Wednesday 15 May 2013

మనసుల గారడీ(కథ)

                 పోద్దున్నే కళ్లు తెరవడానికి రావట్లేదు. రాత్రంతా ఏదో జరిగినదని తెలుస్తూనే ఉంది కానీ అది బుర్రలోకి వచ్చి అది కాస్తా కళ్లలోంచి సన్నటి నీటిధారగా బుగ్గల మీదుగా ఒలికిపోయింది
                     రాత్రి స్వప్నకు,వంశీకు మాట మాట పెరిగి ఇలా తను ఇంతలా బాధపడుతుంది అనుకుంటూ వంశీ అన్న మాటలకి జీవితం పైన విరక్తి కలిగి అప్పుడే బిల్డింగ్ పై నుంచి దూకో, ఫ్యాన్ కు ఉరేసుకునో చావాలనిపిస్తుంది. ఇదే శపథం రాత్రి వంశీ దగ్గర చేసినా తన నిస్సహాయతను, చేతకానితనాన్ని తలుచుకుని ఇంకా కృంగిపోయింది. చావాలనిపిస్తుంది కానీ అంత ధైర్యం లేదు. అలా అని రోజు ఈ మానసిక సంఘర్షణ అనుభవిస్తూ బతకాలని కూడా అనిపించట్లేదు. ఈ విషయం అమ్మ,నాన్నలతో చెప్పలేను, ఎందుకంటే వాళ్లకి అసలు వంశీ అంటే ఎవరో తెలియనే తెలియదు. ఇంక అక్కతో ఈ విషయం గురించి ఒకసారి చెప్పినా, నువ్వు ఏదైనా చేసేముందు నాకెందుకు చెప్పవూ అంది. ఎటు నుంచి చూసినా తప్పు నాదే స్పష్టంగా తెలుస్తుంది.
                     కళ్లు మూసుకుని ఒకసారి జరిగిన దాన్ని తలుచుకుంది. మార్చి  ఒకటో తేది..వంశీ పుట్టినరోజు, తను ఎంత బతిమిలాడినా వినకుండా నాకు ఇంట్లోనే పుట్టినరోజు చేసుకోవడం అలవాటు అని వెళ్లిపోయాడు, తన కోసం చేసిన గ్రీటింగ్ కార్డ్ కూడా తీసుకోకుండా నీ దగ్గర ఉంచుకో తర్వాత తీసుకుంటాను అని ట్రైన్లో నుంచి చేయి ఊపుతూ ఇంటికి వెళ్లిపోయాడు. మనసులో కొంచెం నిరాశగా అనిపించింది.మార్చి ఒకటో తేది అనుకోకుండా స్వప్న స్నేహితుడు వినయ్ ఏదో పని ఉండి స్వప్న ఆఫీసువైపు వచ్చి అలాగే తనని కలుస్తానని ఫోన్ చేసాడు.. వినయ్ అంటే చిన్నప్పటి తనతో పాటు కలిసి చదువుకున్న అబ్బాయి. ఈ మధ్య తను ఊరెళ్తే కనిపించి తను కూడా బెంగళూరులోనే ఉన్నానని చెప్పి ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
              ఇక అనుకోకుండా వస్తానని చెప్పడం వల్ల తను నేరుగా ఆఫీసు దగ్గరికి వచ్చి కలవమంది. తను రాగానే విజిటరుగా వాళ్ల క్యాంటీను వరకు తీసుకెళ్లింది అంతకు మించి ఏం చేయాలో అర్థమవక. ఆ తర్వాత వినయ్ చొరవగా ఇక్కడ దగ్గర్లో ఏదైనా థియేటరు ఉంటే సినిమాకు వెళ్దామా అని అనగానే, స్వప్న సంశయిస్తూనే సరే అంది. అది జరిగిన తర్వాత వినయ్ తన మైలు ఐడి ఇచ్చి కొద్ది సేపు మాట్లాడమని అడిగాడు. వంశీ గురించి తను కలిసినప్పుడు వివరంగా చెప్పినా తనతో చాట్ చేసేటప్పుడు తనంటే ఇష్టమని వినయ్ చెప్పాడు. స్వప్నకు ఏం చేయాలో పాలుపోలేదు.  నాకు చిన్నపటి నుంచే ఇష్టం , కానీ ఆ విషయం అప్పుడు చెప్పడనికి అంత వయసు లేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నా అని చెప్పాడు.ఈ విషయం అంతటితో వదిలేసి వినయ్ తో మామాలుగా మాట్లాడింది.వంశీ ఊరి నుంచి రాగానే వినయ్ కలిసాడని చెప్పింది కానీ తనతో పాటు సినిమాకి వెళ్లానని చెప్పలేకపోయింది.
