Monday, 19 November 2012

అన్నయ్యలు-పరీక్షలు

         నాకు అంతగా ఊహ తెలియనపుడే మా అన్నయ్యవాళ్లు ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాశారు. ఆ కథలు మా అమ్మ చెప్పగా ఇప్పుడు గుర్తున్నాయి. ప్రతి రోజు వీళ్లు వ్రాసే పరీక్ష పేపరు లీక్ అయ్యిందని ఈనాడులో వచ్చేవంటా. అయినా కూడా అప్పుడు ఎవ్వరూ దాన్ని పట్టించుకుకోకపోవడంలో వీళ్లకి అవే పేపర్లతో పరీక్షలు జరిగిపోయాయంట. ఇంతగా లీక్ అయిన పేపర్లలో కూడా మ అన్నయ్య వాళ్లు బాగా చించి ఒకరు 65%, ఇంకొకరు 75% మార్కులు తెచ్చుకుని కాలర్లు ఎగరేసుకున్నారు. ఈ మార్కులు కూడా మా అమ్మ ఈనాడు పేపరులో ఉన్న ప్రశ్నలు చూసి వాటికి సమాధానాలు నేర్పించి పంపిస్తే వచ్చినవి. లేదంటే మా అన్నయ్యలకి అవి కూడా వచ్చేవి కాదనుకోండీ. :-o
question paper తెలిసినా కూడా ఇదే  expression!!
                
        అయినా వాళ్ల ప్రిపరేషన్ మాత్రం ఆహో, ఓహో లెవల్లో ఉండేది. వీళ్లు మొదటి నుంచి వాళ్ల స్కూల్లోనే నిద్రపోయేవారు. పరీక్షలు ఉన్న రోజుల్లో మాత్రమే కాదు, పరీక్షలు ఉన్నా, లేకపోయినా ఈ జీవులకి మాత్రం పవళింపుసేవ అక్కడే జరిగేది. పాపం పిల్లలు ఇంతగా కష్టపడుతున్నారని ఇంట్లో అందరు ఒక పిచ్చి భ్రమలో ఉండేవాళ్లు. వీళ్ళు స్కూల్లో పడుకోవడం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువ కనిపించి మా ఇంట్లో కూడా ఏమనేవారు కాదు. వాళ్లు ఇచ్చే buildup అలాంటిది మరి.
                తర్వాత మా అన్నయ్యలు చెప్పగా తెలిసిన విషయమేంటంటే, వీళ్ళ స్కూల్లో ఆ కాలానికే ఒక కంప్యూటర్ ఉండేది. వీళ్లకి క్వశ్చన్ పేపర్లు దాన్ని నుంచి ప్రింట్ తీసేవారంట. వీళ్లు సందు దొరికితే దూరిపోయే రకం. అందుకనే వాళ్ల మేనేజ్మెంట్ కూడా ఈ కంప్యూటర్ రూంలోకి ఎవరూ దూరకుండా తాళంచెవి వాళ్ల క్లర్క్ కి ఇచ్చి జాగ్రత్త చేయమని చేసేది. అయినా పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణం ఏడు సముద్రాల అవతల ఒంటి స్తంభంలోని చిలుకలో ఉన్నట్టు మనకు తెలియనంత వరకే కథ రసవత్తరంగా ఉంటుంది. తెలిసిన తర్వాతేముందండి? అంతే!! మన తోట రాముడు దాన్ని సంపాదించడం, మాంత్రికుని సంహారం, తోటరాముడి, ఇందుమతిల కల్యాణం. ఇలా మా తోటరాముళ్లకు కూడా వాళ్ల question papers ఉన్న గది తాళం చెవి క్లర్క్ ప్యాంటు జేబులో ఉంటాయని తెలిసిన తర్వాత వీళ్లు పరీక్షకి ఇంకా ఎక్కువ సమయం చదువుకునే వారు. మరి క్లర్క్ నిద్రపోవాలి కదా వీళ్ల పథకం పండాలంటే. ఆయన నిద్రపోయాడని బాగా confirm చేసుకుని ఆయన గదిలోకి వెళ్లి చడీ చప్పుడూ లేకుండా ఆ తాళాలు తీసుకుని వెళ్లి ఆ కంప్యూటర్ గది తెరిచి అందులో printouts తీసిన కార్బన్ కాగితం మీద ఉన్న అక్షరాలని బట్టి అవి ఏ ప్రశ్నలో తెలుసుకుని ఎక్కడివక్కడే సర్దేసి మళ్లీ యథాస్థానంలో పెట్టేసి గప్ చుప్ సాంబార్ బుడ్డీ!!
                   ఇంకా ఉదయాన్నే వాళ్ల claasmate ఒక అమ్మాయి వచ్చేది ఇంటికి వీళ్లు స్కూల్ నుంచి రాగానే, "ఏమైనా ప్రశ్నలు తెలుసా"? అని. అసలే మా అన్నయ్య వాళ్లు మహా తెలివిమంతులు. "కొన్నే తెలుసమ్మా!!" అని కొన్ని ప్రశ్నలే చెప్పి పంపించేవాళ్లు. ఎందుకలా అంటే వీళ్లకంటే ఆ అమ్మాయికు ఎక్కువ మార్కులు రాకూడదని.
                  వీళ్లకు question paper ముందు రోజే తెలిసినా వీళ్లు అవి కొన్నైనా చదివి చించుతారా?? అంటే 
ఉహూ!! వీళ్లు పరీక్షకి వెళ్లి ఆన్సర్ పేపర్లో కొన్నిటికి మాత్రమే సమాధానం వ్రాసి మిగిలిన వాటికి ఏ ప్రశ్నకి ఎంత 
స్పేస్ వదలాలో అంత వదిలేసి వచ్చేవారంట. మళ్లీ రాత్రికి ఆ answer papers ఉన్న గది తాళాలు  తీసుకుని,  అది తెరిచి అవి పుస్తకాలు చూసి వ్రాసేవారంట. ఇది మా అన్నయ్యల బద్ధకం. పరీక్షరోజుల్లో  మాత్రమే స్కూల్ దగ్గర పడుకుంటే పాపం వాళ్లపైన అనుమానం వస్తుందని ఇలా కష్టపడి చదివినట్టు నటించి పరీక్షల్ని బాగా చూసి వ్రాసి 
మా ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో మాత్రం.. బాగా కష్టపడిపోతున్నారు అనే ఇమేజ్ సంపాదించారు. వీళ్లు చేసిన సాహసకృత్యాలు తెలిసి ఇంట్లో బాగా నవ్వుకునేవాళ్లం.ఇవన్నీ వాళ్లకి ఉద్యోగాలొచ్చిన తర్వాతే బయటపడ్డాయనుకోండీ..
p.s: దీన్ని నేను ఇంకొకరు కూడా ఇలాగే చేసి తప్పుడు మార్గంలో నడవమని మాత్రం చెప్పట్లేదు. 
  

