Saturday 8 June 2013

సీ 'రియల్' రాధమధు



                   ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా మీరు పూర్తిగా చదివిన పిమ్మట నను నిందించరాదని.. ఇది కేవలం ఒక సీరియల్ వీరాభిమానిగా వ్రాసుకుంటున్న అభిప్రాయాలేనని..ఏదో అభిమానముతో ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ చెప్పినా అవి మీ మనసులో పెట్టుకుని నా బ్లాగు పైకి దండయాత్రకు రారని ఆశిస్తూ...
చక్రవాకం అంటే గవాక్షమా?? :P
                 నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ఋతురాగాలు అనే సీరియల్ డిడి-8లో ప్రసారమయ్యేదంట..ఎందుకంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడాలేదు.. సో మనకు అది ఔట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అన్నమాట..అప్పటికి మా ఫ్రెండ్సంతా మాట్లాడుకుంటున్నప్పుడు దీని గురించి ఎప్పుడైనా ప్రస్తావన వస్తే అందరు తెగ రెచ్చిపోయి చెప్పేవాళ్లు..అప్పుడు మ అమ్మ ఇలాంటి మంచి ధారావాహిక చూడనివ్వకుండా బాల్యాన్ని చిదిమేసిందని భాదపడేదాన్ని :(
                     ఇంక జీవితం ఋతురాగాల నుంచి చక్రవాకంలోకి మారింది..అంటే మేము ఎలిమెంటరి స్కూల్లోంచి హైస్కూల్లోకి వచ్చి..అబ్బో అక్కడి నుంచి మేము ఇంటర్మీడియట్ చదివి...అబ్బో ఇంజినీరింగ్లోకి కూడా వచ్చేశాము..మా హాస్టల్లో జనాలకి ఎంత పిచ్చి ఉండేదంటే మా రూంలోని కిటికీలోంచి  కనిపించే పక్క అపార్ట్మెంట్ గదిలో ఉన్న టి.వి లో వచ్చే ఈ సీరియల్ కోసం జనాలు పిచ్చ పిచ్చగా వచ్చి ఒకరు తదేక దృష్టితో చూసి మిగతా వాళ్లందరికి లైవ్ అప్డేట్లు ఇచ్చేవాళ్లు..అబ్బో అదో తుత్తి మా వాళ్లకి.. అయినా కూడా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు..అయినా మనకు ఋతురాగాలి గురించే సరిగా తెలియనపుడు ఇంక చక్రవాకం ఏం అర్థమవుతుందిలే అనే భ్రమలో చాలా కాలం బ్రతికాను :P అదేదో ఋతురాగాలు,చక్రవాకం పార్ట్1,పార్ట్2ల్లాగా :)
మొగలిరేకుల వాసన ఇంక ఎమైనా మిగిలిందా?!
                       మావాళ్లు మాత్రం చక్రవాకం అంటే అర్థమేంటో అని ఓ గింజుకునేవాళ్లు..ఎందుకంటే మనకు తెలుగే అంతంతమాత్రంగా వచ్చు ఇంక ఇలాంటి గ్రాంథికపదాల గురించి చాలా సీరియస్ సమావేశాలు జరిగేవి..చివరికి తేల్చిందేంటి అంటే చక్రవాకం అంటే గవాక్షం అని, బండికి రెండు చక్రాలిలాగా ఉండాలి కాబట్టి ఆలుమగలు..అందుకని ఆ అర్థం వచ్చేలాగా పెట్టారని..అబ్బో మా వాళ్లు అనుకోని అర్థం లేవు..డిరైవ్ చేయని థియరీ లేదు..చివరికి టెన్షన్ తట్టుకోలేక మా సంస్కృతం సారిని మెల్లిగా అడిగేసారు.. పాపం సారు మంచివారు కాబట్టి అది ఒక పక్షి పేరని చెప్పగానే మా వాళ్లంతా అయినా సింబాలిక్గా పక్షి ఎగురుతుంది కదా సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు .. అప్పుడే అనుకున్నాం కదా అని భుజాలు తడిమేసుకున్నారు:)
          చక్రవాకం అయిపోయిందని మూగగా రోదించే జనాల కంటతడి చూడలేక ఈసారి  మొగలిరేకులని మొదలుపెట్టారు.. అప్పటికి మేము ఇంజినీరింగ్లోకి రావడంవల్ల ఇక అర్థాలకి పెద్ద సమావేశాలు జరగలేదు..అది కూడా విజయవంతంగా ఒక రెండో,మూడో వేల(అభిమానులు మన్నించాలి..మీరు ఇంకొక 3 వేలు జతచేసి ఆరువేలుగా చదువుకోగలరు)ఎపీసోడ్లు పూర్తి చేసుకుని ఈ మధ్యనే ఇక మొగలిరేకులు వాటి వాసన పూర్తిగా పోయిందని నిర్ధారించుకుని ముగింపు ఇచ్చారంట..కాని ఇది జెమిని టి.వి. మిగతా తన సీరియళ్ల టి.ఆర్.పి రేటుని పెంచడానికే ఇలా అర్ధాంతరంగా ఆపేశారని విశ్వసనీయవర్గాల భోగట్టా..:)  
                  ఇలా సీరియల్ బాధితురాలిని నేను కాదు అని సగర్వంగా చెప్పుకుంటున్న సమయంలో నాకు ఒక సీరియల్ తెగ నచ్చేసింది..అబ్బో అదేంటంటే అది జెమిని టి.వి లోది కాదు అది మాటివి ఛానెల్లో ప్రసారమయ్యేది-"రాధమధు". నేను టైటిల్ సాంగు వినే పెద్దాఆఆఆఆ అభిమానిని అయిపోయాను..చెప్పాలంటే అందులోని పాత్రలకి (Not vessels,characters :D) 
సీరియల్ కు కొత్త నిర్వచనం దీనివల్లే
కూడా..వాళ్ల పాత్రలను తీర్చిదిద్దిన తీరు అద్భుతం అండి.కథా,కథనం చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడా కక్ష్యలు,ప్రతీకారాలు,ఎత్తులు,పైఎత్తులు లాంటివి లేకుండా ఆహ్లాదంగా గడిచిపోతుంది.
ఈ సీరియల్ మొదలయ్యేటప్పుడు చివరిలో కథ అని యుద్ధనపూడి సులోచనారాణి అని వేసేవారు..సీరియల్ ఏమవుతుందా అని టెన్షన్ వచ్చినప్పుడల్లా ఆ పుస్తకమేదో కొనేసుకుని చదివేయాలి అని అనుకునేదాన్ని.ఈ సీరియల్ కు మాత్రం మ అమ్మ,నేను సంయుక్తంగా అభిమానులం అవ్వడంచేతా నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు లైవ్ అప్డేట్స్ ఇచ్చేది. నిజంగా సీరియళ్లకున్న గొప్ప లక్షణం ఏమంటే మనం ఏ ఎపిసోడ్ చూసినా కథ అర్థం కాదు అనే పెద్ద గందరగోళం లేకుండా ఒక రెండు,మూడూ నెలలకి కూడా కథలో పెద్ద మార్పుండదు కాబట్టి మనం ఏదో మిస్స్ అయ్యామన్న భావన ఉండదు. ఇలా అప్పుడు చదవాలనుకున్న సులోచనారాణి గారి ఈ సీరియల్ కు ఆధారమైన నవల "గిరిజాకళ్యాణం" నాకు ఈరోజు గూగుల్లో దొరికింది. ఎవరో పుణ్యాత్ములు..చక్కగా 270 పేజీలు స్కాన్ చేసి పెట్టారు..నేను నిన్న రాత్రి 11.30 మొదలుపెడితే ఇదిగో 3.50కి నవల పూర్తిగా చదవడమైంది..చదివిన ఆనందంలో అన్ని గుర్తొచ్చి ఇలా వ్రాశాను..