                  ఒకరోజు వంశీ ఫోన్లో తన ఐడి, పాస్స్వర్దుతో మైలులోకి లాగిన్ అవడానికి ప్రయత్నించింది, కానీ  అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడంతో లాగిన్ అవలేకపోయింది. వంశీ,తను ఆరోజు రాత్రి భోజనం చేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. వంశీ ఇంటికి వెళ్లి తను మొబైలులో మైలు తెరవడానికి ప్రయత్నిస్తే స్వప్న మైలు తెరుచుకుంది, తెరుచుకోగానే ఏమున్నాయో అని చూసి, వెంటనే స్వప్నకు ఫోను చేసి వినయ్ ఎవరు? అని అడిగాడు, స్వప్న నువ్వు నా మైలు చూసావా అని అడిగింది?
                           వంశీ వెంటనే నీ లాగా ఎవరి బైకో ఎక్కి, వాళ్లతో సినిమాలు చూసే దాన్ని నేను పెళ్లిచేసుకోవాడానికి రెడీగా లేను అని ఆవేశంగా నేను ఇప్పుడే నీ మైలు, ఫోను నంబరు అన్ని బ్లాకు చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటి దాక నేను నాకు అమ్మాయిల పైన నమ్మకం లేదని చెప్పేవాడిని, కానీ ఇప్పుడు చెప్తున్న నీ పైన నమ్మకం లేదు.స్వప్న తనదే తప్పని తెలుసుకుని వంశీ వాళ్ల ఆఫీసు దగ్గరికి వెళ్లి ఉదయం, సాయంత్రం తన కోసం చూసేది ప్రతిరోజు. తను చేసిన తప్పుకు క్షమించమని కాళ్ల మీద పడి వేడుకుంది. అదే విషయం వంశీతో చెప్తే కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయమేమి కాదు అని అన్నాడు.
      ఇంకొకరోజు వంశిని క్షమించమని  అడిగితే.. చూడు, నేను ఈరోజు మా ఆఫీసులో మా కోలీగ్లలో పదిమంది అమ్మాయిలని అడిగాను సినిమాకు వెళ్దామని, అందరూ ఎందుకు రావాలి నీతో అని అడిగారే కానీ నీలాగా అడిగిన వెంటనే ఎవరూ రాలేదు, అందరి అమ్మాయిలలోకి నీవే తేడా..ఆ విషయం ఇప్పటికైన తెలుసుకో అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత స్వప్నకు చాలా బాధగా అనిపించింది. తను తొందరపడి చేసిన తప్పుకు జీవితాంతం శిక్ష పడిందనుకుంది, తను చేసిన తప్పు వల్ల జీవితాంతం తనతోపాటు కలిసి ఉండాల్సిన వ్యక్తిని కోల్పోయింది అని అనుక్షణం కృంగిపోతోంది.
                            ఈ కథలో నిజంగా స్వప్న తప్పు చేసిందా? స్వప్న అనుభవించే శిక్ష సరైందా?
                
