంటి మనుషుల కన్నా మృగాలు నయం అనుకుని మాట్లాడటం మానేసాను.

కట్ చేస్తే మేము కాలేజిలో ఇండస్ట్రీలో ఉండి ఏమేమి చేసామో ఒక రిపోర్టు ఇవ్వాలి చివరగా.మాకు రెండవ సంవత్సారనికి ఇదే ఎగ్జాం.నేను దాన్ని ప్రింట్ తీసుకోవడానికి వెళితే ఇంటెర్నెట్ షాపులో వీడు ఉన్నాదు..ఎన్ని పేజిలు అని అడిగాడు? నేను 75 పేజీలు చేసాను అని చెప్పి నా పని చూసుకుని వచ్చేసాను. నేను వచ్చేసిన వెంటనే "దీని మొహం.. ఎప్పుడు చూడూ..ఫోన్లలోనే ఉంటుంది.. రిపోర్ట్ ఏం చేసిందో అని" అని మళ్లీ కామెంట్ చేసాడంట.. నా ఫ్రెండ్ అక్కడుంది అని తెలిసి కూడా..నేను దాని గురించి మాట్లాడటనికి వాడు నా కంటపడలేదు. ఇక్కడ నా దరిద్రం ఎంతలా నన్ను చుట్టుకుంది అంటే నేను, X ఒకే organizationకి సెలెక్టు అయ్యాము.కాని దేవుడు నన్ను ఒక కంట కనిపెట్టి వేరు వేరు టీంలలో వేసి ఈ నస నుంచి నన్ను తప్పించాడు.అయినా నేను నా మనసులో అన్ని అలాగే పెట్టుకున్నాను. ఒకసారి ఆఫీసు చాట్‌లో నన్ను గెలికాడు. నేను ఫోనులో ఎంత సేపు మాట్లాడుతున్నానన్న దాని పైన థీసిస్ ఏమైనా ఇస్తున్నావా? ఏ విధంగా నీకు సహాయపడగలను అని Customer Care Executive type లో అడిగేసరికి కిందికి రా, నేను మాట్లాడాలి ఓ టెన్షన్ పడిపోయాడు. నేను సున్నితంగా నాయనా! నేను ఫోనులో మాట్లాడితే నీకు సమస్య అయితే వచ్చి నాతో చెప్పు, అంతే కాని అందరి చెవులు కొరికి వాళ్ల చెవులకి హాని చేయకు అని సున్నితంగా మొత్తే సరికి నోరుమూసుకున్నాడూ. వీడి దరిద్రమైన etiquette కి ఇంకొక ఉదాహరణ నేను మీరు అని మర్యాదగ పిలిచినప్పుడు కూడా సెన్స్ లేకుండా నువ్వు అనే సంభోదించేవాడు. ఇంకా షాక్ అయ్యాను అని నేనంటే మీరు కూడా నన్ను తిట్టేస్తారు. ఇంక తప్పుతుందా!! నేను కూడా నువ్వు అనే అన్నాను. అయినా వీడు మనిషి కాదని కంఫర్మ్ చేశాడు. మరేంటో అని ప్రశ్న నన్ను వేయకండి. మీ ఊహకే వదిలేస్తున్నాను.

