Saturday 25 August 2012

బ్లాగ్ పేరుతో వచ్చిన తంటా


చాలా బ్లాగులు చదివిన అనుభవంతో ఈరొజు ఒక శుభముహుర్తం చూసుకుని బ్లాగు చేద్దామంటే, బ్లాగూ పేరుతో పెద్ద తంటా వచ్చింది..
ఎలా అని ఆలోచిస్తూ నేను చేసిన ప్రయత్నాలు మచ్చుకు కొన్ని...

MENTOS తిన్నాను( ఎందుకంటే ప్రకటనలో చూపించినట్టు నా బుద్ధిని వెలిగించుకోవడానికి..:))
అబ్బే..లాభం లేదండే..పనిచేయలేదు..
ఈసారి నేను ఎలా అయినా నామకరణం చేయాల్సిందే అని..
ఒక kfc chicken bucket లాగించేసాను..అయినా అది finger licking కాని.. brain storming కాదని నాలుక కర్చుకుని .. నెమ్మదిగా ఆలోచిస్తుండగా పిల్లల పేర్లు లాగ బ్లాగు పేర్లు అన్న పుస్తకం ఉంటే ఎంత బాగుండేదో  అనుకుంటూ (ఇంకా అలాంటి పుస్తకం రాయలన్న అలొచన నాకు తప్ప మరెవరికి రానందుకు  గర్వపడి...:D)
మళ్లీ గట్టి ప్రయత్నం చేస్తే
ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ...
నేను నా గురించి వ్రాస్తున్నాను కాబట్టి ..
"Na_Swagatam" అని..
"Na_katalu " అని...
" Nenu_Na_Experiences" అని..
"Nenu_Experiences " అని...
" kathalu" అని..
"swagatam" అని...
"my_technicaltips" అని ... (నాకు తెలిసినవి చెబుదామని)

గూగులమ్మ నువ్వు చెప్పిన పేర్లన్ని నా పిల్లలికి..(అదేనండీ నా(బ్లాగర్) లో నా బ్లాగు కన్నా ముందే బారసాల  జరుపుకున్న బ్లాగులకి) ఉన్నాయి..నువ్వు వేరే పేరు చూసుకోమంది..
Experiencesని తెలుగులో ఏమంటారో అని ఆలోచిస్తుండగా...
"అనుభవాలు" అని తట్టిందండి...:)...
ఒక ఐడియా నా బ్లాగు పేరుని మార్చేసింది ...
 ప్రయత్నించి మహత్తరమైన ఐడియా  తో నా బ్లాగు నామకరణం చేయడం జరిగింది...

నా బ్లాగు నామకరణానికి విచ్చేసిన అందరికి నా ధన్యవాదాలు

15 comments:

  1. బారసాల నామకరణం బాగానే జరిగేయి. శుభం భూయాత్! జైత్ర యాత్రకి బయలుదేరండి.

    ReplyDelete
  2. ఇంతలా ఆలోచించి పెట్టాలా పేరు??? నేనేమిటో నోటికొచ్చింది పెట్టేసా :( ఆ పుస్తకమేదో త్వరగా రాద్దురూ... :):)

    ReplyDelete
  3. అలా చేసారన్నమాట మీ బ్లాగ్ నామకరణం . బాగుంది :)

    ReplyDelete
    Replies
    1. @కష్టేఫలే
      థ్యాంక్స్ అండీ.. మీ బ్లాగుకు నేను రెగ్యులర్ విజిటర్ని..
      మీ చూసి చాలా సంతోషపడ్డాను.
      @రసఙ
      పుస్తకం రాసి మీకు అంకితం చేయాలని నిశ్చయించుకున్నాను.:D
      ధన్యవాదాలు మీ commentku..

      @ మాలా కుమార్
      థ్యాంక్స్ అండీ:)

      Delete
  4. చిన్నిగారూ !

    బ్లాగు ప్రపంచానికి స్వాగతం !

    నామకరణం అనుభవం తో ప్రారంభమైన మీ అనుభవాలు అందరినీ ఆలోచింపజేస్తాయని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ ఆదరణకు.

      Delete
  5. బ్లాగుల లోకానికి స్వాగతం,

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.మీ బ్లాగింటిలో విహరిస్తున్నాను.

      Delete
  6. హ..హ..బావుంది. నా బ్లాగు నామకరణం గుర్తొచ్చింది . కేవలం వ్యాఖ్యలు రాయటానికే కదా అని పెద్దగా ఆలోచించకుండా నా స్పందన అని పెట్టేసాను.

    ReplyDelete
    Replies
    1. లలిత గారు.. మీ వ్యాఖ్య నన్ను చాలా సంతోషపరిచింది. ధన్యవాదాలు.

      Delete
  7. adagadam marachitini sumaaa...nijamganey oka bucket mottam tinesaraaa??

    ReplyDelete
  8. శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు..బక్కెట్ లాగించడం అంటే..నాలుగే నాలుగు ముక్కలండి:P

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.