ఎంతో అర్థమైన వాక్యాలు కొన్ని ఆ పాటలోంచి ...
ఆగదేనాడు కాలము,
ఆగిన గడియారము...
కాలమే ఎంత సాగినా,
ఓటమవ్వదు విజయము...
ఓడినంతనె గెలుపుపై నమ్మకమే నే వదలను
నమ్మలేని విజయాని పై భ్రమలోనే గడపను
కెరటాలు కోటి సార్లు ఎగిరి,
గగనాన్ని నేల పైకి తేవా..
ఆ నింగి నేలా ఎదురెదురుగున్నా
రెంటికి సాధ్యమా వంతెనా!!!!..   
నవల లింకులు(ఎవరికి అభ్యంతరం కాదని అనుకుని)
గిరిజా కళ్యాణం-1
గిరిజా కళ్యాణం-2
  
                

11 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సీరియల్స్ చూడని ఆడపిల్లలుకూడా ఉంటారని మిమ్మల్ని చూసాక తెలిసిందండి... మీ టపా బాగుంది..

    ReplyDelete
  3. ఇప్పుడు జీతెలుగులో రాత్రి పదిగంటలకి "మంగమ్మగారి మనవరాలు" అనే సీరియల్ మొదలైందండీ. ఇందులో హీరోయిన్ కూడా గిరిజాకల్యాణం లో లాగే ఆత్మాభిమానం ఉన్న అమ్మాయన్నమాట.

    ReplyDelete
  4. ఈ సీరియల్స్ ఏవీ నేను చూడలేదు...పేర్లు విన్నాను అంతే.

    ReplyDelete
  5. వామ్మో.. నువ్వు సీరియల్స్ చూస్తావని నాకిన్నాళ్ళు తెలియదే! సీరియల్స్ కి నేనైతే ఆమడ దూరంలోనే ఉంటుంటాను :)

    ఆ "గిరిజ కళ్యాణం" నవల అయితే నీ మాటల్లోనే వింటూ ఊహల్లో చూసేసాను. అంత ఓపికగా చెప్పినందుకు థాంక్స్ నీకు :)

    ReplyDelete
  6. చిన్ని గారూ .నేనూ మీలాంటి జీవినే! tvకి ఆమడదూరం .సీరియల్స్ చూడకుండా ఎలా ఉంటారు ?అని చాలామంది అడుగుతారు .హాస్యంగా బాగా .వ్రాసారు .

    ReplyDelete
  7. Girija kalyanam link ivvagalara andi ?

    ReplyDelete
    Replies
    1. హాయ్ నీరు గారు,
      గిరిజా కళ్యాణం లింకులు పైన పెట్టాను, మీ కోసం
      http://www.scribd.com/doc/23240250/Yaddanapudi-Sulochana-Rani-Girija-Kalyanam-Part-1
      http://www.scribd.com/doc/23240518/Yaddanapudi-Sulochana-Rani-Girija-Kalyanam-Part-2

      కిందికి స్క్రోల్ చేసి చూడండి, స్కాన్ పేజెస్ కనిపిస్తాయి.

      Delete
  8. chinni Garu,
    mee blog naaku chala nachindi.Infact Radha Madhu naaku kuda nachindi initial ga. Kani serial ante adoka bhootam ane feeling naaku undi. anduke balavantam ga dooramayya. Paiga, Mana serials anii generations patu nadustayi kada.
    storyline aite chalabagundi.
    best of off all , you reminded me of those days. thanks

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.