నేను ట్రైనింగ్ కోసమని United States of America వెళ్లాను. తను అక్కడ నాతో పాటు ఉన్నాడో లేదో నాకు తెలియదు. అసలు తను ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. నేను ఒక రోజు సాయంత్రం ట్రైనింగ్ పూర్తి చేసుకుని రోడ్డు మీద నడుస్తుంటే వీడు కనిపించాడు. దేశం కాని దేశం వచ్చాము అని ఏమీ మాట్లాడకుండా వెళ్లిపొబోయాను. ఈలోపు ఒకసారి తనని చూస్తే ఎవరితోనో సీరియస్‌గా నా వైపు చేతులు చూపించి మాట్లాడుతున్నాడు. నాకు ఏదో అనుమానంగా అనిపించింది. తిరిగి వెనక్కి చూసుకుంటే ఒక 5 మంది రౌడీలు నా వెంటపడీ తరుముతున్నారు. ఇంక నాకేమి చేయాలో తెలియక వొళ్లంతా చెమటలు పట్టేసాయి. నేను కూడా శాయశక్తుల పరిగెత్తుతూ చివరికి ఒకరి పెరట్లోకి నా బ్యాగు పడేసి నేను వేగంగా గోడ దూకేసి చెట్ల వెనకల దాక్కున్నాను . నా అదృష్టం ఏంటంటే నేను దూరింది ఒక సిఖ్కుల ఇంట్లో. వాళ్లు నన్ను పిలిచి ఇంట్లో కూర్చోపెట్టుకున్నారు. ఈ లోపల ఎవరో తలుపు తట్టారు ఆ అంకుల్ తలుపు తీసి సమాధానం చెప్పేలోపల కాల్చిపారేసారు. అమ్మో! వాళింట్లో తలదాచుకోవాడనికి చోటు ఇచ్చినందుకు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా ఇద్దరు చిన్న పిల్లల్లున్నారు ఆ ఇంట్లో.. దేవుడా! ఎవరికి ఏం హాని చేయకు అని మొక్కుకుని బిక్కు బిక్కుమంటూ చూశాను.. హమ్మయ్య! నా ప్రాణాలు పోలేదు. నేను ఇంకా బతికే ఉన్నాను. ఇదంతా కలా..!!!! చదివిన మీకే ఇంత టెన్షన్ గా ఉంటే నా పరిస్థితి గురించి కొంచెం అలోచించండీ. ఏంటో నా జీవితంలో నా మీద ఇంత కక్ష పెట్టుక్కున్న వ్యక్తిని చూడలేదు.

p.s: తన etiquette ని దృష్టిలో ఉంచుకుని ఏకవచనంలో వ్రాసాను. ఇలా ఎందుకు వ్రాశానంటే తన మీద ఉన్న ద్వేషమంతా ఇలా నా మనసులో నుంచి బయటపెట్టెసి ప్రశాంతంగా ఉందామని.

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com10tag:blogger.com,1999:blog-4190422837205224407.post-84824851030560241352012-11-04T23:55:00.001+05:302013-06-08T23:24:27.863+05:30ప్రియ నేస్తం

నాకు తనకి పరిచయం ఈ బ్లాగ్ ద్వారానే ఒక చిన్న కామెంట్ తో "నేను రెబెల్ సినిమా చూద్దామనుకున్నాను, మీ పోస్ట్ తో చూడకుండా నన్ను రక్షించారు" అని. అప్పటిదాకా అంత తియ్యని కామెంట్ నా బ్లాగ్‌లో కనిపించలేదు. వెంటనే తను చూడాలనుకుంటున్న సినిమా గురించి తన ప్రొఫైల్ నుంచి మెయిల్ ఐడి తీసుకుని ఒక మెయిల్ పెట్టాను. వెంటనే అటు వైపు నుంచి ఒక శుభోదయాన వేడి వేడి కాఫీ మెయిల్ వచ్చింది.

వెంటనే మెయిల్ నుంచి చాట్ లోక మారింది. వెంటనే ఫోను నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాము. ఆ తర్వాత మాటల ప్రవాహం జరిగింది మా మధ్యన. తర్వాత వెంటనే మనం కలవాలి అని అనుకున్నాము కాని ..అది ఇంత తొందరగా జరుగుతుందని మేమసలు ఊహించలేదు.

పోయిన బుధవారం ఉదయం తన నుంచి ఫోను "చిన్ని ! లేయ్..నేను వచ్చె వారం నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను." నేను వెంటనే "సరే. నేను కాసేపు తర్వాత ఫోను చేస్తాను. ఎందుకంటే నేను వచ్చే వారం మా ఊరు వెళ్తున్నాను. నేను మా అమ్మతో మాట్లాడి ఏ విషయము చెప్తాను." నేను రాకు అని చెప్పలేను..ఎందుకంటే నాకు కూడా తనని ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఆశగా ఉంది. అమ్మను ఎలాగోలాగా తను వస్తోందని చెప్పి, నేను ఊరు రావడం ఒక 2 రోజులు ఆలస్యం అవుతుందని చెప్పి ఒప్పించాను.సరే ఒక వైపు నుంచి ఉన్న టెన్షను తగ్గిపోయింది. ఇంక సెలవల సంగతి మేనేజరు గారికి చెప్పి 2 రోజులు సెలవలకి అప్ప్లై చేసాను. సరే..ఒక వైపు తను వస్తుందో, రాలేదో చివరికి ఏదైనా కారణాల వల్ల అని అలోచిస్తూ తను వచ్చే వారం వస్తుందని ఎదురు చూస్తున్నాను.