17 comments:

 1. Replies
  1. ప్రియ గారు, ఇటు రావడమే మానేసారూ.. మీ వ్యాఖ్యకు ధనవాదాలు :D :D

   Delete
 2. శ్రీనివాస్ గారు, ఇంకా దీనికి పార్ట్-2 ఉంది. ఇంకా అవి చదివి మీరు ఏమంటారో:P:)

  ReplyDelete
  Replies
  1. ఇంకేం మరి, త్వరగా రాసేయండి. చదివి చెప్తాం :)

   Delete
  2. త్వరలోనే వ్రాస్తానండి.:)

   Delete
 3. haha......baagundhi chinni gaaru....me annayyala exam preparation :)

  ReplyDelete
 4. bavundi chinni garu. kani me pata posts to compare cheste not a good post..

  ReplyDelete
  Replies
  1. మీరు చక్కని వ్యాఖ్య వ్రాశారు. నేను సరదాగా ప్రయత్నించాను..ఇంకా బాగా వ్రాయడానికి కృషి చేస్తాను. ధన్యవాదాలు :)

   Delete
  2. good. Sportive ga teesukunnaru. keep it up

   Delete
 5. హ.. హ.. భలే మాల్‌ప్రాక్టీస్!

  ReplyDelete
 6. ధన్యవాదాలు. మీ ఆశీస్సులు కలకాలం నా వెంట ఉండాలని కోరుకుంటున్నాను.

  ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.