                             

11 comments:

  1. yes....she did mistake....she deserves that punishment...

    ReplyDelete
  2. Thanks for your response. I would be glad if you commented with your name.

    ReplyDelete
  3. Swapna should have told Vamshi that she met Vinay who is her childhood friend and went to a movie with him. However, Vamsi's character looks stubborn to me. He should have at least listened to Swapna.

    ReplyDelete
    Replies
    1. Thanks Srinivas gaaru for you comment. ఇంతకు మీరు స్వప్నకు వేసిన శిక్ష గురించి చెప్పనే లేదు.

      Delete
    2. adi nenu sikshala bhavinchatamledandi...just miscommunication anukuntunna...maatladite solve avutundi anukuntunna...but yes, unless Vamsi listens to her, there is nothing that can be done I suppose. If he is not listening, Swapna is really a victim

      Delete
    3. ధన్యవాదాలు మీ స్పందనకు. మీరు చెప్పినదాంతో నేను ఏకీభవిస్తున్నాను.

      Delete
  4. Swapna is really lucky that she escaped such a crook....she should hav mentioned abt the movie but didn't...going to movie with another friend is not crime...she needn't feel so sorry for it...catching his legs to convince sounded so stupid and vamsi not getting convinced even then sounded more stupid....

    ReplyDelete
  5. స్వప్న చేసింది తప్పేనా... అంటే ఆ సందర్భానికి తప్పే. "పాత స్నేహితుడిని కలిశాను, సినిమాకు వెళదాం అనుకుంటున్నాం" అని గానీ, పోనీ తరువాతైనా "ఇలా స్నేహితుణ్ణి కలిసినపుడు సినిమాకు వెళ్లాం" అని గానీ చెప్పుండాల్సింది. అలా చెప్పకపోవడం తప్పు.

    కాని స్వప్న ఏం చెబుతుందో కూడా వినకుండా కేవలం ఒక మగ స్నేహితునితో చెప్పకుండా సినిమాకు వెళ్ళిందన్న కారణానికి వంశీ అలా నోరు పారేసుకోవడం, స్వప్న ఏం జరిగిందో వివరించి సారీ చెప్పినా కూడా అతను అలా ప్రవర్తించడం అన్న అంశాలు ఆ వ్యక్తి మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసుండాలంటే మరుముఖ్యంగా కావాల్సింది (ఆర్ధిక విషయాలు పక్కన పెడితే) నమ్మకం, ప్రేమ. వంశీలో అర్ధం చేసుకునే మనసే కనిపించడం లేదు కదా.. మరి అటువంటి వ్యక్తి తోడుని ఇంకా జీవితాంతం కోరుకోవడం, అతనన్న వృధా మాటలను పట్టించుకొని "శిక్ష" అని భావించడం స్వప్న చేస్తున్న మరో తప్పని నా అభిప్రాయం.

    ReplyDelete
  6. ప్రియ గారి అభిప్రాయంతో నేను కూడా ఏకిభవిస్తూ ... నమ్మకం, ప్రేమ అనే పెద్ద మాటలు అతనిలో వెతకడం కూడ దండగే అనిపిస్తుంది నాకు. ఇక అతనిలో నమ్మకాన్ని, ప్రేమను వెతుకుతూ, దాన్ని శిక్షగా బావిస్తున్న ఆ అమ్మాయికి జీవితం పట్ల అంత మెచ్యూరిటి రాలేదనిపిస్తుంది.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. its a real story it was done chinni knws who r they!!! ekada okarimida okariki namaklam undali ,స్వప్న చేసింది తప్పేనా... అంటే ఆ సందర్భానికి తప్పే. "పాత స్నేహితుడిని కలిశాను, సినిమాకు వెళదాం అనుకుంటున్నాం" అని గానీ, పోనీ తరువాతైనా "ఇలా స్నేహితుణ్ణి కలిసినపుడు సినిమాకు వెళ్లాం" అని గానీ చెప్పుండాల్సింది. అలా చెప్పకపోవడం తప్పు.

    కాని స్వప్న ఏం చెబుతుందో కూడా వినకుండా కేవలం ఒక మగ స్నేహితునితో చెప్పకుండా సినిమాకు వెళ్ళిందన్న కారణానికి వంశీ అలా నోరు పారేసుకోవడం, స్వప్న ఏం జరిగిందో వివరించి సారీ చెప్పినా కూడా అతను అలా ప్రవర్తించడం అన్న అంశాలు ఆ వ్యక్తి మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసుండాలంటే మరుముఖ్యంగా కావాల్సింది (ఆర్ధిక విషయాలు పక్కన పెడితే) నమ్మకం, ప్రేమ. వంశీలో అర్ధం చేసుకునే మనసే కనిపించడం లేదు కదా.. మరి అటువంటి వ్యక్తి తోడుని ఇంకా జీవితాంతం కోరుకోవడం, అతనన్న వృధా మాటలను పట్టించుకొని "శిక్ష" అని భావించడం స్వప్న చేస్తున్న మరో తప్పని నా అభిప్రాయం.

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.