ఈలోపు తన దగ్గర నుంచి ఫోను "భరత్ ఈ వారమే హైదరబాదు వస్తున్నాడూ, అందుకని నేను కూడా ఈ వారమే వస్తాను. నువ్వు పండగకి ఇంటికి వెళ్లొచు కదా!!". ఒక విధమైన సంతోషం తనని తొందరగా చూసేయొచ్చు అని!! శుక్రవారం తను బయల్దేరాలంటే గురువారం తత్కాల్లో టిక్కెట్ చేయిస్తాను భరత్ తో అని చెప్పింది. నేను శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాదుకి ఉన్న ట్రెయిన్స్ అన్ని చూసి ఒక ట్రెయిన్ తనకి అనుకూలంగా ఉందని చెప్పాను.నాతో మాట్లాడేటప్పుడే తన మొబైల్ ఛార్జింగ్ తక్కువుందని చెప్పింది. నేను చెప్పిన ట్రైన్ వివరాలు భరత్ కు చెప్పే లోపలే తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆ విషయం తెలియక తను వస్తే ఏమేమి చేయాలో అలోచిస్తూ..మధ్య మధ్యలో తన మొబైల్ కి కాల్ చేస్తున్నాను. చివరికి సాయంత్రం తన దగ్గరి నుంచి ఫోను, "లేదు! కుదరట్లేదు. నేను భరత్ కి చెప్పే లోపల నా మొబైలు లో ఛార్జింగ్ అయిపోయి మన ఆశల్ని అడియాశలు చేసింది.టిక్కెట్ దొరకలేదు అని విషయం చెప్పింది." దానికి నేను "పర్లేదులే..వచ్చే వారం కలుద్దాము" అని ఓదార్చేసాను.

ఎందుకో మళ్లీ మాటల్లో నువ్వు వస్తావని అనుకున్నాను..కాని నువ్వు రావట్లేదు అని భాదపడేసరికి..చిన్ని! నాకు టిక్కెట్ చేసెయ్యి అని చెప్పింది. తనకి బస్ ప్రయాణం అలవాటులేకపోయినా నా కోసం 15 గంటలు ఓంటరిగా ప్రయాణం చేసి నన్ను చూసి మురిసిపోయింది.

తను పంపిన వేడి కాఫీ మీ అందరితో పంచుకుంటున్నాను..

ఈ కాఫీనే మమ్మల్ని కలిపింది. తను నాకు చెప్పిన మాటలకి చాలా ఆనందం, ఆశ్చర్యం. తన పరిచయం నాకొక గొప్ప అనుభవం.తను మరెవరో కాదు.. "MY DEAR LOVING FRIEND PRIYA". తను నాతో ఉన్న ప్రతి క్షణం నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, బతిమిలాడుతూ, నవ్వుతూ నా పైన ప్రేమను కురిపిస్తూ చాలా సంతోషంగా గడిచిపొయింది..తను ఈ రెండు రోజులు నా పనులతో అలసిపోకుండా తను కూడా నాతో పాటు పరుగులు పెట్టి..ఇంకా చాలా మాటల్లో చెప్పలేని అనుభూతుల్ని మిగిల్చి మళ్లీ కలుద్దాము అని...

ప్రియా.. ఇది మన గుర్తుగా..మనం ఎంత బిజీగా ఉన్నా ఈ పోస్టు చూసిన వెంటనే ఒకరికి ఒకరం అన్న ధైర్యం వచ్చేయాలి. . THANKS FOR EVERYTHING. నా జ్ఞాపకంగ ఇది నీకు.

Chinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com18